the village
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు
మరో వీకెండ్‌కి అంతా సిద్దమైపోయింది. కాకపోతే ఈసారి థియేటర్లలోకి వచ్చేవాటిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. కాబట్టి ఆటోమేటిక్‌గా అందరి చూపు ఓటీటీలపై పడుతుంది. దాన్ని క్యాష్ చేసుకునేలా ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. లిస్టులో చాలా ఉన్నప్పటికీ రెండు మూడు మాత్రమ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?) దసరా కానుకగా బిగ్ స్క్రీన్‌పై రిలీజైన దళపతి విజయ్ 'లియో' సినిమా.. ఈ శుక్రవారమే ఓటీటీలోకి రానుంది. దీంతో పాటే డీమన్(తమిళ), చావెర్(మలయాళ), పులిమడ, ఒడియన్ లాంటి తెలుగు డబ్బింగ్ లాంటి చిత్రాలు కూడా ఉన్నాయండోయ్. ఇవన్నీ పక్కనబెడితే శ్రీలీల కొత్త మూవీ 'భగవంత్ కేసరి' కూడా ఈ వీకెండ్లోనే ఓటీటీలోకి రానుందని అంటున్నారు. దిగువన లిస్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది అని ఉన్న చిత్రాలు గురువారం రిలీజైనవి, మిగతావన్నీ మాత్రం శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యేవని అర్థం. ఈ శుక్రవారం రిలీజయ్యే మూవీస్ జాబితా (నవంబరు 24th) అమెజాన్ ప్రైమ్ ద విలేజ్ - తమిళ వెబ్ సిరీస్ ఎల్ఫ్ మీ - ఇటాలియన్ మూవీ భగవంత్ కేసరి - తెలుగు సినిమా ఆహా డీమన్ - తమిళ సినిమా అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ - ఎనిమల్ టీమ్ ఎపిసోడ్ సోనీ లివ్ సతియా సోతనాయ్ - తమిళ చిత్రం చావెర్ - మలయాళ మూవీ జియో సినిమా ద గుడ్ ఓల్డ్ డేస్ - తెలుగు వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ లియో - తెలుగు డబ్బింగ్ సినిమా ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ - స్వీడిష్ వెబ్ సిరీస్ ఐ డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ - స్పానిష్ సినిమా లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ - టర్కిష్ మూవీ గ్రాన్ టరిష్మో - ఇంగ్లీష్ చిత్రం ద మెషీన్ - ఇంగ్లీష్ సినిమా (నవంబరు 26) పులిమడ - తెలగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) మై డామెన్ - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) మై లిటిల్ పోని మేక్ యూవర్ మార్క్: చాప్టర్ 6 (స్ట్రీమింగ్) ఈ విన్ ఒడియన్ - తెలుగు డబ్బింగ్ మూవీ బుక్ మై షో యూఎఫ్ఓ స్వీడన్ - స్వీడిష్ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద నాటీ నైన్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) జీ5 ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 - హిందీ వెబ్ సిరీస్ ఎమ్ఎక్స్ ప్లేయర్ జోహ్రి - హిందీ సిరీస్ సైనా ప్లే కుడుక్కు 2025 - మలయాళ సినిమా (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) -
ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు
ప్రపంచకప్ అయిపోయింది. టీమిండియా ఓడిపోయింది. దీంతో సోమవారం నుంచి ఎవరి పనుల్లో వాళ్లుపడిపోతారు. మూవీ లవర్స్ మాత్రం కొత్త సినిమాల సంగతి చూద్దామని ఫిక్స్ అవుతారు. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం 'ఆదికేశవ', 'కోటబొమ్మాళి పీఎస్', 'ధృవనక్షత్రం' లాంటి మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం దాదాపు 24 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి రెడీ అయిపోయాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: డబుల్ ఎలిమినేషన్‌పై ట్విస్ట్.. అశ్విని, రతిక చివరకు అలా!) ఓటీటీలో ఈ వారం విడుదలయ్యే మూవీస్ చూసుకుంటే.. 'ద గుడ్ ఓల్డ్ డేస్' తెలుగు సిరీస్ తప్పితే డబ్బింగ్ బొమ్మలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 'స్క్విడ్ గేమ్' సిరీస్ సెకండ్ సీజన్, 'ద విలేజ్' సిరీస్‌తో పాటు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ఒపెన్ హైమర్', తెలుగు డబ్బింగ్ మూవీ 'ఒడియన్'.. ఈ వారం రిలీజ్ అవుతున్న వాటిలో చెప్పుకోదగ్గవిగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏయే మూవీస్.. ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (నవంబరు 20 నుంచి 26వరకు) నెట్‌ఫ్లిక్స్ స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 20 లియో (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 21 స్క్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 22 మై డామెన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 23 పులిమడ (మలయాళ సినిమా) - నవంబరు 23 ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్) - నవంబరు 24 ఐ డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ) - నవంబరు 24 లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం) - నవంబరు 24 గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 24 ద మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 26 అమెజాన్ ప్రైమ్ ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సినిమా) - నవంబరు 24 ద విలేజ్ (తమిళ సిరీస్) - నవంబరు 24 అమెజాన్ మినీ టీవీ స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) - నవంబరు 22 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 21 చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 23 (రూమర్ డేట్) జీ5 ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 24 జియో సినిమా ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) - నవంబరు 23 బుక్ మై షో ఒపన్ హైమర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 22 UFO స్వీడన్ (స్వీడిష్ మూవీ) - నవంబరు 24 సోనీ లివ్ చావెర్ (మలయాళ సినిమా) - నవంబరు 24 సతియా సోతనాయ్ (తమిళ మూవీ) - నవంబరు 24 ఆహా అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ (ఎనిమల్ టీమ్ ఎపిసోడ్) - నవంబరు 24 ఆపిల్ ప్లస్ టీవీ హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - నవంబరు 22 ఈ-విన్ ఒడియన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 24 (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ) -
స్టార్ హీరో తొలి వెబ్ సిరీస్.. ఆ ఒక్కదానికే రెండేళ్లు టైమ్!
ఇప్పుడంతా ఓటీటీల ట్రెండ్ నడుస్తోంది. దీంతో సినిమా హీరోలు కూడా చాలామంది వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. నాగచైతన్య త్వరలో 'దూత' అనే సిరీస్‌తో రాబోతున్నాడు. దీనికంటే ముందు తమిళ స్టార్ హీరో ఆర్య.. 'ద విలేజ్' అనే హారర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయ్. (ఇదీ చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్.. పాత టాలెంట్ బయటకు తీసిన హీరో నాని!) 'ద విలేజ్' సిరీస్ నవంబరు 24 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ప్రైమ్ వీడియో ప్రెసిడెంట్ అపర్ణ పురోహిత్ హాజరయ్యారు. 'ది విలేజ్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులని తాము నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ సిరీస్ కోసం దాదాపు నాలుగేళ్లు జర్నీ చేసినట్లు పేర్కొన్నారు. ఇకపోతే ఈ స్ట్రిప్ట్ని రాసి చదవడానికే రెండేళ్లు పట్టిందన్నారు. అలానే నటుడు ఆర్య నటించడానికి అంగీకరించడంతో ఇది చాలా భారీ సిరీస్ అయిందనే అభిప్రాయాన్ని అపర్ణ పురోహిత్ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగే పలు ఘటనలను ఒక చోటకు తీసుకురావడం ఎలా? అనే ఆసక్తికరమైన స్టోరీతో ఈ సిరీస్ తీసినట్లు నిర్మాత బీఎస్ రాధాకృష్ణ చెప్పారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఫస్ట్ మూవీ హీరోయిన్) -
వాస్తు బాగోలేదని..
ఊరిని తరలించిన గ్రామస్తులు ఆరేళ్ల క్రితం కొత్త ఊళ్లోకి.. సంతోషంగా ఉన్నామంటున్న ప్రజలు వాస్తు.. దీనిని నమ్మని వారు చాలా అరుదు. ఇంటి నిర్మాణం నుంచి ఏవైపున ఏది ఉండాలో నిర్ణయించేది ఇదే. ఈ కంప్యూటర్ యుగంలోనూ వాస్తు ప్రకారమే ఇళ్లు నిర్మిస్తున్నారు. అది లేకుంటే అనర్థాలు జరుగుతాయని భావిస్తారు. వాస్తు బాగోలేని ఇళ్లను కూల్చి మళ్లీ కట్టడం చూస్తూనే ఉన్నాం. అంతెందుకు ప్రభుత్వాధికారులు కూడా తమ కార్యాలయాలను వాస్తు ప్రకారం డిజైన్ చేయించుకుంటున్నారు. ఇళ్లు, కార్యాలయాల మాట సరే.. మరి వాస్తు ఏమాత్రం బాగోలేదని ఓ ఊరినే తరలించే శారా గ్రామస్తులు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఎప్పుడో ఆరేళ్ల క్రితమే ఇది జరిగినా గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి గ్రామానికి గ్రామాన్నే ఇలా తరలించడం వారి ఐక ్యతకు, నమ్మకానికి నిదర్శనం. మరి అదెలా జరిగిందో తెలుసుకోవాలంటే ములుగు మండలంలోని కొడిశలకుంటకు వెళ్లాల్సిందే. బాధల్లేని గ్రామంగా.. గ్రామాన్ని తరలిస్తేనే మంచి జరుగుతుందని పండితులు చెప్పడంతో అయోమయంలో పడ్డ గ్రామస్తులు.. ఒకచోట సమావేశమై చర్చించుకున్నారు. అయ్యగార్లు చెప్పారు కాబట్టి గ్రామాన్ని తరలించడమే మంచిదని యువకులు పట్టుబట్టారు. దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి గ్రామానికి కిలోమీటరు దూరంలోని గడ్డపై వాస్తు ప్రకారం ఓ కొత్త గ్రామాన్ని పునర్నిర్మించుకున్నారు. 2008లో గ్రామస్తులంతా మూకుమ్మడిగా కొత్త ఊర్లోకి అడుగుపెట్టారు. గ్రామాన్ని మార్చిన తర్వాత చాలా మార్పు వచ్చిందని, సమస్యలు లేవని, సంతోషంగా ఉన్నామని గ్రామస్తులంతా సంతోషంగా చెబుతున్నారు. ఇదీ.. ఊరును మార్చిన వాస్తు కథ.