Vishal Film Factory
-
ఆరేళ్లుగా విశాల్ డబ్బులు కాజేసిన మహిళ!
చెన్నై : ప్రముఖ హీరో విశాల్‌ను ఓ మహిళ మోసం చేశారు. ఆయన వద్ద పనిచేస్తూనే పెద్ద మొత్తంలో డబ్బులు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా విశాల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో ఆయన పలు చిత్రాలను నిర్మించారు. అయితే ఆ ప్రొడక్షన్ కంపెనీలో పనిచేసే ఓ మహిళ ఆరేళ్ల కాలంలో దాదాపు 45 లక్షలు దారి మళ్లించినట్టుగా సమాచారం. ఈ మేరకు విశాల్ మేనేజర్ ఇటీవలే చెన్నైలోని విరుగంబక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. నిందితురాలు ఆదాయపు శాఖకు చెల్లించాల్సిన డబ్బులను తన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేసినట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. (చదవండి : ‘విశాల్ చక్ర’ ట్రైలర్ మామూలుగా లేదుగా!) సినిమాల విషయానికి వస్తే.. విశాల్ ప్రస్తుతం హీరోగా నటిస్తూ చక్ర, తుప్పరివాలన్ 2 చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఇటీవలే విడుదలైన చక్ర ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ నటి రెజీనా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. -
నటుడు విశాల్ కు షాక్
చెన్నై: సినీ నటుడు, నడిగర్ సంఘం విశాల్ కు తమిళ నిర్మాతల మండలి(టీఎఫ్ పీసీ) షాక్ ఇచ్చింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ(వీఎఫ్ఎఫ్) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఓ తమిళ మేగజిన్ కు ఇచ్చిన ఇంటర్వూలో నిర్మాతల మండలిపై విశాల్ చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వాలనంటూ టీఎఫ్ పీసీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించిన విశాల్ లేఖ ద్వారా టీఎఫ్ పీసీకి వివరణ ఇచ్చారు. విశాల్ లేఖను పరిశీలించిన నిర్మాతల కార్యనిర్వహణ కమిటీ వివరణ సరిగా లేదని పేర్కొంది. దీంతో తాత్కాలికంగా విశాల్ మెంబర్ షిప్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. -
ఒక్క రోజులో జరిగే కథ
‘‘టైటిల్ చూసి ఇదేదో డ్యాన్స్‌కు సంబంధించిన చిత్రం అనుకోకండి. ఇది డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే మర్డర్ మిస్టరీ’’ అని హీరో విశాల్ అన్నారు. విశాల్, కేథరిన్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన చిత్రం ‘కథకళి’. సంక్రాంతి సందర్భంగా తమిళంలో ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రాన్ని అదే పేరుతో త్వరలో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘తన మిత్రుడికి జరిగిన సంఘటన ఆధారంగా దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కించారు. చెన్నై నుంచి కడలూర్ వెళ్లే వరకూ ఒక్క రోజులో జరిగే కథ ఇది. స్క్రీన్‌ప్లే, ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని విశాల్ తెలిపారు. ‘‘ తమిళంలో సూర్యతో ‘పసంగ 2’ చిత్రం తర్వాత నేను చేసిన మూవీ ఇది’’ అని దర్శకుడు అన్నారు. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సాగే మూవీ ఇది. తమిళంలో నాకిది రెండవ చిత్రం. తెలుగులోనూ విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని కేథరిన్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ, నటులు మధుసూదనరావు, శత్రు తదితరులు మాట్లాడారు. -
వి మ్యూజిక్ ప్రారంభం
సినిమాల్లో హీరోగానే కాదు, నిజ జీవితంలోనూ కళ్లెదుట జరిగే అన్యాయాలను ఎదిరించాల ని నాన్న చెబుతుండేవారు. అలాంటి విషయాల్లో న్యాయం పక్కన పోరాడుతానంటున్న నటుడు విశాల్. ఈయనిప్పుడు నటుడు మాత్రమే కాదు సక్సెస్ఫుల్ నిర్మాత కూడా. కొత్తగా ఆడియో సం స్థను కూడా ప్రారంభించారు. భవిష్యత్తులో దర్శకుడయ్యే అవకాశం ఉందంటున్న విశాల్ హీరోగా నే కాకుండా నిర్మాతగా కూడా విజయం సాధించా రు. తాజాగా పూజై చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి రెడీ అవుతున్నారు. పూజై: విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నటుడు విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తు న్న మూడో చిత్రం పూ జై. శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తు న్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు హరి నిర్వహిస్తున్నారు. ఇది తెలుగులోనూ పూజా పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం మాస్ మసాలాగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహంలే దు. శరవేగంగా చిత్ర నిర్మాణం జరుపుకుంటున్న ఈ పూజై దీపావళికి సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల పుట్టినరోజును జరుపుకున్న ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ శుక్రవారం చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు. పైరసీపై పోరాడతా: పైరసీ అనేది నేరాతినేరం. ఒకరి కష్టాన్ని మరొకరు దోచుకోవడమే. దాన్ని నిర్మూలించడానికి పోరాడతానని విశాల్ పేర్కొన్నారు. ఆ మధ్య కారైకుడిలో ఇద్దరు పైరసీదారుల ను ధైర్యంగా పోలీసులకు పట్టించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఇలా తాను మాత్రమే కాదు సూపర్‌స్టార్ రజనీకాంత్, తాను అభిమానించే విజయ్, అజిత్ పరిశ్రమలోని అందరూ పైరసీ నిర్మూలనకు ముందుకు రావాలన్నారు. భవన నిర్మాణం లక్ష్యం: దక్షిణ భారత నటీనటుల సంఘంకు నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణమే తన లక్ష్యంగా విశాల్ పేర్కొన్నారు. (ఈ భవన నిర్మాణ అంశం కోర్టులో ఉంది). ఈ భవన నిర్మాణానికి అవసరమైతే నిధుల కోసం తాను, నటులు ఆర్య, జీవా, జయంరవి తదితర యువ నటులందరూ కలసి ఎలాంటి స్వార్థం లేకుండా చిత్రం చేయడానికి సిద్ధం అని ఇంతకుముందే చెప్పానన్నారు. అలాగని సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడే ఆలోచన లేదన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? అన్న ప్రశ్నకు మంచి పనులు చేయడానికి రాజ కీయ రంగ ప్రవేశం అవసరం లేదని, అలాంటి ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. దీపావళికి పూజై: పూజై చిత్రం నిర్మాణ కార్యక్రమా లు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. తా మరభరణి చిత్రం తరువాత దర్శకుడు హరి, తా ను కలసి చేస్తున్న చిత్రం ఇదన్నారు. ఈ చిత్రాన్ని దీ పావళి సందర్భంగా తమిళం, తెలుగు భాషల్లో వి డుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే వి.మ్యూజిక్ పేరుతో ఆడియో కంపెనీ ప్రారంభించినట్లు తెలిపారు. -
హిట్‌పై నమ్మకంతోనే శ్రమిస్తాం
హిట్ అవుతుందన్న నమ్మకంతోనే ఏ చిత్రానికైనా శ్రమిస్తామని యువ నటుడు విశాల్ పేర్కొన్నారు. నేటి తరం నటుల్లో విశాల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. తనకు నచ్చిన పని చేయడాన్ని ఎవరు చెప్పినా ఆపరు. అలాగే తాను చెప్పదలచుకున్న విషయాన్ని నిర్భయంగా వెల్లడిస్తారు. తాజాగా నిర్మాతగా మారారు విశాల్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై పాండినాడు అనే చిత్రాన్ని నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన మరో చిత్రం మదగజరాజ (ఎంజీఆర్) విడుదల హక్కులను తానే సొంతం చేసుకున్నారు. ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పత్రికల వారితో విశాల్ శనివారం భేటీ అయ్యూరు. ప్రశ్న :మదగజరాజా (ఎంజీఆర్) చిత్రం గురించి చెప్పండి? జవాబు: 1980లో రజనీకాంత్ రాజాధిరాజా, కమలహాసన్ సకలకళా వల్లభన్ తరహాలో చిత్రం చేయాలని దర్శకుడు సుందర్.సి, నేను భావించాం. అలాంటి పుల్ జాయ్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ఈ మదగజరాజా. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అంటూ అన్ని జనరంజక అంశాలున్న చిత్రమిది. ప్రశ్న : చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? జవాబు: ఊటీలో కేబుల్ ఆపరేటర్‌గా నటిం చాను. ఆ పాత్ర ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే చిత్రం. ప్రశ్న: చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ అంటూ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వీరిలో ఎవరు బాగా సహకరించారు? జవాబు: మరో హీరోయిన్గా సదా నటించారు. ఆమె చాలా బాగా సహకారం అందించారు. ప్రశ్న : మదగజరాజ చిత్ర విడుదలలో జాప్యానికి కారణమేమిటి? జవాబు : ఈ చిత్రాన్ని జెమినీ సర్క్యూట్ ఫిలిం సంస్థ నిర్మించింది. ఈ ప్రశ్న మీరు ఆ సంస్థను అడగాలి. ప్రతి చిత్రానికీ ఏదో సమస్య ఉం టుం ది. ఈ చిత్రానికి కాస్త ఎక్కువ ఉండొచ్చు. ప్రతి సినిమా హిట్ అవుతుందనే శ్రమిస్తాం. సమస్యలొస్తాయని ఎవరూ ఊహించరు. ప్రశ్న : ఇప్పుడీ చిత్రాన్ని మీరే విడుదల చేస్తున్నారు కదా? జవాబు : నేను నటించిన చిత్రాన్ని నేనే విడుదల చేయడానికి ముందుకు రాకపోతే ఎవరు వస్తారు? మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మదగజరాజ తొలి కాపీ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను. మొదటి నుంచి ఈ చిత్రంపై ప్రత్యేక ప్రేమ ఉంది. అందుకే మదగజరాజా చిత్రాన్ని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో నేనే విడుదల చేయనున్నాను. తెలుగులో నటరాజ తానే రాజ (ఎన్టీఆర్) అనే పేరును నిర్ణయించాం. ప్రశ్న: తమిళంలో ఎంజీఆర్ అనే ఉపశీర్షికను తొలగించడానికి కారణం? జవాబు : ఎంజీఆర్ అంటే ఎనలేని గౌరవం ఉంది. ఆ పేరును ఈ చిత్రానికి ఉపశీర్షికగా పెట్టి అవమానపరచడం ఇష్టం లేక తొలగించాం. ప్రశ్న : మదగజరాజాను సెప్టెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజుకు ఏమైనా ప్రత్యేకత ఉందా? జవాబు : మదగజరాజా ఫెస్టివల్ చిత్రమని దర్శకుడు సుందర్.సి అంటుండేవారు. అదే విధంగా ఈ చిత్రాన్ని వినాయకచతుర్థి సందర్భంగా విడుదలకు సిద్ధం చేస్తున్నాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే సరిగ్గా సెప్టెంబర్ ఆరుకి నేను పరిశ్రమకు వచ్చి దశాబ్దం పూర్తవుతుంది. ఈ సందర్భంగా నా సంస్థలో నేను నటించిన చిత్రం విడుదల కావడం విశేషంగా భావిస్తున్నాను.