vishkapatnam distirict
-
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శనివారం (నేడు) వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చదవండి: ఏపీలో తక్కువ వ్యయంతో సరుకు రవాణా శనివారం విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, ఆదివారం విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో గారలో 11.8 సెంటీమీటర్లు, గుమ్మలక్ష్మీపురంలో 8.3, కళింగపట్నంలో 8.0, పాలకొండలో 7.9, ఇంకొల్లులో 7.5, శ్రీకాకుళంలో 7.0, నూజెండ్లలో 6.4, కురుపాంలో 5.8, సీతంపేట, అద్దంకి, వేటపాలెంలో 5.1, మద్దిపాడులో 5.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చదవండి: కేసులు వేసే అధికారం ఈఓ, ఏసీలకు.. -
AP: 24 గంటల్లో అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగాను, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం తెలిపారు. ఉత్తరాంధ్రలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అలాగే, రాబోయే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40–50 కీలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక సోమవారం పలుచోట్ల వర్షాలు కురవగా, విజయనగరం జిల్లా వేపాడులో అత్యధికంగా 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఏపీలో రాగల 48 గంటల్లో విస్తారంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఏపీలో రాగల 48 గంటల్లో విస్తారంగా వర్షాలు అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ దిశగా గాలులు, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తుండటం వల్ల కూడా గత 24 గంటల్లో నైరుతి రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైందని తెలిపారు. గుణ, కాన్పూర్, మీరట్, అంబాలా, అమృతసర్‌ల మీదుగా వెళుతున్న ఈ రుతుపవనాలు వచ్చే 24 గంటల్లో దక్షిణ రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశం ఉందని వివరించారు. చదవండి: ఆటో డ్రైవర్ కుమారుడు.. ఐఏఎఫ్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా -
విశాఖలో పేదలకు ఇళ్ల స్ధలాలు
-
మంచి ప్రణాళిక
వాటర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం తలకో 135 లీటర్ల రక్షిత నీరు 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా జిల్లాలో 13 గ్రిడ్ల ఏర్పాటుకు సన్నాహాలు రూ.4727 కోట్లతో అంచనాలు ప్రపంచ బ్యాంకు నిధులిస్తేనే కార్యరూపం స్మార్ట్‌సిటీగా అవతరించనున్న మహా విశాఖలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగానే వాటర్ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే స్థాయిలో గ్రామీణ జిల్లా వాసుల దాహార్తిని తీర్చేం దుకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ మెగా ప్రాజెక్టు రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.4727 కోట్ల అంచనాతో రూపొందిం చిన ఈ పథకం పూర్తయితే వచ్చే 50 ఏళ్ల వరకు మంచి నీటికి ఢోకా ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఒక్కొక్కరికి 40 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయతగ్గ పథకాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు తగ్గట్టుగా ఒక్కొక్కరికి రోజుకు 135 లీటర్ల చొప్పున నీటిని సరఫరాచేయాలి. ఇదే ప్రమాణాలతో నీటిని సరఫరా చేసేం దుకు వీలుగా జిల్లాలో 13 వాటర్ గ్రిడ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నదులు, రిజర్వాయర్లను ఆధునికీకరించడం ద్వారానే కనీసం 25 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించనున్నారు. రానున్న 50 ఏళ్లలో పెరగనున్న జనాభాకనుగుణంగానే మంచినీటి వనరులను పెంచుకునేలా ఈ ప్రణాళికలు రూపకల్పన చేశారు. ఇందుకోసం రూ.4727 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ మేరకు వారం రోజుల క్రితం ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇంత పెద్దఎత్తున చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ప్రభుత్వం సమకూర్చే పరిస్థితి లేనందున హడ్కో లేదా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో చేపట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇదేరీతిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వాటర్ గ్రిడ్లు ఏర్పాటు చేయబోతున్నారు. మన జిల్లాలోని 1833 ఆవాస ప్రాంతాల్లో నివసించే 18,21,644 మందికి తగ్గట్టుగా వీటికి రూప కల్పన చేశారు. మొదటి గ్రిడ్ ద్వారా అనకాపల్లి, యలమంచలి, పెందుర్తి నియోజక వర్గాల్లోని నాలుగు మండలాలు అర్బన్ కలిపి 301 ఆవాస ప్రాంతాలకు ఏలేరు, పోలవరం కాలువల నుంచి నీటిని సరఫరా చేస్తారు. రెండో వాటర్ గ్రిడ్ ద్వారా యలమంచిలి నియోజకవర్గంలోని మూడు మండలాలు, అర్బన్‌లోని 151 అవాసాలు, అచ్యుతాపురం ఏపీఐఐసీ సెజ్‌లకు, మూడో గ్రిడ్ ద్వారా భీమిలి, పెందుర్తి నియోజక వర్గాల్లోని ఐదు మండలాల్లో 330 ఆవాసాలకు, నాల్గవ గ్రిడ్ ద్వారా పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 208 ఆవాసాలకు ఏలేరు కాలువ నుంచి నీటిని సరఫరా చేస్తారు. ఐదో గ్రిడ్ ద్వారా మాడుగుల మండలంలో 104 ఆవాసాలకు పెద్దేరు రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేస్తారు. ఆరో గ్రిడ్ ద్వారా చీడికాడ మండలంలో 55 ఆవాసాలకు కోనాం రిజర్వాయర్ నుంచి, ఏడో వాటర్ గ్రిడ్ ద్వారా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని మూడు మండలాలకు చెందిన 199 ఆవాసాలకు రైవాడ రిజర్వాయర్ నుంచి, ఎనిమిదవ గ్రిడ్ ద్వారా చోడవరం నియోజక వర్గం పరిధిలోని మూడు మండలాల్లోని 204 ఆవాస ప్రాంతాలకుకల్యాణపులోవ రిజర్వాయర్ నీటిని అందిస్తారు. తొమ్మిదవ గ్రిడ్‌లో నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలంలో 86 ఆవాస ప్రాంతాలకు తాండవ రిజర్వాయర్ నుంచి, 10వ గ్రిడ్ ద్వారా నర్సీపట్నం మండలంలోని 34 ఆవాస ప్రాంతాలకు, 12వ గ్రిడ్ ద్వారా మాకవారిపాలెం మండలంలోని 66 ఆవాస ప్రాంతాలకు ఏలేరు కెనాల్ నుంచి నీటిని సరఫరా చేయనున్నారు. మిగిలిన ఆవాస ప్రాంతాలకు 13వ గ్రిడ్ ద్వారా ఏలేరు, పోలవరం కాలువ నుంచి నీటిని సరఫరా చేయనున్నారు. ఈ గ్రిడ్లు పూర్తిగా సోలార్ విద్యుత్‌తో నడిచేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం వాటర్ గ్రిడ్ల ఏర్పాటుపై ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి కార్యరూపం దాలిస్తే మరో 50 ఏళ్ల వరకు నీటిఎద్దడి సమస్యే ఉండదు. కనీసం ఐదేళ్ల కాల పరిమితిలో వీటిని పూర్తి చేయవచ్చు. రాష్ర్ట వాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఇలాంటి వాటర్ గ్రిడ్ల రూపకల్పనకు ప్రతిపాదనలు ఆర్డబ్ల్యూఎస్ తయారు చేసింది. వేల కోట్ల ఖర్చుతో కూడుకున్నందున దశల వారీగా చేపట్టే అవకాశాలున్నాయి. - తోట ప్రభాకరరావు, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్