virginity test for wife
-
నవ వధువుకు చేదు అనుభవం.. కన్యత్వ పరీక్షలో ఫెయిల్ కావడంతో..
కొత్తగా పెళ్లై.. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు చేదు అనుభవం ఎదురైంది. కన్యత్వ పరీక్షలో వధువు విఫలం కావడంతో భర్త, అత్తామామలు దారుణానికి ఒడిగట్టారు. తన కన్యత్వాన్ని బజారుకీడ్చారు. పంచాయితీ నిర్వహించి ఆమెకు రూ.10 లక్షల జరిమానా విధించారు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భిల్వారా జిల్లాలో మే 11వ తేదీన బాధితురాలు(24)కు బాగోర్‌కు చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది. కాగా, వారి సంప్రదాయం ప్రకారం.. ‘కుక్డి’ విధానంలో నిర్వహించిన కన్యత్వ పరీక్షలో వధువు విఫలమైంది. దీంతో ఒక్కసారిగా అత్తింటివారు షాకయ్యారు. అనంతరం.. దీనిపై వధువును నిలదీయడంతో వరుడి గుండెలు బద్దలయ్యే విషయం చెప్పింది. పెళ్లికి ముందు.. తన ఇంటి వద్ద ఉండే ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్పుకొచ్చింది. దీంతో ఆగ్రహానికి లోనైన తన భర్త, అత్తామామలు.. ఆమెను చితకబాదారు. అనంతరం.. ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. దీంతో, పంచాయతీ పెద్దలు.. వధువు, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా విధించారు. ఆ డబ్బులు చెల్లించనందుకు వధువుతోపాటు ఆమె కుటుంబాన్ని అత్తింటి వారు వేధించారు. నూతన వధువును ఆమె పుట్టింటికి పంపారు. దీంతో, వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వధువు భర్త, మామపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: కొడుకు ఎదుటే రన్నింగ్ రైలులో మహిళపై అత్యాచారయత్నం -
కన్యత్వ పరీక్షలకు చెక్
సాక్షి, పూణే : నవదంపతుల మొదటిరాత్రి పెళ్లికూతురికి శీల పరీక్ష నిర్వహించే అనాగరిక సంప్రదాయానికి చెక్ పెడుతూ పూణే నగరానికి చెందిన కంజర్భట్ వర్గానికి చెందిన యువకులు ప్రచార కార్యక్రమానికి తెరలేపారు. వీరంతా ‘స్టాప్ ది వి రిచువల్’ పేరిట వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి కన్యత్వ పరీక్షలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా యువకుల గ్రూపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ట్రిపుల్ తలాక్, గోప్యత హక్కుపై ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చేశామని..వీటికి వచ్చిన సానుకూల స్పందనతో కన్యత్వ పరీక్ష వంటి దురాచారంపై అవగాహనతో ముందుకొచ్చామని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ వివేక్ తమైచెకర్ చెప్పారు. గ్రామాల్లో మహిళ అనుమతి తీసుకోకుండానే ఈ దురాచారాన్ని కొనసాగిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శీల పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని టాటా ఇనిస్టిటూట్యట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లో పీజీ చేస్తున్న తమైచెకర్ పేర్కొన్నారు. -
భార్యకు శీల పరీక్ష పెట్టిన భర్త
భార్యను శీల పరీక్షకు నిలిపిన భర్త కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జంగాల కాలనీకి చెందిన పస్తం బాలకృష్ణ తన భార్య తిరుమలమ్మను శీల పరీక్షకు నిలిపాడు. ఇటీవల ఆమె బండిపాలెం గ్రామానికి చెందిన నరసింహారావుకు చెందిన కిరాయి ఆటో ఎక్కింది. ఆ సమయంలో అతడు తిరుమలమ్మతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని ఆమె భర్తకు చెప్పగా అతను అనుమానంతో ఆమెకు శీల పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నాడు. కుల పెద్దలకు సమాచారమిచ్చి వారిని గురువారం తెల్లవారుజామున చిల్లకల్లు-మక్కపేట రహదారి ఎన్ఎస్పీ కాల్వగట్టు వద్దకు రావాలని కోరాడు. వారు వచ్చేసరికి గట్టుపై కట్టెల పొయ్యి వెలిగించి ఆకురాయిని ఎర్రగా కాల్చాడు. ముందుగా భార్య శరీరానికి పసుపు పూసి కుంకుమ పెట్టాడు. ఆ తర్వాత కాలిన ఆకురాయిని నిప్పుల్లో నుంచి తీసి చేత్తో పట్టుకుని శీలపరీక్షలో నెగ్గాలని తిరుమలమ్మకు సూచించాడు. ఈ విషయం తెలుసుకున్న చిల్లకల్లు ఎస్.ఐ. షణ్ముఖసాయి, సిబ్బందితో వెళ్లి సంఘటనను అడ్డుకున్నారు. కుల పెద్దలు, భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. - చిల్లకల్లు (జగ్గయ్యపేట) -
భార్యకు శీల పరీక్ష పెట్టిన భర్త