Vinod Khosla
-
ఫోర్బ్స్ ‘గ్రేటెస్ట్ బిజినెస్ మైండ్స్’లో మనోళ్లు ముగ్గురు
శత వార్షికోత్సవ జాబితాలో చోటు న్యూయార్క్: తన వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ప్రస్తుత జీవించివున్న వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, మేధావుల సమ్మేళనంతో ఫోర్బ్స్ మ్యాగజీన్ తాజాగా ‘వరల్డ్ 100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్’ జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. అర్సిలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్.. టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా ఇందులో ఉన్నారు. శతవార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన తాజా ప్రత్యేకమైన జాబితాలో డొనాల్డ్ ట్రంప్ కూడా స్థానం పొందారు. ఈయనతోపాటు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, వర్జిన్ గ్రూప్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్, బార్క్‌షైర్ హత్వే సీఈవో వారన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రూపెర్ట్ ముర్డోచ్ వంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే సీఎన్ఎన్ ఫౌండర్ టెడ్ టర్నర్, టాల్క్ షో మాస్టర్ ఓఫ్రా విన్ఫ్రే, డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు మైకేల్ డెల్, పేపాల్/ టెస్లా/ స్పేస్ఎక్స్ కో–ఫౌండర్ ఎలెన్ మాస్క్, ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్, స్టార్‌బక్స్ సీఈవో హోవర్డ్ షుల్జ్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ వంటి పలువురు స్థానం పొందారు. కొత్త ఆవిష్కరణలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న, ప్రపంచంపై తన వంతు ప్రభావాన్ని చూపిన 100 ఎంట్రప్రెన్యూర్లతో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. కాగా ఫోర్బ్స్ మ్యాగజైన్‌ను బీసీ ఫోర్బ్స్.. వాల్టర్ డ్రేయ్తో కలిసి 1917 సెప్టెంబర్ 17న ఏర్పాటు చేశారు. -
ఫోర్బ్స్ తాజా జాబితాలో.. ముగ్గురు మనవాళ్లే..!
సాక్షి, న్యూఢిల్లీ : దిగ్గజ భారతీయ వ్యాపార వేత్తలకు ఫోర్బ్స్ మేగజైన్ మరో కితాబునిచ్చింది. ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా హండ్రెడ్ గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్ పేరుతో ఒక జాబితాను రూపొందించింది. అందులో భారత్ నుంచి టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా, ఆర్సెలర్ అధినేత ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్, సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లాలకు అందులో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ మేగజైన్ ఆరంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను విడుదల చేసింది. అందులో వ్యాపార చరిత్రలో సంచలనాలు.. కొత్త పెట్టుబడులు ఎలా పెట్టాలి? వ్యాపారస్తుడి విజన్ ఎలా ఉండాలి? వంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా 100 వంది వ్యాపారస్తుల ఆలోచనలను.. వారి వ్యక్తగత, వ్యాపార విశేషాలను అందులో పొందుపరచడం జరిగింది. ఈ సంచితకపై ఫోర్బ్స్ సిబ్బంది మాట్లాడుతూ..ప్రముఖ వ్యాపారస్తులపై ప్రత్యేక మేగజైన్ తీసుకురావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
అమెరికా కుబేరుల్లో మనోళ్లు ఐదుగురు
న్యూయార్క్: అమెరికాలోని అత్యంత ధనవంతుల (టాప్ 400) జాబితాలో ఐదుగురు భారత-అమెరికన్లకు చోటు లభించింది. ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది జాబితాలో 8,100 కోట్ల డాలర్ల(దాదాపు రూ.4.86 ల కోట్లు) సంపదతో మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. అత్యంత ధనవంతుడైన అమెరికన్‌గా బిల్‌గేట్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా 21వ ఏడాది. అమెరికా కుబేరుల విషయమై ఫోర్బ్స్ రూపొందిం చిన ఈ జాబితా విశేషాలు.... రెండో స్థానంలో వారెన్ బఫెట్ ఉన్నారు. బెర్క్‌షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న బఫెట్ సంపద 6,700 కోట్ల డాలర్లుగా ఉంది. 2001 నుంచి ఆయన ఈ రెండో స్థానంలో కొనసాగుతూనే ఉన్నారు. 5,000 కోట్ల డాలర్ల సంపదతో ఒరాకిల్ లారీ ఎలిసన్ మూడో స్థానంలో నిలిచారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ కూడా అయిన మార్క్ జుకర్‌బెర్గ్ 11 వస్థానంలో నిలిచారు. ఈ ఏడాది అందరికంటే ఎక్కువగా లాభపడ్డది ఈయనే. గతేడాది 1,500 కోట్ల డాలర్లుగా ఉన్న ఈయన సంపద ఈ ఏడాది 3,400 కోట్ల డాలర్లకు పెరిగింది. ఫేస్బుక్ షేర్ల ధర బాగా పెరగడమే దీనికి కారణం. ఈ జాబితాలోని టాప్ 400 సంపన్నుల మొత్తం సంపద 2.29 లక్షల కోట్ల డాలర్లు. గత ఏడాదితో పోల్చితే ఇది 27,000 కోట్ల డాలర్లు అధికం. జోరుగా ఉన్న స్టాక్ మార్కెట్ల కారణంగా వీరి సంపద బాగా పెరిగింది. -
అమెరికా శ్రీమంతుల్లో ముగ్గురు ఎన్నారైలు
అమెరికా శ్రీమంతుల జాబితాలో ముగ్గురు ప్రవాస భారతీయులు చోటు దక్కించుకున్నారు. అమెరికాలో అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాను 'ఫోర్బ్స్' ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 72 బిలియన్ డాలర్ల సంపదతో వరుసగా 12వ ఏడాది ఆయన టాప్ పొజిషన్లో ఉన్నారు. గతేడాది పోలిస్తే ఆయన సంపద 6 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇండియన్ అమెరికన్, ఎఎంపీ అండ్ ఎఎంపీ కంపెనీ అధినేత భారత్ దేశాయ్ 2.2 బిలియన్ డాలర్ల సంపదతో 252 స్థానంలో నిలిచారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న రొమేష్ టీ వద్వానీ 2.1 బిలయన్ డాలర్ల ఆస్తులతో తర్వాత స్థానంలో ఉన్నారు. కాలిఫోర్నియా వెంటర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా 352 స్థానంలో నిలిచారు. ఆయన సంపద 1.5 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ లెక్కగట్టింది. ఇన్వెస్టర్ వారెన్ బఫెట్(58.5 బిలియన్ డాలర్లు), ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్(41 బిలియన్ డాలర్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. గతేడాది 36వ స్థానానికి పడిపోయిన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్(19 బిలియన్ డాలర్లు) 20వ స్థానానికి ఎగబాకారు.