భూ కుంభకోణం కేసు: తహశీల్దార్లకు మెమోలు
విశాఖపట్నం: విశాఖపట్నం భూకుంభ కోణం కేసులో పలువురు తహశీల్దార్లకు మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కుంభకోణాలపై విచారణ జరుపుతున్న ‘సిట్’ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కాగా మాన్సాస్ భూముల కుంభకోణం కేసులో భీమిలి మాజీ తహశీల్దార్ బీటీవీ రామారావును అరెస్టు చేశారు. కోర్టుకు హాజరుపరచగా ఈ నెల 11 వరకు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు