Vote case notes
-
కుట్రకు ముందు టీడీపీ నేతలు కలిశారు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కుట్రకు ముందు రేవంత్‌రెడ్డిని పలువురు టీడీపీ కీలక నేతలు కలిశారని, తర్వాత వారంతా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లారని కేసులో ప్రధాన నిందితుడు, మల్కాజిగిరి ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒకప్పటి గన్మెన్లు వివరించారు. ఈ మేరకు గన్మెన్లు రాజ్‌కుమార్, వెంకటకుమార్‌లు మంగళవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ‘2015 మే నెలలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగింది. మహానాడులోనే ఈ కుట్రకు బీజం పడింది. మహానాడులో పాల్గొన్న తర్వాత వేం నరేందర్‌రెడ్డి, ఎల్.రమణ, ప్రస్తుతం టీఆర్ఎస్ మంత్రిగా ఉన్న ఒకప్పటి టీడీపీ ముఖ్యనేతలతో రేవంత్‌రెడ్డి చర్చించారు. తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అనంతరం స్టీఫెన్సన్ ఇంటికి వచ్చారు’అని వారు వివరించారు. మరో గన్‌మన్ మహ్మద్ అమీరుద్దీన్, రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి వాంగ్మూలాల నమోదు కోసం తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 8కి వాయిదా వేశారు. -
నోటుకు ఓటు వద్దంటు సైకిల్ యాత్ర
సాక్షి, అనంతపురం అర్బన్ : ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యమైనది. ప్రజావ్యతిరేక పాలకుల పాలిట సింహ స్వప్నం. అవినీతి ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకిలించే శక్తి ఓటుకు మాత్రమే ఉంది.. ఓటు విలువ తెలుసుకో... ‘నోటుకు అమ్ముకోవద్దు’ అనే నినాదంతో ఓటర్లను చైతన్యపరుస్తూ విశాఖపట్నానికి చెందిన చింతకాల శ్రీను రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తూ శనివారం అనంతపురం చేరుకున్నాడు. చింతకాల శ్రీను విశాఖపట్నం నగరం ఆరిలోవ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతను టైల్స్ పనిచేస్తూ రోజువారిగా రూ.600 సంపాదించే కార్మికుడు. ఏడాదిలో 11 నెలలు కుటుంబం కోసం పని చేయడం.. నెలరోజులపాటు సమాజం బాగుకోసం ప్రజలను చైతన్యపరిచేందుకు పాదయాత్ర, సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను జాగృతి పరిచేందుకు సిద్ధపడ్డాడు... ‘ఓటును నోటుకు అమ్మకోవడం వల్ల మన విలువలు ఎలా పడిపోతున్నాయి. ఓటును డబ్బుతో కొన్న పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి మంగళం పాడి, ప్రజాధనాన్ని దోచేస్తున్నారు. నీతి, నిజాయతీ ఉన్న వారిని చట్టసభలకు పంపినప్పుడే వారు ప్రజాహితంగా ఉంటూ సుపరిపాలన అందిస్తారని... అప్పుడే రాష్ట్రం, దేశం సంక్షేమాభివృద్ధి దిశగా పయనిస్తూందని ఓటర్లను చైతన్య పరుస్తున్నాడు. సమాజం కోసం సైకిల్‌యాత్ర సమాజం మనకు ఏమి ఇచ్చిందని కాదు..సమాజానికి మనం ఏమి చేశామనేది ముఖ్యం. నేను ప్రతి నెలా సంపాదనలో కొంత పోగుచేసి, ఏడాదిలో నెల రోజులు సమాజం కోసం పని చేస్తా. 2018, మే నెలలో విద్యా–వైద్యం వ్యాపారమయం చేయకుండా సామాన్యులకు అందుబాటులో ఉంచాలంటూ విశాఖపట్నం నుంచి అమరావతి వరకు పాదయాత్ర నిర్వహించా. ఎన్నికలు దగ్గరపడ్డాయని ఓటు విలువ తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టా. అనంతపురంతో కలిపి 12 జిల్లాల్లో యాత్ర పూర్తయ్యింది. కర్నూలుతో తన యాత్ర ముగుస్తుంది. – చింతకాల శ్రీను -
మీ గొంతు కాకుంటే విచారణకు సిద్ధపడండి
‘ఓటుకు కోట్లు’ కేసులో మాట్లాడారా? లేదా? చంద్రబాబుపై సురవరం ధ్వజం హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అసలు విషయం చెప్పి తన నిజాయతీ చాటుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా సంబంధం లేని వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు తగదన్నారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో వినిపించిన గొంతు ఆయనది(చంద్రబాబు) అనే ఆరోపణలు వచ్చాయి. అది తనదో కాదో నిజం చెప్పాలి. లేదంటే విచారణకు సిద్ధపడాలి. అంతేతప్ప లేనిపోని మాటలు మాట్లాడితే ఎలా? ప్రజల్ని మూర్ఖులనుకుంటున్నారా? సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడొచ్చా? మీరు మాట్లాడారో లేదో చెప్పండి. దాని గురించి అడిగితే ఫోన్ ట్యాపింగ్ చేశారంటున్నారు. అంటే దానర్థం దొంగతనం చేశారనుకోవాలా..’’ అని నిలదీశారు. సురవరం గురువారం పార్టీ సీనియర్ నేత అజీజ్‌పాషాతో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే సెక్షన్-8 అంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతానికి సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను టీడీపీలో చేర్చుకొని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పెద్దమనిషి తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎవరో కొనుగోలు చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులకు రాష్ట్రానికో నీతి ఉండదని పేర్కొన్నారు. స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకుండా సాగదీయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణ ంపై విచారణను సీబీఐకి అప్పగించడాన్ని సురవరం స్వాగతించారు. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన చావులన్నీ హత్యలేనని అభిప్రాయపడ్డారు.