Virus symptoms
-
మంకీపాక్స్ పాజిటివ్ కేసు నిర్ధారణ
న్యూఢిల్లీ: ‘అనుమానిత’ కేసు మంకీపాక్స్(ఎంపాక్స్) కేసుగానే నిర్ధారణ అయ్యింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. అతడికి పరీక్షలు నిర్వహించగా ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఇతర అనారోగ్య లక్షణాలేవీ లేవని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సదరు యువకుడు ప్రయాణంలో ఉండగా ఎంపాక్స్ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అతడిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్–2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు గుర్తించామని వివరించింది. ఇది 2022 జూలై నుంచి మన దేశంలో నమోదైన 30 కేసుల్లాంటిదేనని తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన క్లేడ్–1 రకం వైరస్ కాదని స్పష్టంచేసింది. క్లేడ్–2 రకం వైరస్ అంతగా ప్రమాదకారి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. బాధితుడు ఐసోలేషన్‌లో ఉన్నాడు కాబట్టి అతడి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం లేదని తెలిపింది. హరియాణాలోని హిసార్ పట్టణానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో శనివారం ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచారు. అనుమానిత ఎంపాక్స్ కేసుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. పరీక్షల అనంతరం ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలింది. అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు అనుమానిత, నిర్ధారిత ఎంపాక్స్ బాధితుల కోసం ఢిల్లీలో మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ గదులు సిద్ధం చేశారు. ఎంపాక్స్ కేసుల చికిత్స విషయంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి నోడల్ సెంటర్‌గా సేవలందిస్తోంది. ఇందులో 20 ఐసోలేషన్ గదులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఎంపాక్స్ వైరస్ వ్యాప్తిపై ప్రజ ల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అనుమానిత ఎంపాక్స్ కేసుల విషయంలో స్క్రీనింగ్, టెస్టింగ్ నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఐసోలేషన్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ మేరకు సోమవా రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఎంపాక్స్‌పై ప్రజల్లో అనుమానాలు తొలగించాలని పేర్కొన్నారు. వైరస్ సోకినా ప్రాణాలకు ముప్పు ఉండదన్న సంగతి తెలియజేయాలని కోరారు. -
మంకీపాక్స్ అలర్ట్.. WHO సీరియస్ వార్నింగ్
జెనీవా: కరోనా కొత్త వేరియంట్లతో ఆందోళన చెందుతున్న ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ కొత్త సవాల్ విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్యల గణనీయంగా పెరుగుతోంది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్ ముప్పు పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని స్పష్టం చేసింది. మరోవైపు.. ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వెంటనే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని తెలిపింది. మంకీపాక్స్‌పై అందరికి అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని పేర్కొన్నది. ఒకవేళ.. వైరస్ సమూహ వ్యాప్తి కనుక ప్రారంభమైతే.. చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. మంకీ పాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారుల ఇచ్చిన సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మంకీపాక్స్‌కు చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం మంకీ పాక్స్ లక్షణాలు. ఇక, అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు, వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రిలో చేరాలి. ఐసొలేషన్‌లో ఉండి చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్సలు తీసుకోవాలి. ఈ వైరస్ ఇతరులకు సోకకుండా తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. As of May 26, a total of 257 confirmed cases and 120 suspected cases have been reported from 23 member states that are not endemic for the virus, the health agency said in a statement. Read More: https://t.co/fXxedn66zx#Monkeypox #WHO pic.twitter.com/cSwwY9z51w — The Daily Star (@dailystarnews) May 30, 2022 ఇది కూడా చదవండి: ప్రజలకు మరో ముప్పు.. కొత్త వైరస్ కలకలం -
బస్సులో ఉన్నప్పుడు వైరస్ లేదు!
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ తొలి కోవిడ్ బాధితుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో వచ్చినప్పుడు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తేల్చాయి. అక్కడి నుంచి వచ్చాకే జ్వరం ప్రారంభమైందని తెలిపాయి. ఇక హైదరాబాద్ వచ్చాక తన కుటుంబంలో 13 మంది సభ్యులతో కలిసి ఉన్నాడని నిర్ధారించాయి. ఆయన బెంగళూరులోని గ్లోబల్ టెక్నాలజీ పార్క్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని తేలింది. హైదరాబాద్‌లోని మహేంద్రహిల్స్‌లో అతడి కుటుంబం ఉంటోంది. ఆ యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వారితోపాటు అపోలో ఆస్పత్రిలో అతడు కాంటాక్ట్ అయిన 50 మంది వైద్య సిబ్బందిని కూడా గుర్తించారు. మొత్తమ్మీద కుటుంబ సభ్యులతో కలిపి 88 మందిని అతడు కలుసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. వారిలో 45 మందిని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు అతడితో కలిసి ఉన్నవారిలో 36 మందికి కోవిడ్ అనుమానిత లక్షణాలు కనిపించాయని అధికార వర్గాలు తెలిపాయి. ఏ రోజు ఎక్కడెక్కడ ఉన్నాడంటే? కోవిడ్ బాధితుడు ఫిబ్రవరి 15న బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లాడు. గతనెల 16 నుంచి 19 వరకు అక్కడే ఉన్నాడు. సింగపూర్‌కి చెందిన అతడి కంపెనీ ఉద్యోగితో కలిసి పనిచేశాడు. 20న తిరిగి బెంగళూరు వచ్చాడు. 20, 21 తేదీల్లో ఆఫీసుకు వెళ్లాడు. 21న హైదరాబాద్ బయలుదేరాడు. 22న ఉదయం హైదరాబాద్ చేరుకున్నాడు. జ్వరం రావడంతో అపోలోలో పరీక్షలు చేయించుకున్నాడు. తర్వాత నాలుగైదు రోజులకు కోవిడ్ లక్షణాలు మొదలయ్యాయి. 27న సికింద్రాబాద్ అపోలోలో చేరి 29 వరకు చికిత్స చేయించుకున్నాడు. 27న అతడికి చెస్ట్ ఎక్స్‌రే చేశారు. అందులో బైలేటరల్ లోయర్ లోబ్ న్యుమోనియా అని విశ్లేషణ ఉంది. ఈనెల 1న గాంధీలో చేరాడు. సాయంత్రం 4.30 గంటలకు కోవిడ్ అనుమానిత కేసుగా స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. అర్థరాత్రి ఒంటిగంటకు మరో నమూనా తీసుకున్నారు. 2న ఉదయం 9 గంటలకు అతడికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించారు. పుణేకు పంపిన శాంపిల్స్‌లోనూ పాజిటివ్‌గా తేలడంతో తెలంగాణలో తొలి కోవిడ్ కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. -
కుటుంబసభ్యుల నిర్లక్ష్యానికి బాలుడు బలి
ఇండోర్ : డాక్టర్ల మాటల్ని లెక్కచేయకుండా ప్రవర్తించి ఓ బాలుడి మరణానికి కారణమయ్యారు అతడి కుటుంబసభ్యులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ అత్యవసర చికిత్స నిమిత్తం శనివారం మహరాజా యశ్వంత్రావ్ ఆసుపత్రిలో చేర్చబడ్డాడు. అయితే బాలుడికి ‘‘ఆక్యూట్ ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్’’ సోకిందని కుటుంబసభ్యులు భావించారు. ఇక బాలుడు బతకడనే ఉద్ధేశ్యంతో ఐసీయూలో ఉన్న అతడిని ఇంటికి తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఐసీయూలో ఉన్న బాలుడ్ని ఇంటికి తీసుకెళ్లవద్దని డాక్టర్లు వారించారు. కానీ బాలుడి కుటుంబసభ్యులు వినకుండా అతడిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. దీంతో ఆదివారం బాలుడు కన్నుమూశాడు. దీనిపై బాలుడికి చికిత్స చేసిన వైద్యుడు మాట్లాడుతూ.. బాలుడికి వచ్చిన జ్వరానికి ఆక్యూట్ ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్‌కు లక్షణాలలో తేడా ఉందని చెప్పారు. ప్రజలు ఎన్సెఫాలైటిస్ గురించి భయపడవల్సిన అవసరం లేదన్నారు. బాలుడి రక్త నమూనాలు సేకరించామని, రక్త పరీక్షల ఫలితాల అనంతరం అతడి వ్యాధిని నిర్థారిస్తామని చెప్పారు. ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్ కారణంగా బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లో దాదాపు 130మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. -
ఒకే కుటుంబంలో ఐదుగురికి స్వైన్‌ఫ్లూ!
* నలుగురికి మహబూబ్‌నగర్‌లో చికిత్స * చికిత్స పొందుతున్న బాధితులు * పరారైనట్లు వదంతులు * వీటిని కొట్టిపారేసిన అధికారులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. అందులో ఒకరికి వైరస్ లక్షణాలు బయటపడటంతో శనివారం నుంచి హైదరాబాద్‌లో చికిత్స చేస్తున్నారు. అనుమానంతో వైద్య బృందం ఆ వ్యక్తి కుటుంబాన్ని కూడా పరిశీలించగా, వారికీ స్వైన్‌ఫ్లూ సోకినట్లు వెల్లడైంది. దీంతో మిగతా నలుగురికీ మహబూబ్‌నగర్‌లో చికిత్స చేస్తున్నారు. ప్రజలు భయాందోళనకు గురవుతారన్న అనుమానంతో ఈ విషయాన్ని అధికారులు బయటకు పొక్కనీయడం లేదు. మరోవైపు ఆస్పత్రి నుంచి కొందరు స్వైన్‌ఫ్లూ బాధితులు పరారయ్యారని ప్రచా రం జరగడంతో వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. వారు పరారు కాలేదని... వైరస్ లక్షణాలు తగ్గడంతో వెళ్లిపోయారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 8 మంది మృతి ఈ ఏడాది ఇప్పటివరకు అధికారికంగా 70 కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. గత 15 రోజుల్లోనే నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అన్నిచోట్లా స్వైన్‌ఫ్లూ మందులున్నాయని చెబుతున్నా, జిల్లాల్లో స్వైన్‌ఫ్లూను గుర్తించే పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో బాధితులు హైదరాబాద్‌కే వస్తున్నారు. అన్ని జిల్లాలకు కలిపి కేవలం 13 వేల స్వైన్‌ఫ్లూ మందులే అందుబాటులో ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రుల్లోనూ స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ‘గాంధీ’లోనే స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డులున్నాయి. ప్రజల్లో వైరస్‌ను తట్టుకునే శక్తి వచ్చింది స్వైన్‌ఫ్లూను చూసి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ డాక్టర్ పి.సాంబశివరావు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటికే స్వైన్‌ఫ్లూను తట్టుకునే రోగ నిరోధక శక్తి ప్రజలకు వచ్చిందన్నారు. ఈ వైరస్ మామూలుగా వచ్చి పోతుందని, దీని తీవ్రత ఏమాత్రం లేదని ఆయన భరోసా ఇచ్చారు. కొందరు స్వైన్‌ఫ్లూ బాధితులు పారిపోయారని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టంచేశారు. వారి జబ్బు నయమయ్యాక ఆస్పత్రిలో ఎందుకుంటారని ఎదురు ప్రశ్నించారు. భయాందోళనకు గురిచేసే అనవసర ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. తలనొప్పి, ఒంటినొప్పులు, జలుబు, దగ్గు, జ్వరం ఉంటే అనుమానించి సమీపంలో ఉన్న ఆసుపత్రులకు వెళ్లి చూపించుకోవాలని సూచించారు.