Katthi
-
హిందీలో కత్తి పట్టేదెవరు?
బాలీవుడ్లో సౌత్ సినిమాల రీమేక్ గాలి బాగా వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సౌత్ నుంచి ‘టెంపర్, ప్రస్థానం, అర్జున్ రెడ్డి, విక్రమ్ వేదా’ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో తమిళం చిత్రం ‘కత్తి’ కూడా చేరిందని బాలీవుడ్ టాక్. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. ఇప్పుడీ చిత్రం హిందీ రీమేక్ రైట్స్‌ను బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దక్కించుకున్నారట. గతంలో సౌత్ నుంచి ‘విక్రమార్కుడు’ సినిమాను ‘రౌడీ రాథోడ్’గా, తమిళ మూవీ ‘రమణ’ (తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయ్యింది) సినిమాను ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ పేరుతో హిందీలో నిర్మించి హిట్ సాధించారు భన్సాలీ. ఈ రెండు సినిమాల్లో అక్షయ్ కుమార్‌నే హీరో కావడం విశేషం. మరి.. ‘కత్తి’ రీమేక్‌లో కూడా అక్షయ్‌నే హీరోగా నటిస్తారా? లేక ఇంకో హీరో చేస్తారా? తెలియడానికి కాస్త టైమ్ ఉంది. తమిళ ‘కత్తి’ సినిమా తెలుగులో చిరంజీవి హీరోగా ‘ఖైదీ నంబర్ 150’ పేరుతో రీమేక్ అయింది. -
చిరుకు జోడీ కుదిరింది
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంపై క్లారిటీ లేకపోయినా ఏదో ఒక రూపంలో ఈ సినిమాకు భారీ ప్రచారమే లభిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని, ఎట్టి పరిస్థితుల్లో మే నెలలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. కథ కూడా ఫైనల్ కావటంతో ఇప్పుడు నటీనటుల ఎంపిక మీద దృష్టిపెట్టారు. తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాను చిన్నపాటి మార్పులతో చిరు హీరోగా రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో చిరంజీవి హీరోగా ఠాగూర్ లాంటి ఘన విజయం సాధించిన వివి వినాయక్, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కథ కథనాలు కూడా ఫైనల్ అయ్యాయన్న టాక్ వినిపిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్గా నయనతారను ఫైనల్ చేశారు. ప్రస్తుతం సౌత్‌లో వరుస విజయాలతో టాప్ హీరోయిన్గా ఉన్న నయన్, ఈ సినిమాతో తొలిసారిగా మెగాస్టార్‌తో జోడీ కడుతోంది. చిరు వయసు దృష్ట్యా హీరోయిన్గా నయన్ అయితేనే కరెక్ట్ అని భావించిన చిత్రయూనిట్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరి నయన్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారట. ఇప్పటికే మే నెలలో షూటింగ్ నిమిత్తం నయన్ డేట్స్ కూడా ఇచ్చేసిందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
తమ్ముడు కాదన్న చిత్రం..అన్న చేసిన ప్రయోగం
-
వీడియో సెంటర్లపై సినీ నటుడు విశాల్ దాడి
కోయంబత్తూరు: వీడియో సీడిల ద్వారా సినీ పైరసీ కి పాల్పడుతున్న సెంటర్లపై సినీ నటుడు విశాల్ దాడి చేశారు. పోలాచీలోని ఓ సెంటర్ పై దాడి చేసి ఆయన నటించిన పూజా చిత్ర సీడీలను స్వాధీనం చేసుకున్నారు. విశాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వీడియో షాప్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలాచీలో ఓ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న విశాల్.. గత రాత్రి తన సహాయకులిద్దర్ని పంపి.. పూజ. ఇతర తమిళ సినిమా సీడీల గురించి ఆరా తీశారు. షాప్ యజమాని పూజ, విజయ్ నటించిన 'కత్తి' సినిమా సీడిలను చూపించినట్టు తెలిసింది. దాంతో వీడియో సెంటర్ కు వెళ్లి విశాల్ సోదాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున తమిళ చిత్ర సీడీలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. గతవారం తిర్పూర్ లోని వీడియో షాప్ పై కూడా విశాల్ దాడి చేశారు. Follow @sakshinews