Visakhapatnam north constituency
-
ప్రభంజనంలా సాధికార యాత్ర.. అడుగడుగునా అపూర్వ స్పందన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 41వ రోజు వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. అడగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ నీరాజనం పలికారు. బస్సు యాత్రలో భాగంగా గ్రేటర్ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 26వ వార్డులోని ఎన్జీజీఓస్ కాలనీలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన జీవీఎంసీ స్కూల్‌ను వైఎసార్సీపీ ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం మాధవధార నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీని చేపట్టారు. వేలాది బైక్ లతో సామాజిక సాధికార బస్సుయాత్ర కైలాసపురం వద్ద ఇన్ ఆర్పిట్ మాల్ స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రి మేరుగ నాగార్జున, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర, గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు హాజరయ్యారు. సీఎం జగన్ సాహసోపేత నిర్ణయాలు: డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతుల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే, జగన్ ఇచ్చిన హామీ మేరకు దఫదఫాలుగా మాఫీ చేస్తున్నారన్నారు. పేదల పిల్లల ఉన్నతస్థాయిలో చదవుకోవాలని నాడు - నేడు ద్వారా అభివృద్ధి పనలు చేస్తున్నారని, అవ్వా , తాతలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రూ. 3 వేలకు పెంచి అందిస్తున్న ఘనత జగన్ దేనని ఉద్ఘాటించారు. ఆరోగ్య శ్రీ కేవలం రూ. 2 లక్షల పరిమితితో ఆనాడు స్వర్గీయ వైఎస్ ప్రారంభిస్తే, సీఎం జగన్ రూ. 25 లక్షల మేరకు పెంచి ప్రతీ కుటుంబ ఆరోగ్యం పట్ల తన చిత్తశుద్ధిని చాటి సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగి సామాజిక సాధికారత ఫరిడవిల్లుతుందన్నారు. విశాఖ నార్త్ లో వైసీపీ అభ్యర్థి కే కే రాజును వచ్చే ఎన్నికల్లో గెలిపించడంతో ద్వారా జగన్ ను సీఎంగా చేసుకోవాలని ముత్యాల నాయుుడు పిలుపునిచ్చారు. జగన్ పాలనలో సామాజిక సాధికార విప్లవం: మంత్రి మేరుగ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ సామాజిక సాధికారత సాధ్యం కాకపోగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జగన్ పాలనలో సామాజిక సాధికార విప్లవం సాధ్యమైందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అసమానతలు, అవినీతి, అశ్రిత పక్షపాతంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించి రాజ్యాంగ బద్ద హక్కులను కాలరాసారని మండిపడ్డారు. పేదల కడుపులో ఆకలి తీర్చడానికి, చిరునవ్వు కోసం లక్షల కోట్ల రూపాయల వెచ్చిస్తున్న ముఖమంత్రి జగన్ అని ప్రశంసించారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు సీఎం జగన్ ఇస్తే, రాజధాని ప్రాంతంలో వెనుకబడి వర్గాలకు ఇళ్లు కేటాయించాలని సీఎం జగన్ తలపిస్తే కోర్టులకెళ్లి అడ్డుకున్న చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకు అవసరమా, అతని అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో 12.5 శాతం పేదరికం రాష్ట్రంలో ఉంటే, జగన్ హయాంలో 6 శాతానికి తగ్గిందని దీనికి వైసీపీ ప్రభుత్వ పాలన కాదా అని ప్రశ్నించారు. చంద్రగిరిలో పుట్టి కుప్పంలో పోటీ చేసే చంద్రబాబు, హైదరాబాద్ లో పుట్టిన లోకేశ్ మంగళగిరిలో పోటీ చేస్తున్న బ్రతుకు టీడీపీదైతే, జగన్ వచ్చే ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల నేతల సీట్లు మార్చుతున్నారని విమర్శిస్తుండటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల నేతలు ఎక్కడ పోటీ చేసినా సరే గెలవ గల సత్తాను సీఎం జగన్ ఇచ్చారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో సగం దూరం నడిచి పారిపోయిన లోకేశ్, ప్రజల కష్టాలు తీర్చుతానని చెప్పకుండా ఎర్ర బుక్ పేరుతో వైసీపీ నేతలకు బెదిరింపులు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో వెనుకబడివ వర్గాలకు గౌరవం: ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాలకు చేయూతనివ్వాలని సంకల్పించారని, రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఖర్చు చేసిన ముఖ్యమంత్రి జగన్ తప్పితే మరెవరూ లేరని వ్యాఖ్యానించారు. 133 కులాలు ఉంటే వాటిని క్రోడీకరించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమం అందిస్తున్నారన్నారు. వెనుకబడివ వర్గాలకు సమాజంలో గౌరవం కల్పించాలని జగన్ పరితపించారన్నారు. అధికారం పెద్దలదు కాదని, పేదలదని జగన్ నిరూపించారని, జగన్ పాలనలో పాలకులు ప్రజలకు సేవకులు మాత్రమేనని వివరించారు. జగన్ సాధించిన సాధికారతకు ఇదే నిదర్శనం: గ్రేటర్ విశాఖ మేయర్ హరికుమారి గ్రేటర్ విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ, గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలన చేసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంక్ లుగా మాత్రమే పరిగణించారని, సీఎం జగన్ సముచిత స్థానం కల్పించి కేబినెట్ లో చోటుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ ల పదవులు కట్టెబెట్టి ఆత్మగౌరవం పెంచారని కొనియాడారు. వెనుకబడిన వర్గానికి చెందిన గృహిణిని అయిన తనను విశాఖ వంటి మహా నగారానికి మేయర్ ను చేసారంటే సీఎం జగన్ ఏ స్థాయిలో సామాజిక విప్లవం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చునన్నారు. నాడు - నేడుతో విద్యా రంగంలోనూ, ఆరోగ్య శ్రీ,, జగనన్న సురక్ష వంటి పథకాలతో ఆరోగ్య రంగంలోనూ పెద్ద ఎత్తున మార్పులు తీసుకువచ్చి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిపారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి గెలిపించాలని హరి కుమారి కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కే కే రాజు మాట్లాడుతూ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిక్షణం ప్రజాహితం కోసం పరితపిస్తుండటాన్ని చంద్రబాబు, ఆయన తోక పార్టీల అధ్యక్షులు ఓర్వలేక కోర్టుల కేసుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు సీఎం జగన్ చేసిన సామాజిక సాధికారతను చెప్పేందుకు బస్సు యాత్ర ద్వారా అన్ని వర్గాల నేతలు ప్రతిపక్షాలకు ధీటుగా వివరిస్తున్నారన్నారు. ఉత్తర నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ. 3427కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనలుు చేపట్టామని, 7 హాస్పిటల్స్, 14 స్కూల్స్ నిర్మాణం చేపట్టామని కే కే రాజు వివరించారు. ఆగస్టు 1న సీఎం జగన్ శంకుస్థాపన చేసిన ఇన్ ఆర్బిటల్ మాల్ నిర్మా్ణం పూర్తియితే స్థానికంగా ఉన్న యువత 15 వేల మందికి, ఎఎంసీ మాల్ ద్వారా 3 వేల మందికి ఉపాధి లభించబోతోందని, విశాఖ నార్త్ నియోజకవర్గంలోనే దాదాపుగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే ఎటువంటి వివక్ష లేకుండా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర మాట్లాడుతూ, దేశంలో గాంధీ, అంబేద్కర్ , ఫూలే కలలు గన్న సమాజాన్ని సాకారం చేసిన నేత జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని గుర్తు చేసారు. టీడీపీ హయాంలో గిరిజన శాఖకు మంత్రి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జీసీసీ చైర్మన్ వంటి పదవులకు గిరిజనులను నియమించకుండా తీవ్రంగా అవమానించితే, జగన్ సీఎం కాగానే ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ, రాజ్యాంగ పదవుల్లో స్థానం కల్పించి గౌరవమిచ్చారని కొనియాడారు. వైసీపీ మైనార్టీ నాయకుడు ఎస్ ఏ రెహ్మన్ మాట్లాడుతూ, చంద్రబాబు కేబినెట్ విస్తరణ చేసినపుడు లోకేష్‌ను మంత్రిని చేసుకున్నాడని, ఎస్టీలు, ముస్లింలు కనిపించలేదని మండిపడ్డారు. -
జట్టుగా 175 సాధిద్దాం
సాక్షి, అమరావతి: మనమంతా కలసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని, మరో 16 నెలల్లో రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. మనం చేస్తున్న మంచి ప్రతి పల్లెలోనూ కనిపిస్తోందని, ప్రతి గ్రామం రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. పారదర్శకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉండాలని ప్రజలు దీవిస్తారన్నారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి చేసిన మంచి, అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేకే రాజు వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిగా ఉంటారని చెప్పారు. ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీ అందరి భాగస్వామ్యంతో.. మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. ఇంకా చాలా సమయం ఉంది కదా..! అప్పుడెప్పుడో చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడే చేయాలా? అనుకోవచ్చు. ఎందుకు ఈ కార్యక్రమాలు చేపట్టామంటే రెండు కారణాలున్నాయి. మనం కలసి చాలా రోజులైంది. కలిసినట్లు ఉంటుందన్నది మొదటి కారణమైతే రెండోది.. గడప గడపకూ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని ప్రతి వార్డులోకి, ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లడంలో మీ అందరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం, అవసరం. లక్ష్యాన్ని గుర్తు చేసేలా.. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చూస్తే.. ఇంత పారదర్శకంగా, వివక్ష, అవినీతికి తావులేకుండా పథకాలు గతంలో ఏ రోజూ సామాన్యుడికి చేరలేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగుతోంది. లంచాలకు ఆస్కారం లేకుండా పాలన సాగుతోంది. సచివాలయాలనే గొప్ప వ్యవస్ధను మనం తీసుకొచ్చాం. ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98 శాతానికి పైచిలుకు నెరవేర్చాం. అలా నెరవేర్చిన తర్వాత ప్రజలకు దగ్గరకు వెళ్లి వారి ఆశీస్సులు కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా 175కి 175 నియోజకవర్గాల్లోనూ గెలుపు సాధించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేయాలి. వీటిని గుర్తు చేయడానికే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. కుప్పంలోనూ క్లీన్ స్వీప్.. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది. కుప్పం లాంటి నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం. మున్సిపాల్టీ, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాలన్నీ గెల్చుకున్నాం. గతంలో రాని ఫలితాలు ఇవాళ చూస్తున్నాం. దీనికి కారణం ప్రతి ఇంటిలోనూ సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తోంది. పారదర్శకంగా పథకాలు అమలవుతున్నాయి. ప్రతి ఇంటికీ మేలు జరుగుతోంది. అలాంటప్పుడు 175 స్థానాలనూ సాధించాలని మనం అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధ్యమే. రూపురేఖలు మారిన పల్లెలు.. ఇవాళ మన గ్రామాల రూపురేఖలు సమూలంగా మారుతున్నాయి. ఆర్బీకేలు అడుగడుగునా రైతన్నలకు అన్ని సేవలు అందిస్తున్నాయి. గ్రామాల్లో వ్యవసాయం చేసే తీరు మారుతోంది. సచివాలయాల వ్యవస్థతో ఇంటి వద్దకే పథకాలు పారదర్శకంగా వస్తున్నాయి. పట్టణాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి. అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన పాఠశాలలు, ఇంగ్లీషు మీడియం చదువులు, మౌలిక వసతులు బలోపేతం చేసిన ఆసుపత్రులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. డిజిటల్ లైబ్రరీలు కూడా రానున్నాయి. వ్యవసాయం, విద్య, వైద్య ఆరోగ్య రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. మనం చేస్తున్న మంచి ప్రతి చోటా కనిపిస్తోంది. మొత్తంగా మనం వేస్తున్న అడుగులు ప్రతిఫలాన్ని ఇచ్చే పరిస్థితి వస్తోంది. ఇలాంటప్పుడు ప్రజలు మనల్ని గెలిపించి ఆశీర్వదిస్తూ మరో 30 ఏళ్లు మనమే ఉండాలని దీవిస్తారు. ఎలాంటి విభేదాలున్నా వాటిని పక్కనపెట్టి అందరూ కలసికట్టుగా అడుగులు వేయాలి. క్యాలెండర్ ప్రకారం టంచన్‌గా.. విశాఖ రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద నగరం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 76 శాతం ఇళ్లల్లో మన పథకాలు కనిపిస్తున్నాయి. దాదాపు 1.05 లక్షల ఇళ్లు ఉంటే 80 వేల ఇళ్లకు పథకాలు అందాయి. అంత పారదర్శకత కనిపిస్తోంది. ఎక్కడా తప్పు జరగకుండా కచ్చితంగా క్యాలెండర్ ప్రకారం నెల నెలా బటన్ నొక్కి పథకాలతో మేలు చేకూరుస్తున్నాం. ఈ నెలలో ఈ పథకం ఇస్తామని మొట్ట మొదటిసారిగా బడ్జెట్ అన్నదానికి నిర్వచనం మార్చాం. గతంలో ఇలా ఎప్పుడూ క్యాలెండర్ ప్రకారం జరగలేదు. నాకు ఎన్ని సమస్యలున్నా అధిగమించి ప్రజల ఇబ్బందులే ఎక్కువని భావించి మేలు చేస్తున్నాం. అదే విధంగా మీరు చేయాల్సింది కూడా మీరు చేయాలి. ప్రతి గడపకూ వెళ్లాలి.. మీరు కచ్చితంగా ప్రతి గడపకూ వెళ్లాలి. ఆ ఇంట్లో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచిని వారికి వివరిస్తూ, గుర్తు చేస్తూ వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఆ వార్డులో సహేతుక కారణాలతో ఎవరికైనా ప్రయోజనం చేకూరకుంటే దీన్ని పరిష్కరించాలి. ఆ విధంగా మమేకం కావాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే మనం దగ్గరుండి పరిష్కరించాలి. ఇలా నేను చేయాల్సింది నేను.. మీరు చేయాల్సింది మీరు చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్ జరిగితే 175కి 175 సాధ్యమే. వ్యవస్థలో గొప్ప మార్పులు.. మనం నలుగురికి మంచి చేయాలంటే అధికారంలో ఉంటేనే చేయగలుగుతాం. ఇవాళ వ్యవస్ధలో గొప్ప మార్పులు జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే మనందరం కలసికట్టుగా అడుగులు వేయాలి. చదవండి: (CM Jagan: రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్) -
విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా కేకే రాజు నామినేషన్
-
అవినీతి ‘గంటా’ను ఓడించడమే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం : మంత్రి గంటా శ్రీనివాస్ లాంటి అవినీతి చక్రవర్తి రాష్ట్రంలో మరొకరు ఉండరని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక్క హుదూద్ ఇళ్ల స్కాంలోనే సుమారు ఏడున్నర కోట్ల అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. మంగళవారం ఎన్నికల ప్రచారం భాగంగా పలు ప్రాంతాలు పర్యటించిన విష్ణుకుమార్ రాజు.. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాస్‌పై విరుచుకపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ నియోజకవర్గంలోనూ అక్రమాలు, దోపిడీలు చేయడం గంటాకు అలవాటని విమర్శించారు. దీంతో భీమిలి ప్రజలు వెళ్లగొడితే.. విశాఖపై పడ్డారని మండిపడ్డారు. ఆయనకు ఇదే ఆఖరి నియోజకవర్గం అవుతుందని జోస్యం చెప్పారు. (ఇక ‘ఉత్త’ర గంట) గంటా అవినీతిపై సిట్ రిపోర్టు బయటపెట్టి ఉంటే పోటీ చేయడానికి అర్హత లేకుండా పోయేదని పేర్కొన్నాడు. పేదలను దోచుకునే స్థాయికి మంత్రి దిగజారడం సిగ్గుచేటన్నారు. అన్ని పార్టీలు గంటాకు టికెట్ నిరాకరించాయని.. దీంతో గత్యంతరం లేకే టీడీపీని పట్టుకొని వేలాడుతన్నారన్నారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద శాతం అతడిని ఓడించడానికే ఇక్కడి నుంచి పోటీ చేస్తునాన్నని విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాష్ట్రానికి పట్టిన అవినీతి చీడ పురుగును ఓడిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపాడు. -
'కాంగ్రెస్ నాయకులకు టీడీపీ టికెట్లు'
విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలను ఫూల్స్‌ని చేశారని భరణికాన రామారావు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇచ్చి టీడీపీని తెలుగు కాంగ్రెస్‌గా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవం ఉన్నవారెవరూ టీడీపీలో ఉండరని, అందుకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా ఉన్న భరణికాన రామారావు తెలుగు దేశం పార్టీకి నిన్న గుడ్ బై చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయింది.