వీడియో సెంటర్లపై సినీ నటుడు విశాల్ దాడి | Actor Vishaal 'seizes' pirated new Tamil film CDs | Sakshi
Sakshi News home page

వీడియో సెంటర్లపై సినీ నటుడు విశాల్ దాడి

Published Fri, Oct 31 2014 7:17 PM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

వీడియో సెంటర్లపై సినీ నటుడు విశాల్ దాడి - Sakshi

వీడియో సెంటర్లపై సినీ నటుడు విశాల్ దాడి

కోయంబత్తూరు: వీడియో సీడిల ద్వారా సినీ పైరసీ కి పాల్పడుతున్న సెంటర్లపై సినీ నటుడు విశాల్ దాడి చేశారు. పోలాచీలోని ఓ సెంటర్ పై దాడి చేసి ఆయన నటించిన పూజా చిత్ర సీడీలను స్వాధీనం చేసుకున్నారు. విశాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వీడియో షాప్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. 
 
పోలాచీలో ఓ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న విశాల్.. గత రాత్రి తన సహాయకులిద్దర్ని పంపి.. పూజ. ఇతర తమిళ సినిమా సీడీల గురించి ఆరా తీశారు. షాప్ యజమాని పూజ, విజయ్ నటించిన  'కత్తి' సినిమా సీడిలను చూపించినట్టు తెలిసింది. దాంతో వీడియో సెంటర్ కు వెళ్లి విశాల్ సోదాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున తమిళ చిత్ర సీడీలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. గతవారం తిర్పూర్ లోని వీడియో షాప్ పై కూడా విశాల్ దాడి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement