సాక్షి, పూణే : నవదంపతుల మొదటిరాత్రి పెళ్లికూతురికి శీల పరీక్ష నిర్వహించే అనాగరిక సంప్రదాయానికి చెక్ పెడుతూ పూణే నగరానికి చెందిన కంజర్‌భట్ వర్గానికి చెందిన యువకులు ప్రచార కార్యక్రమానికి తెరలేపారు. వీరంతా ‘స్టాప్ ది వి రిచువల్’ పేరిట వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి కన్యత్వ పరీక్షలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా యువకుల గ్రూపు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాము ట్రిపుల్ తలాక్, గోప్యత హక్కుపై ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్టులు చేశామని..వీటికి వచ్చిన సానుకూల స్పందనతో కన్యత్వ పరీక్ష వంటి దురాచారంపై అవగాహనతో ముందుకొచ్చామని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ వివేక్ తమైచెకర్ చెప్పారు. గ్రామాల్లో మహిళ అనుమతి తీసుకోకుండానే ఈ దురాచారాన్ని కొనసాగిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శీల పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని టాటా ఇనిస్టిటూట్యట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లో పీజీ చేస్తున్న తమైచెకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment