vinukonda govt hospital
-
చెట్టును ఢీకొన్న పెళ్లి బస్సు: 15 మందికి గాయాలు
వినుకొండ(గుంటూరు జిల్లా): కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు వెళుతున్న పెళ్లి బృందం బస్సు వినుకొండ మండలం చీకటీగలపాళెం గ్రామం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఆదివారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను వినుకొంద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారయత్నం
ఏపూరు(గుంటూరు): ఏపూరు మండలం గుప్మాన్తండాలో 12 ఏళ్ల మతిస్థిమితం లేని బాలికపై సోమవారం నాగేశ్వర నాయక్(30) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేయబోయాడు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో అత్యాచారయత్నం చేయబోవడంతో బాలికకేకలు వేసింది. కేకలు విన్న స్థానికులు సంఘటనస్థలానికి వచ్చే సరికి నిందితుడు పరారయ్యాడు. బాలికను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సవతి తల్లి
ఈపూర్ మండలం బొగ్గరంలో శనివారం దారుణం చోటు చేసుకుంది. చంద్రమ్మ అనే బాలికపై సవతి తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించింది. దాంతో మంటలను తట్టుకోలేక బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి...ఆమెను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చంద్రమ్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. పోలీసులు బాలిక వద్ద వాంగ్మూలాన్ని తీసుకున్నారు. తాను ప్రస్తుతం మేనత్త ఇంటిలో ఉంటున్నానని, ఏకాదశ పర్వదినం కావడంతో స్నానం చేసి గుడికి వెళ్లాలని తన ఇంటికి వచ్చానని తెలిపింది. తాను గదిలో బట్టలు తీసుకుంటుండగా తలుపు గడియ పెట్టి... మారుటి తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించిందని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సవతి తల్లి కోసం గాలిస్తున్నారు. చంద్రమ్మ పేరిట అర ఎకరం పొలం ఉందని, అది ఎలాగైనా సొంతం చేసుకోవాలనే సవతి తల్లి ఈ దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు.