viswa hindu parishad
-
అక్కడుంది చంద్రబాబు.. SIT ఏర్పాటుపై వీహెచ్‌పీ సురేంద్ర జైన్ ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ : చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి లడ్డు వివాదాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని, లడ్డూ వివాదంలో నిజానిజాలు బయటకు రావాలంటే సిట్ సరిపోదని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. సిట్ ఏర్పాటుపై సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.‘చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు. తన రాజకీయ స్వార్థం కోసం లడ్డు వివాదం అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. లడ్డుపై వివాదంపై నిజా నిజాలు బయటికి రావాలంటే ఆయన నియమించిన సిట్ సరిపోదు. న్యాయ విచారణ జరగాలి’ అని డిమాండ్ చేశారు.రాజకీయ ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు బయటికి రావాలంటే న్యాయ విచారణే శరణ్యం’ అని సురేంద్ర జైన్ తెలిపారు. ఈ సందర్భంగా లడ్డూ వివాదంపై తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందవద్దని, ఈ అంశంపై త్వరలోనే మేం న్యాయపరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దేశంలో అన్ని దేవాలయాలు నిర్వాహణ నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి. దేవాలయాల పరిరక్షణపై వీహెచ్‌పీ త్వరలో ఉద్యమం చేపడుతుంది’ అని సురేంద్ర జైన్ హెచ్చరించారు. సిట్‌లో చంద్రబాబు మనిషితిరుమల లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కూలంగా వ్యవహరించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ చీఫ్‌గా నియమించారు. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు. -
అర్బన్ నక్సల్స్తోనే హిందుత్వానికి ముప్పు
సాక్షి, హైదరాబాద్: దళితులు, ఆదివాసీలు హిందువులు కాదంటూ అర్బన్ నక్సలైట్లు విషప్రచారం చేస్తున్నారని, వారివల్లే హిందుత్వానికి ముప్పు పొంచి ఉందని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధానకార్యదర్శి మిలింద్ పరండేజీ అన్నారు. ఆదివారం హైదరాబాద్ కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల పండుగలు అతి ప్రాచీనమైనవని, దాదాపు రెండు వేల ఏళ్ల నుంచి విదేశీ దురాక్రమణలను ఎదుర్కొంటూ హిందువులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 185 జిల్లాల్లో హిందువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, కశీ్మర్, అరుణాచల్ ప్రదేశ్, దక్షిణ బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో హిందువుల పండుగలను స్వేచ్ఛగా జరగనివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లో ‘మేం ఏ మతానికి చెందని వారం కాదు’ అని చెప్పేవారి సంఖ్య కోట్లలో ఉందని, వారంతా హిందువులేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు స్థానుమలై, రాఘవులు, సత్యంజీ, కేశవ్హెడ్గే, యాదిరెడ్డి, జగదీశ్వర్, రాజేశ్వర్‌రెడ్డి, పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ రాష్ట్ర కో కన్వీనర్ శివరాములు పాల్గొన్నారు. -
హిందువులు చర్చికెళ్తే ఖబడ్దార్..
డిస్పూర్: ప్రేమికుల రోజు మన సంస్కృతి కాదు.. యువతీయువకులు బయట జంటగా కనిపిస్తే.. పెళ్లి చేస్తాం అని బెదిరించే బజరంగ్ దళ్ కార్యకర్తలు తాజాగా క్రైస్తవుల పవిత్ర పర్వదినం క్రిస్టమస్ మీద పడ్డారు. హిందువులు ఎవరైనా క్రిస్టమస్ నాడు చర్చికి వెళ్తే చితకబాదుతాం జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ మిథు నాథ్ అస్సాం కాచర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథ్ ఇలా మాట్లాడటానికి ప్రధాన కారణం.. కొన్ని రోజుల క్రితం క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న మేఘలయాలో వివేకానంద సెంటర్‌ని మూసి వేశారు. ఆ కోపంతో నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రైస్తవులు మన పవిత్ర పుణ్యక్షేత్రాలను మూసి వేశారు. ఈ స్థితిలో ఎవరైనా హిందువులు, చర్చికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విషయంలో మేం చాలా సీరియస్‌గా ఉన్నాం’ అన్నారు. ( సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!) అంతేకాక ‘మా మాటలు కాదని ఎవరైనా చర్చికెళితే.. మేం వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత రోజు పేపర్లో మేం హెడ్‌లైన్స్‌లో నిలుస్తాం. "గుండాదళ్" ఓరియంటల్ పాఠశాలను ధ్వంసం చేసింది.. అని పేపర్లో వస్తుంది. కాని అది మా ప్రాధాన్యత కాదు. షిల్లాంగ్‌లోని క్రైస్తవులు మన దేవాలయాల ద్వారాలను లాక్ చేస్తున్నప్పుడు హిందువులు వారి కార్యక్రమాలలో పాల్గొనడాన్ని మేం అనుమతించము’ అని మిథు నాథ్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ఖాసీ విద్యార్థి సంఘం రామకృష్ణ మిషన్ ఆలయాన్ని మూసివేసింది అని తెలిపారు. అయితే, ఈ వాదనను మేఘాలయ ప్రభుత్వ ఉన్నతాధికారి ఖండించినట్లు సమాచారం. డిస్ట్రిక్ హాలీడే కావడంతో సాంస్కృతిక కేంద్రం మూసివేశారని.. లాక్ చేయలేదని సదరు అధికారి తెలిపారు. -
‘భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదు’
-
వీహెచ్‌పీ మోడల్లోనే మందిర్..
సాక్షి, న్యూఢిల్లీ : విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) 30 ఏళ్ల కిందటే ప్రతిపాదించిన రామమందిర నిర్మాణ మోడల్లో ఎలాంటి మార్పులూ చేపట్టడం లేదని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పష్టం చేశారు. కోల్‌కతాలో ప్రస్తుతం ఐదు అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు కలిగిన ఫైబర్ టెంపుల్ కోల్‌కతాలో నిర్మాణ దశలో ఉందని, రామ మందిర నిర్మాణ మోడల్లో ఎలాంటి మార్పులు లేవని వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్ అయోధ్యలోని కరసేవక్‌పురంలో స్పష్టం చేశారు. మోడల్లో మార్పులు కోరుకునేవారు రామ మందిర నిర్మాణాన్ని కోరుకునేవారు కాదని అన్నారు. మోడల్లో మార్పులు చేస్తే మందిర నిర్మాణంలో జాప్యం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ త్వరలో అయోధ్యను సందర్శించి మందిర నిర్మాణంపై సంప్రదింపులు జరపనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్‌తో యోగి ఆదిత్యానాథ్ సమావేశమవుతారు. మందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏడుగురు సభ్యులతో కూడిన ట్రస్ట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
వీహెచ్‌పీ, బజరంగ్ దళ్‌లకు సీఐఏ షాక్
న్యూయార్క్ : విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్లను మత ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రభుత్వ నిఘా విభాగం సీఐఏ తన వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ తాజా సంచికలో పేర్కొంది. ఈ సంస్థలను రాజకీయ ఒత్తిడి గ్రూపుల విభాగంలో చేర్చింది. రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ రాజకీయ ఒత్తిళ్లను పెంచే ఈ సంస్థల నేతలు మాత్రం చట్టసభల్లో తలదూర్చరని వీటి స్వభావాన్ని నిర్వచిస్తూ సీఐఏ పేర్కొంది. భారత్‌లో రాజకీయ ప్రెజర్ గ్రూప్స్‌లో ఆరెస్సెస్, హురియత్ కాన్ఫరెన్స్, జమౌతే ఉలేమా ఇ హింద్ తదితర సంస్థలను సీఐఏ పొందుపరిచింది. అయితే ఆరెస్సెస్‌ను జాతీయవాద సంస్థగా నిర్వచించిన సీఐఏ హురియత్ కాన్ఫరేన్స్ను వేర్పాటువాద గ్రూపుగా, జమైతే ఉలేమా ఇ హింద్‌ను మత సంస్థగా పేర్కొంది. సీఐఏ ఏటా వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్‌లో ప్రపంచ దేశాల్లో ప్రజలు, ప్రభుత్వం, సంస్థల వివరాలను ప్రచురిస్తుంది. అమెరికా విధాన రూపకర్తలకు, నిఘావర్గాలకు, దర్యాప్తు సంస్థలకు ఈ సమాచారం మెరుగైన వనరుగా భావిస్తారు. -
గోవధ వద్దు..
విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్భాయ్ తొగాడియా తుళ్ళూరు: ‘గోవధ నిర్మూలిద్దాం.. భారతీయ ధర్మాన్ని పరిరక్షిద్దాం..’ అని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా పిలుపు నిచ్చారు. మంగళవారం మండలంలోని తాళాయపాలెం శైవక్షేత్రంలో నిర్వహించిన పుష్కర బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు. అనంతరం తొగాడియా మాట్లాడుతూ ఎంతో ప్రశస్తమైన హైందవ సంప్రదాయాలను కాపాడుకోవడం భారతీయుల బాధ్యత అన్నారు. దేశంలో గోవధ దారుణంగా జరుగుతుందని దీన్ని అరికట్టడం ప్రతి భారతీయుడి ధర్మమని ఆయన అన్నారు. ఎలాంటి మందులు లేకుండా గోవునుంచి లభించే వ్యర్థాలు మనుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. అన ంతరం పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, మఠ పీఠాధిపతులను సన్మానించారు, -
దేశానికి రెండు రాజ్యాంగాలు అనవసరం: తొగాడియా
అలహాబాద్: భారతదేశానికి రెండు రాజ్యాంగాలు అవసరం లేదని, రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. 370 అధికరణను సమీక్షించాలని, కాశ్మీర్‌కు అవసరమైతే కొనసాగించాల్సిందేని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సూచనతో వీహెచ్‌పీ నేత విభేదించారు. దేశానికి రెండు రాజ్యాంగాలు అవసరంలేదని పేర్కొన్నారు. ప్రత్యేక రాజ్యాంగం వల్ల భారత్‌లో మరో దేశంగా కాశ్మీర్ చలామణీ అవుతున్నదని తొగాడియా చెప్పారు. గుజరాత్‌లోఉన్న ఆయన సోమవారం ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని ఎట్టిపరిస్థితిలో ఆమోదించేది లేదన్నారు. అంతేకాక దేశంలో ఉమ్మడిపౌరస్మృతి ఉండాల్సిందేనన్నారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ విషయాన్ని విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు.దేశంలో అనేక మతాల వారికి ఒకటే పౌరస్మృతి అమలవుతుండగా, ముస్లింలకు మాత్రం అమలు కావడం లేదని ఆయన అన్నారు. అందరికీ ఒకటే పౌరస్మృతి ఉండాలన్నారు.