ముగిసిన విశాఖ ఉత్సవ్
విశాఖపట్టణం: విశాఖపట్టణం ఉత్సవ్ వేడుకలు ఆదివారం ముగిశాయి. వేడుకలకు మంత్రి గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఉత్సవ్ జరుగుతున్న సమయంలో కరెంటు నిలిచిపోయింది. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావు చీకట్లోనే ప్రసగించాల్సి వచ్చింది. కరెంటు సదుపాయం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాలను అర్ధాంతరంగా ముగించారు.