అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.. ఎవరీ విజయ్‌కుమార్?
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ రెండు వరుస పరాజయాల తర్వాత రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన బౌలర్ విజయ్‌కుమార్ వైశాక్ ఆకట్టుకున్నాడు.
డెబ్యూ మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ వికెట్‌ను తీసుకున్న విజయ్ కుమార్ తొలి ఐపీఎల్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, లలిత్ యాదవ్‌ల వికెట్లు తీసి మొత్తంగా 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆర్సీబీ తరపున డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ బౌలింగ్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.
ఎవరీ విజయ్‌కుమార్ వైశాక్?
కర్నాటకకు చెందిన విజయ్‌కుమార్ వైశాక్ 2020-21 సీజన్లో విజయ్‌హజారే ట్రోఫీలో కర్నాటక తరపున దేశవాలీ క్రికెట్లో అరంగేట్రం చేసి లిస్ట్-ఏ మ్యాచ్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టి20 క్రికెట్లో డెబ్యూ ఇచ్చాడు. ఇక కర్నాటక తరపున 2021-22 రంజీ ట్రోఫీ సీజన్లో బరిలోకి దిగాడు.
ఇప్పటివరకు 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 38 వికెట్లు, 14 టి20ల్లో 22 ఇవకెట్లు, ఏడు లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. యార్కర్లు, నకల్బాల్స్ వేయడంలో విజయ్‌కుమార్ స్పెషలిస్ట్. ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టాడు.
లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, సీఎస్కేలకు నెట్‌బౌలర్‌గా వెళ్లాలని ఆశపడినప్పటికి ఆయా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే కేకేఆర్ నెట్ బౌలర్‌గా అవకాశం ఇచ్చింది. ఇక ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ గాయపడడంతో అతని స్థానంలో విజయ్‌కుమార్ వైశాక్‌ను రీప్లేస్ చేసుకుంది.
Vyshak Attack! A maiden #TATAIPL wicket to remember! 👏#RCBvDC #IPL2023 #IPLonJioCinema | @RCBTweets pic.twitter.com/pSFD5VYpCl
— JioCinema (@JioCinema) April 15, 2023
చదవండి: గెలిచారు.. కానీ తప్పిదాలు చాలానే