గోవధ వద్దు..
గోవధ వద్దు..
Published Tue, Aug 23 2016 6:36 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు
ప్రవీణ్‌భాయ్ తొగాడియా
తుళ్ళూరు: ‘గోవధ నిర్మూలిద్దాం.. భారతీయ ధర్మాన్ని పరిరక్షిద్దాం..’ అని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా పిలుపు నిచ్చారు. మంగళవారం మండలంలోని తాళాయపాలెం శైవక్షేత్రంలో నిర్వహించిన పుష్కర బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు. అనంతరం తొగాడియా మాట్లాడుతూ ఎంతో ప్రశస్తమైన హైందవ సంప్రదాయాలను కాపాడుకోవడం భారతీయుల బాధ్యత అన్నారు. దేశంలో గోవధ దారుణంగా జరుగుతుందని దీన్ని అరికట్టడం ప్రతి భారతీయుడి ధర్మమని ఆయన అన్నారు. ఎలాంటి మందులు లేకుండా గోవునుంచి లభించే వ్యర్థాలు మనుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. అన ంతరం పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, మఠ పీఠాధిపతులను సన్మానించారు,
Advertisement