జమునా దేవి ఆలయమే.. జామా మసీదు!?
సాక్షి, న్యూఢిల్లీ : మందిర్-మసీదు, తాజ్ మహల్ వివాదం మంటలు పుట్టిస్తున్న సమయంలో తాజాగా బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ తాజాగా మరో సంచలన ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీలోని జామా మసీదుపై అసలు జమునా దేవి ఆలయం అంటూ.. గురువారం అతిపెద్ద బాంబే పేల్చారు. ఒక్క జామ్ మసీదేకాకుండా.. దేశంలోని ఆరు వేల ప్రార్థనాలయాలను మొఘల్ రాజులు కూలగొట్టి.. మసీదులుగా మార్చారని మరో సంచలన ఆరోపణ చేశారు.
దేశంలో మొఘలలు అడుగు పెట్టకముందు వరకూ జామా మసీదు, జమునా దేవి ఆలయంగా ఉండేదన్నారు. క్రీ.శ 17 శతాబ్దంలో షాజహాన్ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారని ఆయన పేర్కొన్నారు. మొఘలుల కాలంలో దేశంలో ప్రఖ్యాంతిగాంచిన ఆరు వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారని ఆయన తెలిపారు. తేజే మహాలయాన్ని తాజ్‌మహల్‌గా మార్చినట్టే.. జమునా దేవి ఆలయాన్ని జామా మసీదుగా మార్చారని వినయ్ కతియార్ చెప్పారు.
రెండు నెలల కిందట ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన టూరిజం కరపత్రంలో తాజ్‌మహల్‌ను పక్కన పెట్టడంతో వివాదం మొదలైంది. అదే సమయంలో తాజ్ మహల్, తేజో మహాలయమంటూ వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా మండుతున్న బాబ్రీ-రామజన్మభూమి కేసు విచారణను సుప్రీంకోర్టు చేపట్టింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి విచారణ వాయిదా వేసింది.