Vishaal
-
పక్కా ప్లాన్
ఈ ఏడాది దసరాకు ‘పందెంకోడి 2’ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు విశాల్. ఇదే స్పీడ్‌లో నెక్ట్స్ ఇయర్లో ఏ ఏ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో కూడా ఇప్పుడే ఆయన ప్లాన్ గీస్తున్నారని కోలీవుడ్ టాక్. తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్‌లో విశాల్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రాశీఖన్నా కథనాయికగా నటిస్తారు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. సెట్స్‌పైకి వెళ్లనున్న విశాల్ నెక్ట్స్ చిత్రమిదేనట. ఈ చిత్రంతో పాటు లక్ష్మణ్ డైరెక్షన్లో విశాల్ ఓ సినిమా చేస్తారని సమాచారం. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఒకేసారి జరిగేలా విశాల్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారట. ఈ రెంటినీ వచ్చే ఏడాది ఫస్టాఫ్‌లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారట. ఇక 2005లో వచ్చిన ‘పందెంకోడి’ చిత్రానికి ‘పందెంకోడి 2’ సీక్వెల్ అని తెలిసిన విషయమే. లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
ఇంత దారుణమా.. నేను షాక్ తిన్నాను!
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన తన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై ప్రముఖ నటుడు విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ‘నిన్న ప్రజాస్యామ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విశాల్ నామినేషన్‌ను మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా పరిశీలించి తిరస్కరించారు? నాపట్ల ఈసీ వ్యవహరించిన తీరును చూసి షాక్ తిన్నాను’ అని విశాల్ బుధవారం మీడియాతో పేర్కొన్నారు. తన నామినేషన్‌ను బలపరుస్తూ సంతకాలు చేసిన వారిని బెదిరించారని విశాల్ ఆరోపించారు. ఉద్దేశపూరితంగానే తన నామినేషన్‌ను తిరస్కరించారని అన్నారు. నామినేషన్ తిరస్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, నాయ్యం జరిగేవరకు వదిలిపెట్టబోనని విశాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి విశాల్ లేఖ..! ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన తన నామినేషన్‌ను తిరస్కరించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నటుడు విశాల్ లేఖ రాశారు. తన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడం సరికాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని లేఖలో తెలిపారు ఈనెల 21న నిర్వహించే ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం భారీ హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు సినీ నటుడు విశాల్ నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలుసుకుని తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాల్ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు, జయలలిత మేనకోడలు దాఖలుచేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. -
వీడియో సెంటర్లపై సినీ నటుడు విశాల్ దాడి
కోయంబత్తూరు: వీడియో సీడిల ద్వారా సినీ పైరసీ కి పాల్పడుతున్న సెంటర్లపై సినీ నటుడు విశాల్ దాడి చేశారు. పోలాచీలోని ఓ సెంటర్ పై దాడి చేసి ఆయన నటించిన పూజా చిత్ర సీడీలను స్వాధీనం చేసుకున్నారు. విశాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వీడియో షాప్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలాచీలో ఓ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న విశాల్.. గత రాత్రి తన సహాయకులిద్దర్ని పంపి.. పూజ. ఇతర తమిళ సినిమా సీడీల గురించి ఆరా తీశారు. షాప్ యజమాని పూజ, విజయ్ నటించిన 'కత్తి' సినిమా సీడిలను చూపించినట్టు తెలిసింది. దాంతో వీడియో సెంటర్ కు వెళ్లి విశాల్ సోదాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున తమిళ చిత్ర సీడీలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. గతవారం తిర్పూర్ లోని వీడియో షాప్ పై కూడా విశాల్ దాడి చేశారు. Follow @sakshinews