3 సబ్జెక్టుల్లో దాదాపు 100% కానీ..
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఫలితాల సందర్భంగా ఓ విషాద ఘటన వెలుగు చూసింది. నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి వినాయక్ శ్రీధర్ సీబీఎస్ఈ పరీక్షలో రాసిన మూడు సబ్జెక్టుల్లో దాదాపు 100 శాతం మార్కులు సాధించాడు. అయితే, కంప్యూటర్ సైన్స్, సోషల్ పరీక్షలు రాయకుండానే మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే నరాల సంబంధ వ్యాధి ముదిరి ఈ లోకం వీడివెళ్లిపోయాడు. రాసిన సబ్జెక్టులు ఇంగ్లిష్‌లో 100కు 100, సైన్స్‌లో 96, సంస్కృతంలో 97 మార్కులు సాధించాడు.
రెండేళ్ల వయస్సులో అతడికి మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధి సోకింది. వీల్‌చైర్‌లోనే స్కూల్‌కు వచ్చిన అతడికి..ప్రపంచ ప్రఖ్యాత స్టీఫెన్హాకింగ్ ఆదర్శం. అంతరిక్ష శాస్త్రం చదవాలని, వ్యోమగామి కావాలని కలలు కనేవాడని తల్లి మమత చెప్పారు.