సేవా సంస్థల సేవలు భేష్
దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు
అమరావతి (పెదకూరపాడు) : పుష్కర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్టు దేవాదాయశాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు చెప్పారు. అమరావతిలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత భోజన సౌకర్యాలను పరిశీలించి, అక్కడే భోజనం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక స్వచ్ఛంద సంస్థలు,ట్రస్ట్‌లు,స్థానిక సంస్థలు పుష్కర భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు.అన్నదానం చేయడం ఎంతో సంతోషమని అన్నారు. అమరావతి వారసత్వ నగరంగా ఎంపికైనప్పటి నుంచి అభివృద్ధి దిశగా అడుగు వేస్తోందన్నారు.