vishwananthan anand
-
చెస్ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలు
చెస్ అనేది అనేక ప్రయోజనాలను అందించి, మేధో సంపత్తిని పెంపొందిచే మనోహరమైన క్రీడ. ఈ క్రీడను క్రమం తప్పకుండా ఆడటం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.దృక్కోణం పెరుగుతుంది: చెస్‌కు క్రమం తప్పకుండా ఆడటం వల్ల వ్యక్తుల యొక్క దృక్కోణం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎదుటివారి కదలికలను సులువుగా పసిగట్టవచ్చు. సామాజిక సంబంధాలు మెరుగుపర్చుకోవడంలో చెస్ క్రీడ కీలకపాత్ర పోషిస్తుంది.జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది: ప్రతి రోజు కొంత సమయం పాటు చెస్ ఆడటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. చెస్ అనునిత్యం ఆడటం వల్ల దృశ్య నమూనాలను మరింత త్వరగా గుర్తిస్తారు.చురుకుదనం పెరుగుతుంది: చెస్ ఆడటంలో నైపుణ్యం కలిగిన వారు ఇతరులతో పోలిస్తే మానసిక చురకుదనం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి మానసిక స్థితి అథ్లెట్లు, కళాకారుల మాదిరిగా ఉంటుంది.ప్రణాళికా నైపుణ్యాలను పెంచుతుంది: చెస్ క్రమం తప్పకుండా ఆడటం వల్ల ప్రణాళికా నైపుణ్యం, దూరదృష్టి పెరుగుతాయి. ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది.స్వీయ-అవగాహన పెరుగుతుంది: చెస్ ఆడటం వల్ల స్వీయ అవగాహన పెరుగుతుంది. దీని వల్ల మనల్ని మనం విశ్లేషించుకోవచ్చు. మన తప్పులు మనం తెలుసుకోగలుగుతాం.వృద్దాప్యంలో తోడ్పడుతుంది: మానసిక ఉత్తేజాన్ని కలిగించే చెస్‌ను క్రమం తప్పకుండా ఆడటం వల్ల వృద్దాప్యంలో ఎదురయ్యే మేధస్సు క్షీణత వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.ఏకాగ్రత సాధించేందుకు దోహదపడుతుంది: చెస్ అనునిత్యం ఆడటం వల్ల ఏకాగ్రత లోపం సమస్య నుంచి బయటపడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.భయాందోళనలను తగ్గిస్తుంది: చెస్ ఆడే సమయంలో చూపే ఏకాగ్రత కారణంగా భయాందోళనలు తగ్గుతాయి.పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి: చిన్నతనం నుంచి చెస్ ఆడటం అలవాటు చేసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. -
అలా... ఢిల్లీలో మొదలైంది
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ కోసం ఒలింపిక్స్ మాదిరి ఈసారి భారత్‌లో శ్రీకారం చుట్టిన టార్చ్ రిలే దేశ రాజధానిలో ఘనంగా మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి లాంఛనంగా ఈ జ్యోతి రిలేను ప్రారంభించారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కడి వోర్కోవిచ్ తొలి టార్చ్ బేరర్ కాగా... దీనిని అందుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత చెస్ సూపర్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు అందించారు. ► క్రీడా సమాఖ్య చీఫ్, ప్రధాని, చెస్ దిగ్గజం... ఇలా విభిన్న అతిరథుల మధ్య టార్చ్ రిలే వైభవంగా మొదలైంది. ఇక్కడి నుంచి ఇకపై 40 రోజుల పాటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతావనిని ఈ జ్యోతి చుట్టి వస్తుంది. ► వివిధ రాష్ట్రాలకు చెందిన 75 నగరాల్లో టార్చ్ రిలే కార్యక్రమం జరుగుతుంది. లేహ్, శ్రీనగర్, జైపూర్, సూరత్, ముంబై, భోపాల్, పట్నా, కోల్‌కతా, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్, కన్యాకుమారిల మీదుగా సాగే రిలే చివరకు ఆతిథ్య వేదిక అయిన తమిళనాడులోని మహాబలిపురంన కు చేరుకుంటుంది. ఏ రాష్ట్రానికి వెళితే అక్క డి గ్రాండ్‌మాస్టర్లు జ్యోతిని అందుకుంటారు. ► చెస్ ఒలింపియాడ్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. శతవసంతాల సమయంలో తొలిసారి భారత్ లో ఈ ఈవెంట్ జరుగుతోంది. మొత్తం 188 దేశాలకు చెందిన ప్లేయర్లు పాల్గొంటారు. ► ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘చెస్ పురిటిగడ్డపై చెస్ ఒలింపియాడ్ ప్రప్రథమ టార్చ్ రిలేకు అంకురార్పణ జరగడం గర్వంగా ఉంది. చదరంగం పుట్టిన దేశంలో చెస్ ఒలింపియాడ్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇలా జ్యోతి రిలే భారత్‌లో మొదలవడం దేశానికే కాదు... చెస్ క్రీడకే గౌరవం పెంచినట్లయింది’ అని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా భారత మహిళా తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎం), ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపితో మోదీ కాసేపు సరదాగా చెస్ గేమ్ ఆడారు. ► చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు చెస్ ఒలింపియాడ్ జరుగుతుంది. భారత్ తరఫున ఓపెన్ విభాగంలో రెండు జట్లు, మహిళల విభాగంలో రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. 2014లో ఓపెన్ విభాగంలో భారత జట్టు తొలిసారి కాంస్య పతకం సాధించింది. కరోనా కారణంగా 2020లో ఆన్లైన్ ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలు గా నిలువగా... 2021లో మళ్లీ ఆన్‌లైన్‌ఒలింపియాడ్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. -
తొమ్మిదో స్థానంలో ఆనంద్
దుబాయ్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి ఐదు రౌండ్లు పూర్తయ్యాక భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడున్నర పాయింట్లతో సంయుక్తంగా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇవాన్ లోపెజ్ (స్పెయిన్), మాక్సిమ్ మత్లకోవ్ (రష్యా), విక్టర్ లాజ్నికా (రుమేనియా)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్... సందీపన్ చందా (భారత్), వ్లాదిమిర్ ఫెదోసీవ్ (రష్యా)లపై గెలిచాడు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి ఐదు రౌండ్ల నుంచి మూడు పాయింట్లు రాబట్టాడు. జూడిత్ పోల్గర్ (హంగేరి) చేతిలో ఓడిపోయిన హరికృష్ణ... ఇవాన్ సొకోలోవ్ (నెదర్లాండ్స్), లారెంట్ ఫ్రెసినెట్ (ఫ్రాన్స్) గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ఎవగెని నజర్ (రష్యా)తో జరిగిన గేమ్‌లో నెగ్గాడు.