voters list increase
-
ఓటేద్దాం రండి!
సాక్షి, మెదక్: మెదక్ పార్లమెంట్‌కు ఈనెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇటీవల మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు. కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. నూతన జాబితాను అనుసరించి మొత్తం 15,95,272 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో పెరిగిన ఓట్లు 22,758 మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, పటాన్చెరు నియోకజవర్గాలు ఉన్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15,95,772 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లదే పైచేయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,99,958 మంది మహిళా ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 7,95,199 మంది, 115 మంది ఇతరులు ఉన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. నూతన జాబితా ప్రకారం మెదక్ నియోకజవర్గంలో ఓటర్ల సంఖ్య 2,04,445కు చేరుకుంది. ఇందులో మహిళా ఓటర్లు 1,06,353 మంది ఉండగా.. పురుష ఓటర్లు 98,090, ఇతరులు ఇద్దరు ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో నూతన జాబితాను అనుసరించి మొత్తం 2,10,658 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,06,921 మంది ఉండగా.. పురుషులు 1,02,731 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోకజవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలో 22,758 మంది ఓటర్లు పెరిగారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో 3,92,345 మంది ఓటర్లు ఉండగా.. తాజాగా సవరించిన జాబితాను ప్రకారం ఆ సంఖ్య 4,15,103కు చేరుకుంది. మెదక్ నియోజకవర్గంలో 12,660 మంది ఓటర్లు పెరగగా, నర్సాపూర్ నియోజకవర్గంలో 10,098 మంది కొత్తగా చేరారు. పెరిగిన ఓటర్లలో అత్య«ధికులు యువకులు ఉన్నారు. మెదక్ జిల్లా అధికారులు కొత్త ఓటర్ల నమోదుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకోసం డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రచారం నిర్వహించారు. అలాగే ఓటర్ల నమోదపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 22,758 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. పటాన్చెరులో 2,99,428 మంది ఓటర్లు మెదక్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా పటాన్చెరు పరిధిలో 2,99,428 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో 2,48,080 మంది ఓటర్లు ఉండగా.. సిద్దిపేట నియోజకవర్గంలో 2,17,831, సంగారెడ్డిలో 2,16,407, నర్సాపూర్ నియోజకవర్గంలో 2,10,658, మెదక్‌లో 2,04,445, దుబ్బాకలో 1,98,423 మంది ఓటర్లు ఉన్నారు. -
జిల్లా ఓటర్లు 27,12,831
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఓటర్ల జాబితాకు అడ్డంకులు తొలగిపోవడంతో శనివారం జిల్లా యంత్రాంగం కొత్త జాబితానుప్రకటించింది. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని, పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొన్ని పార్టీలు ఏకంగా న్యాయస్థానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఓటర్ల జాబితా విడుదలలోఆలస్యమైంది. కాగా, ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులతో పాటు కొత్తగా నమోదుకు అవకాశం కల్పించడంతో జిల్లా వ్యాప్తంగా 1,83,873 మంది ఓటర్లుగా నమోదయ్యారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 27,12,831కి చేరింది. ఇందులో మహిళలు 12,94,102 కాగా, పురుషులు 14,18,328 ఉన్నారు. మహిళలు అధికం గత నెల 25వ తేదీ వరకు ఓటర్ల జాబితా ముసాయిదా సవరణకు అవకాశం కల్పించడంతో మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొత్తగా 94,025 మంది స్త్రీలు ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకున్నారు. మహిళలతో పోలిస్తే పురుషులు కేవలం 89,799 మంది మాత్రమే ఓటర్లుగా చేరారు. తాజాగా థర్డ్ జెండర్ కేటగిరీలో 49 మంది ఓటర్లు జాబితాలోకెక్కారు. దీంతో వీరి సంఖ్య 401 చేరింది. -
10,04,481 ఇదీ జిల్లాలో ఓటర్ల సంఖ్య
మహబూబ్‌నగర్ న్యూటౌన్ :ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో అధికారులు చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు సఫలీకృతమైంది. తాజాగా ఎన్నికల కమీషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలో కొత్తగా 73,024 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. తుది జాబితా ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 10,04,481 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 5,02,528 మంది పురుపులు, 5,01,900 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ఇతరులు 53 మంది ఓటు హక్కు పొందారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ ఓటర్లు ఇద్దరు, సర్వీస్ ఓటర్లు 641 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. గణనీయమైన పెరుగుదల జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే గణనీయంగా ఓటర్ల సంఖ్య పెరిగింది. తాజాగా విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 10,04,481 మంది ఓటర్లు నమోదయ్యారు. గతంలో విడుదల చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్–2018 ఫైనల్ ఓటర్ల జాబితాతో పోలిస్తే తాజాగా జాబితాలో 73,024 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. ఇందులో పురుషులు 35,285 మంది, స్త్రీలు 37,762 మంది ఓటర్లుగా నమోదయ్యారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ జిల్లాలోని ఐదు అసెంబ్లీల్లో నియోజకవర్గాల్లో పోలిస్తే మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం 2,07,280 మంది ఓటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో మక్తల్ నియోజకవర్గం 2,06,909 మంది ఓటర్లతో ఉండగా.. జడ్చర్ల నియోజకవర్గం 1,89,915 మంది ఓటర్లతో చివరి స్థానంలో నిలిచింది. కాగా నారాయణపేట, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. ఈసీ ఆదేశాల మేరకు తెలంగాణ శాసనసభను రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాల రూపకల్పనకు చర్యలు తీసుకుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితా ల తయారీ, కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ, చేర్పులు మార్పులు వంటి అంశాలపై నెల రోజులు చేసిన కసరత్తుకు ఎన్నికల కమిషన్ తుది రూపునిచ్చింది. సెప్టెంబర్ 10న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయగా సెప్టెంబర్ 25 వరకు అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించింది. కొత్త ఓటర్ల నమోదుపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం మంచి ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు. కాగా, జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల తుది జాబితాను తాజాగా విడుదల చేసింది. ఒకటికి రెండుసార్లు పరిశీలన ఓటర్ల జాబితాల రూపకల్పనలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అధికారులు నెల రోజులుగా కసరత్తే చేశారు. బీఎల్ఓలకు శిక్షణలు, రాజకీయ పార్టీలతో సమావేశాలు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పకడ్బందీ చర్య లు తీసుకున్నారు. బీఎల్ఓల పరిధిలోని ఓటర్ల వివరాలకు పూర్తి బాధ్యతను వారికే అప్పగించి ఒకటికి రెండుసార్లు పరిశీలన చేపట్టారు. -
ఓట్లు పెరిగాయి
విజయనగరం గంటస్తంభం : పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తుది ఓటర్ల జాబితా ఖరారైంది. తాజా జాబితా ప్రకారం జిల్లాలో 34,634 మంది ఓటర్లున్నారు. గతంతో పోల్చి చూస్తే 66 ఓట్లు పెరిగాయి. నోటిఫికేషన్ వరకు చేర్పులకు అవకాశం ఇవ్వడం, సక్రమంగా లేకపోవడంతో కొన్ని ఓట్లు తొలిగించడంతో జాబితా స్వల్పంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గానికి మార్చి 9న ఎన్నికలు జరగనున్న విషయం విధితమే. ఇప్పటికే నామినేషన్ల పక్రియ ముగియగా, ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారులు ఖరారు చేశారు. వాస్తవానికి ఓటర్ల జాబితా తయారీ కార్యక్రమం అక్టోబర్‌లో మొదలుకాగా, జనవరి 12వ తేదీతో ముగిసింది. అప్పట్లో ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలో 34,570 మంది ఓటర్లున్నారు. అయితే ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే వరకు ఆన్లైన్ ద్వారా ఓటు నమోదుకు అవకాశం కల్పించడంతో ఓటర్ల సంఖ్య మరి కాస్త పెరిగింది. కొత్తగా చేరినవి 405 నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో 430 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో అన్ని ధ్రువపత్రాలు సమర్పించిన 405 మందిని ఓటర్లుగా అవకాశం కల్పించడంతో మొత్తం సంఖ్య 34,975కు చేరింది. అయితే చాలామంది నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారన్న ఆరోపణలు రావడంతో అధికారులు మళ్లీ విచారణ చేపట్టి 341 బోగస్ ఓటర్లను తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 34,634కు చేరింది. ఇందులో పురుషులు 24,391 మంది ఉండగా, స్త్రీలు 10,243 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓట్లు అసలు నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ జాబితాను అధికారులు అభ్యర్థులకు అందజేస్తున్నారు. ఈ జాబితా ఆధారంగానే మార్చి 9న ఎన్నికలు జరగనున్నాయి.