ట్రాన్షిప్మెంట్ హబ్‌గా విశాఖ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి ట్రాన్షిప్మెంట్ హబ్గావిశాఖపట్నం రూపాంతరం చెందనుందని విశాఖ పోర్టుట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఈ క్రమంలో విశాఖ కంటైనర్ టెర్మినల్‌ను ‘ట్రాన్షిప్మెంట్ హబ్’గా అభివృద్ధి చేయనున్నటు ఆయన వెల్లడించారు. ‘ఈస్టుకోస్టు మేరిటైమ్ బిజినెస్ సమ్మిట్’ను విశాఖపట్నంలో ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
12వేల టీయూవీ సామర్థ్యం ఉన్న నౌకలే ప్రవేశించడానికి అవకాశం ఉన్న విశాఖ పోర్టు ఛానల్ సామర్థ్యాన్ని 15వేల టీయూవీలకు పెంచుతామన్నారు. సాగరమాల ప్రాజెక్టును పశ్చిమ తీరంలో మహారాష్ట్రలోనూ తూర్పుతీరంలో మన రాష్ట్రంలోనూ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. దీని కింద రాష్ట్రంలోని పోర్టులలో ప్రస్తుత ఉన్న మౌలిక వసతులను ఆధునీకరించి వాటి సామర్థ్యాన్ని పెంచుతారని తెలిపారు.
ముంబాయి- ఢిల్లీ తరహాలో విశాఖపట్నం నుంచి ఢిల్లీకి డెడికేటెడ్ రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేయాలని తాము ప్రతిపాదిస్తున్నామన్నారు. అదే విధంగా విశాఖపట్నంను లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అనకాపల్లి వద్ద 500 ఎకరాలలో వేర్‌హౌసింగ్ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేటు లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుశీల్ ముల్చందాని మాట్లాడుతూ కృష్ణపట్నం నుంచి మయన్మార్‌కు గత అక్టోబరులో అంతర్జాతీయ వాణిజ్య మార్గం ఏర్పడిందని ఆయన చెబుతూ త్వరలో కృష్ణపట్నం-చిట్టగాంగ్ మార్గానికి కూడా అనుమతి వస్తుందన్నారు.