ఆర్టీసీ బస్సును ఢీకొని విద్యార్థి.. | student dies of rtc bus accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొని విద్యార్థి..

Published Fri, Sep 22 2017 10:43 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

student dies of rtc bus accident

కదిరి అర్బన్‌: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో ఆర్టీసీ బస్సును బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఓబుళదేవరచెరువు మండలం తుమ్మలకుంట్లపల్లికి చెందిన విజయశేఖర్‌ (21) కదిరిలోని నారాయణ పాఠశాల వద్దనుంచి అడపాలవీధిలోకి వెళ్లేందుకు తన ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. రోడ్డు దాటే క్రమంలో తన ముందు పోతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన విజయశేఖర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగాఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement