Voters Registration
-
ఓటర్ల నమోదు షురూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులతోపాటు ఓటర్ల జాబితాలో పేరు లేనివారు నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. వచ్చే నెల 28వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు.18 సంవత్సరాలు నిండిన వారితోపాటు జాబితాలో పేర్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఓటర్లుగా నమోదు చేస్తామన్నారు. ఓటరు నమోదుతో పాటు అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. వాటిన్నింటినీ డిసెంబర్ 24లోగా పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 6న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో వచ్చే నెల 9, 10, 23, 24 తేదీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాతోపాటు సవరణలకు దరఖాస్తులను స్వీకరించడానికి బీఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు. -
జనవరి 15 వరకు ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ జారీ చేసింది. 2020 జనవరి 15 వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరించనుంది. ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ కోసం కొత్త తేదీలను ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2020 జరుగుతోంది. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసుకు చేరే యువతీయువకులతో పాటు ఓటర్ల జాబితాలో పేరు లేని వ్యక్తుల నుంచి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 వరకు ఓటర్ల జాబితాల పరిశీలన, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు. డిసెంబర్ 16న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారి నుంచి ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరణ, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను 2020 జనవరి 15 వరకు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారని సీఈఓ రజత్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటర్ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటా తిరిగి ఓటర్ల జాబితాలో పేర్లు, ఇతర వివరాలను నిర్ధారించుకుంటారన్నారు. ఓటరు జాబితాలో పేర్ల ధ్రువీకరణ కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రేషన్‌కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, బ్యాంకు పాసుపుస్తకాలు, రైతు గుర్తింపు కార్డు, పాన్‌కార్డు, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జారీ చేసిన స్మార్ట్‌కార్డు, తాజాగా తీసుకున్న నల్లా, టెలిఫోన్, గ్యాస్ కనెక్షన్ బిల్లుల్లో ఏదో ఒక పత్రాన్ని బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. ఓటర్లు www.nvsp.in లేదా www.ceotelangana.nic.in లలో తమ రుజువులకు సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేసి ఓటు హక్కును నిర్ధారించుకోవచ్చన్నారు. -
ఓటు నమోదుకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటరుగా నమోదు చేసుకోలేకపోయిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీనికోసం వచ్చే నెల 2, 3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనుంది. స్థానిక బూత్‌స్థాయి అధికారులు(బీఎల్వో) పోలింగ్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉండి ఓటర్ల నమోదుకు దరఖాస్తు లు స్వీకరించనున్నారు. ఈ నెల 22న రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ–2019లో తమ పేర్లు ఉన్నాయో.. లేదో.. తెలుసుకునేందుకూ అవకాశం కల్పించింది. ఇందుకోసం స్థానిక పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఓట రు జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ శిబిరాలను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వ్యక్తులు ఓటరుగా నమోదు కావడానికి ఫారం–6 దరఖాస్తులను అక్కడికక్కడే పూర్తిచేసి బీఎల్వోకు సమర్పించాలని అన్నారు. ఈ శిబిరాల వద్ద ఫారం–6, 7, 8, 8ఏ దరఖాస్తులనూ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు తమ బూత్‌స్థాయి ఏజెంట్లను శిబిరాల వద్దకు పంపించాలని విజ్ఞప్తి చేశా రు. ఓటరు నమోదుకు సంబంధించి ఫిర్యాదులు, అనుమానాలుంటే 1950 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. తుది ఓటర్ల జాబితాతోపాటు అనుబంధ ఓటర్ల జాబితాను లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించనున్నారు. -
31 వరకు ‘ఎమ్మెల్సీ’ ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న రెండు ఉపాధ్యాయ, ఓ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదయ్యేందుకు ఈ నెల 31 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. మెదక్, నిజామాబా ద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు/ ఉపాధ్యాయుల నియోజకవర్గాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయుల మండలి నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ఈ నెల 1న ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబి తాపై అభ్యంతరాలతో పాటు కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల సమర్పణకు జనవరి 31 వర కు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2018 నవంబర్ 1 అర్హత తేదీగా ఓటర్ల నమోదుకు దరఖా స్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 15కి ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించి అనుబంధ ఓటర్ల జాబితాలను, 20న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 41 కొత్త పోలింగ్ కేంద్రాలను.. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయుల నియోజకవర్గం/ వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 59 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు -
ఈ కలెక్టర్ మాకొద్దు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఎన్నికల వేళ జిల్లా కలెక్టర్‌కు రెవెన్యూ విభాగంలోని అధికారులకు, ఉద్యోగులకు మధ్య ఏర్పడిన అగాథం వివాదాస్పదంగా మారింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేసే క్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి వ్యవహరిస్తున్న తీరు జిల్లా రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల నుంచి వీఆర్ఓల వరకు ఎవరికీ రుచించడం లేదు. గ్రామాలు, మండలాల్లో భూములు, ఇతర రెవెన్యూ సంబంధమైన పనుల్లో నెలరోజుల క్రితం వరకు బిజీగా ఉన్న వీఆర్ఏలు, వీఆర్ఓలు, డీటీలు, తహసీల్దార్లతో పాటు మండల కార్యాలయాల్లో పనిచేసే సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల వరకు ఈసీ ఆదేశాలతో ఓటర్ల నమోదు, సవరణ పనుల్లో పడిపోయారు. ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కొద్దిరోజులుగా రెవెన్యూ ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించారనడంలో అతిశయోక్తి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫీల్ట్ పనులు, సాయంత్రం నుంచి రాత్రి వరకు మండల కార్యాలయాలు, కలెక్టరేట్లో సమావేశాలతో అధికారులు, ఉద్యోగులకు ఒత్తిడి పెరిగింది. అయినా ఓటర్ల జాబితా రూపకల్పనలో ఆశించిన ప్రగతి లేదు. మంచిర్యాల జిల్లాలో గత ఎన్నికల నాటికి గత నెలలో ప్రచురితమైన ఓటర్ల జాబితాకు మధ్య 72వేల ఓట్లు గల్లంతయినట్లు తేలింది. అనంతరం కొత్త ఓటర్ల నమోదులో భాగంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు భారీగా ఆన్లైన్లో ఓటర్లుగా దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను తహసీల్దార్ల ద్వారా ఆయా గ్రామాల్లో వీఆర్ఓలు, వీఆర్ఏలు పరిశీలించి ఆఫ్‌లైన్‌లో పేర్లను జాబితాలో ఎంట్రీ చేయాలి. ఈ ప్రక్రియలో జిల్లాలోని అనేక మండలాల్లో తేడా వస్తున్నట్లు కలెక్టర్ గుర్తించారు. శుక్రవారం నాటికల్లా ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉండగా, రెవెన్యూ అధికారుల వ్యవహారంపై ఆమె పలుమార్లు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం రెవెన్యూ సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలిసి తమ నిరసన వ్యక్తం చేయాలని భావించారు. కథ అడ్డం తిరిగింది.. కలెక్టర్‌ను కలిసి తమ ఇబ్బందులను తెలియజేసేందుకు జిల్లా తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు ఎం.మల్లేష్, టీఆర్ఈఎస్ఏ అధ్యక్షుడు డి.శ్రీని వాస్‌రావు, టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీహరి, వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఓంకార్‌ల నేతృత్వంలో సుమారు 150 మంది వరకు తహసీల్దార్లు, ఉద్యోగులు గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్ ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారు. తమ ఆవేదన చెప్పుకుందామని కలెక్టర్ అపాయింట్మెంట్ కోరితే కొందరు సంఘం నాయకులకు అనుమతిచ్చారు. కలెక్టర్ భారతి వద్దకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నాయకుల పట్ల కలెక్టర్ సీరియస్ అయ్యారని సమాచారం. ‘పనిచేయాలంటే కష్టంగా ఉందా..? నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను... రాత్రి వరకు పని చేస్తున్నామంటున్నారు... ఉదయం ఎన్ని గంటలకు ఆఫీసులకు వస్తున్నారో తెలియదా..? నేను ఎవరి ముందు తెలంగాణ ఉద్యోగులు పనిచేయలేరని అన్నానో తీసుకురండి... నా వ్యక్తిగత అవసరాల కోసం పనిచేయమని చెప్ప డం లేదు... ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా 12న ప్రచురించాల్సిందే కదా...? ఆన్లైన్ దరఖాస్తులకు, ఆఫ్‌లైన్‌లో ఎంట్రీలకు తేడా ఎంతుందో మీరే చూడండి...’ అంటూ పలు అంశాలపై రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగులను దూషిస్తున్నారని, ఆత్మస్థైయిర్యాన్ని దెబ్బ తీస్తున్నారని చెప్పే ప్రయత్నం చేయగా... ఎవరిని ధూషించానో, ఎవరి పట్ల అవమానకరంగా మా ట్లాడానో తీసుకురండి... అనడంతో నాయకులు వెనుదిరిగారు. తన విధానం ఇలాగే ఉం టుందని, పనిచేయడం వీలుకాకపోతే వెళ్లిపోం డనీ అన్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులే చెప్పారు. ఎన్నికల సంఘానికి, సీఎస్‌కు లేఖ కలెక్టరేట్ నుంచి వచ్చిన రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఐబీ గెస్ట్‌హౌస్‌లో సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్నారు. శుక్రవారం ఓటర్ల జాబితా ప్రచురణ తరువాత సహాయ నిరాకరణ చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఓ లేఖ రాశారు. రెవెన్యూ ఉద్యోగులను కించపరిచేలా వ్యవహరిస్తూ, అవమానిస్తున్న కలెక్టర్‌ను మార్చాలని కోరారు. తాము వేదనకు గురవుతున్న తీరును పేర్కొన్నారు. కలెక్టర్ కింద పనిచేయలేమని, ఆమెను మార్చకుంటే మూకుమ్మడిగా సెలవుల్లోకి వెళ్తామని అల్టిమేటం ఇచ్చారు. ఎన్నికల వేళ రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ‘పనిచేయాలంటే కష్టంగా ఉందా...? నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను... రాత్రి వరకు పని చేస్తున్నామంటున్నారు... ఉదయం ఎన్ని గంటలకు ఆఫీసులకు వస్తున్నారో తెలియదా...? నేను ఎవరి ముందు తెలంగాణ ఉద్యోగులు పనిచేయలేరని అన్నానో తీసుకురండి... నా వ్యక్తిగత అవసరాల కోసం పనిచేయమని చెప్పడం లేదు... ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా 12వ తేదీన ప్రచురించాల్సిందే కదా...? ఆన్లైన్ దరఖాస్తులకు, ఆఫ్‌లైన్‌లో ఎంట్రీలకు తేడా ఎంతుందో మీరే చూడండి...’ – కలెక్టర్ మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న వీఆర్వోల నుంచి ఉన్నతాధికారుల స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్ భారతి హోళికేరి అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ ప్రవర్తన వల్ల మానసికంగా, శారీరకంగా తీవ్రంగా దెబ్బతింటున్నాం. వెంటనే ఆమెను మార్చండి. – ఉద్యోగులు ∙జిల్లా తహసీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.మల్లేష్, టీఆర్ఈఎస్ఏ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌రావు, టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీహరి, వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఓంకార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే.జోషి, ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు పంపిన లేఖ సారాంశమిది.. -
ఓటర్ల నమోదు ప్రక్రియలో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ సందర్భంగా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ నేతలు ఓటర్ల నమోదు కార్యక్రమంలో క్రియాశీలంగా వ్యవహరించాలని కోరింది. అక్టోబరు 30 వరకూ సాగే ఈ ప్రక్రియ అత్యంత కీలకమైనదిగా భావించి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల మొదలు అసెంబ్లీ, లోక్‌సభ సమన్వయకర్తలు, పార్టీ పార్లమెంటు జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ సూచించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రస్తుత నిబంధనల ప్రకారం 01.01.2019 నాటికి 18 ఏళ్లు పూర్తిచేసుకోనున్న యువతీ యువకులందరూ ఓటు హక్కు పొందడానికి అర్హులేనని పార్టీ తెలియజేసింది. ఓటు సవరణలు, మార్పులు, తొలగింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ ఆదేశించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక సర్క్యులర్‌ను జారీచేస్తూ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు కేంద్ర కార్యాలయ కోఆర్డినేటర్‌గా సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డిని నియమించినట్లు పేర్కొన్నారు. -
ఓటుపై వేటు
ఓటు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు. అలాంటి హక్కును అధికారులు, అధికార పార్టీ హననం చేస్తోన్నాయి. ఓటు వజ్రాయుధం అని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ప్రచారం చేస్తున్న అధికారులు నమోదైన ఓట్లను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారు. జిల్లాలో ఓట్ల తొలగింపు ప్రక్రియను చూస్తే అధికార యంత్రాంగం టీడీపీ ప్రభుత్వానికి సాగిలపడి తమవంతు సహకారం అందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అధికార టీడీపీ రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అన్ని అడ్డదార్లు తొక్కుతోంది. ఓటుపై వేటుతో కుటిల నీతికి పాల్పడుతోంది. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో పనిచేసే అధికారులను ఉపయోగించుకుంటోంది. జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపుతో టీడీపీ రాజకీయ అవినీతికి పాల్పడుతోంది. అది కూడా ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉండి 2014 ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లోనే అత్యధిక ఓట్లు తొలగించారు. ఒకటి కాదు రెండు కాదు జిల్లాలో ఏకంగా 2.50 లక్షల పైచిలుకు ఓట్లు తొలగించి అధికార పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపింది. ముఖ్యంగా నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోనే 1.73 లక్షల ఓట్లు తొలగించడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఓటర్ల నమోదు, చేర్పులు, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా సాగింది. 2015 నాటికి సిద్ధం చేసిన తుది ఓట్లర్ల జాబితాతో పోలిస్తే 2018 మార్చిలో ప్రకటించిన తుది జాబితాకు భారీగా వ్యత్యాసం ఉంది. డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లు, స్థానికంగా ఉండటం లేదనే రకరకాల సాకులతో జిల్లాలో భారీగా ఓట్లు తగ్గించారు. గతంలో వైఎస్సార్సీపీకి చెందిన నెల్లూరు నగర ఎమ్మెల్యే పి. అనీల్ కుమార్ యాదవ్, పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వామపక్షాల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంతో సహా పదుల సంఖ్యలో ప్రముఖల ఓట్లు గల్లంతు అయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చిన క్రమంలో ప్రముఖుల ఓట్లు తిరిగి జాబితాలో చేరాయి. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు గానూ 7 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. తాజాగా ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన తుది జాబితాలో కోవూరు, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో స్వల్పంగా ఓట్లు పెరగ్గా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వేలల్లో తగ్గిపోయాయి. దీనిపై గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. 9 లక్షల జనాభాకు 3.33 లక్షల ఓటర్లు వాస్తవానికి నెల్లూరు నగరం, నెల్లూరురూరల్ నియోజకవర్గ పరిధిలో కలుపుకుని జనాభా 9 లక్షల పైచిలుకే ఉంటుంది. ఇది అధికారిక లెక్క. ఈ క్రమంలో 9 లక్షల జనాభా ఉంటే సగటున 60 శాతం జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే 5 లక్షల ఓట్లు ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా రెండు నియోజకవర్గాల్లో కలిపి 3.33 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నారు. 2015 నాటి తుది జాబితాలో నెల్లూరు నగరంలో 2,44,563 మంది ఓటర్లు ఉండగా, 2018 మార్చి తుది జాబితాలో 1,54,920 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 89,643 ఓట్లను తొలగించారు. అది కూడా వైఎస్సార్సీపీకి పట్టు ఉన్న డివిజన్లలోనే భారీగా ఓట్లు పోవటం గమనార్హం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2015లో 2,62,743 ఓట్లు ఉండగా 2018 మార్చి నాటికి 1,78,503 ఓట్లు మాత్రమే ఉన్నట్లు తుది జాబితా ప్రకటించారు. ఇక్కడ 84,240 ఓట్లు తొలగించారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నుంచి ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిర్వహించి ఈ ఏడాది మార్చి నాటికి తుది జాబితా ప్రకటించారు. ఈ క్రమంలో బూత్‌లెవల్ ఆఫీసర్లకు సమగ్ర అవగాహన లేకపోవటం, నగరంలో కొన్ని డోర్ నంబర్లు చిరునామాలు సక్రమంగా లేక గందరగోళంగా ఉండటం, అద్దె ఇల్లు మారే వారు ఉండటం తదితర కారణాలతో భారీగా ఓటర్లను తొలగించారు. అధికారులకు చిరునామా లభించకపోతే ఓటు గల్లంతయినట్లే. నగరంలో, రూరల్‌లో బీఎల్ఓలకు ప్రాంతాలు కేటాయించారు. బీఎల్ఓలకు కేటాయించిన ప్రాంతాలపై అవగాహన లేకపోవడంతో ఇది మా ప్రాంతం కిందకు రాదని, ఆ ప్రాంతం మా పరిధిలో లేదని ఇంటింటికి పరిశీలన సరిగా నిర్వహించలేదు. ప్రాంతాలపై అవగాహన లేని కారణంగా లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఆధార్, ఫోన్ నంబర్లతో ఓట్ల అనుసంధానం డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ప్రతి ఓటును ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసింది. ఈ ప్రక్రియతో వీటికి చె క్ పెట్టే అవకాశం ఉంది. అడ్రస్‌ల మార్పులతో ఓట్ల ను తొలగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఓట్లను ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసినప్పుడు అందులోనే ఫోన్ నంబర్లు ఉంటాయి. అడ్రస్‌లు మారినప్పుడు ఆ ఓటును ఎక్కడికి మార్పు చేయాలనేది బీఎల్ఓలు గుర్తించి, మార్పులు చేర్పులు చేయొచ్చు. ఇందుకు భిన్నంగా అడ్రస్ మారితే.. ఓట్లు అడ్రస్ లేకుండా తొలగిస్తున్నారు. టార్గెట్ వైఎస్సార్ సీపీ కక్ష కట్టి తొలగిస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను కక్ష కట్టి తొలగించారు. గడిచిన కాలంలో ఎన్నడూ లేని విధంగా మా నియోజకవర్గంలో 84 వేల ఓట్లు తొలగించారు. ఇది దేనికి సంకేతం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి నీచ రాజకీయాలు సరికావు. అధికారులు మరోసారి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలి. నియోజకవర్గంలోని ఓటర్లు అందరూ కూడా ఒక్కసారి మీ ఓటు హక్కు నమోదు వివరాలను సరిచూసుకోవాలి. – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపు రాజకీయాలు సరికాదు ఓటు అనేది ప్రజాస్వామ్యం ద్వారా 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికీ లభించే హక్కు. దానిని కూడా రాజకీయం చేసి భారీగా ఓట్లు తొలగించటం దారుణం. 2014 ఎన్నికల సమయంలో నగర నియోజకవర్గంలో 2.41 లక్షల ఓట్లు ఉంటే ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన జాబితాలో 1.54 లక్షలు ఉన్నాయి. మా నియోజకవర్గంలో అత్యధికంగా 89 వేల పైచిలుకు ఓట్లు తొలగించారు. ముఖ్యంగా పార్టీకి బలం ఉన్న డివిజన్లలో ఓట్లు తొలగించారు. దీనిపై పోరాటం చేస్తాం. – డాక్టర్ పి.అనిల్ కుమార్‌యాదవ్, నగర ఎమ్మెల్యే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం గ్రామాల్లో లేని వారు, డబుల్ ఎంట్రీలు ఉన్న ఓట్లు తొలగించడం జరిగింది. ఓటు నమోదుకు త్వరలో అవకాశం కల్పిస్తాం. అర్హులైన వారి ఓట్లు నమోదు చేస్తాం. 18 ఏళ్లు నిండిన అందరు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెలలో ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. అ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నుంచి ఓటు నమోదు చేపడతాం. ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదా బీఎల్ఓ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కు నమోదు ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రజలందరూ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకుని లేకపోతే దరఖాస్తులు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, డీఆర్ఓ -
ఇకపై రెండు ఓట్లుంటే కేసులు
జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి * ఒక ఓటును తొలగించుకోవాలని సూచన * ఓటర్ల జాబితాలో పరిశీలన తప్పనిసరి * నోటిఫికేషన్ వరకు ఓటర్ల నమోదుకు అవకాశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకుని బోగస్ ఓటర్లపై ఎన్నికల యంత్రాంగం కన్నెర్ర చేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే వెంటనే వాటిని తొలగించుకోవాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. కొందరు ఓటర్లు రెండు సార్లు నమోదు చేసుకోవడాన్ని గుర్తించిన ఎన్నికల యంత్రాంగం చర్యలకు సిద్ధమవుతోంది. మరోవైపు గ్రేటర్ వాసులు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నయా?, లేదా? అన్నది తెలుసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకుంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. గైర్హాజరైన అధికారులపై చర్యలు: జీహెచ్ఎంసీ ఎన్నికలకు వార్డుల వారీగా నియామకం అయిన రిటర్నింగ్, అసిస్టెంట్ అధికారుల్లో కొందరు ఇప్పటి వరకు రిపోర్ట్ చేయకపోవడాన్ని కమిషనర్ జనార్దన్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఆదివారం బల్డియా ఎన్నికల నిర్వహణపై అడిషనల్ జోనల్, డిప్యూటీ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అధికారులుగా నియామకం అయిన వారిలో ఇప్పటి వరకు కొందరు రిపోర్టు చేయలేదన్నారు. వీరిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం అనుసరించి క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ హెచ్చరించారు. సోమవారం ఉదయంలోగా రిపోర్టు చేయని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎన్నికల విభాగం అధికారులకు సూచించారు. అదే విధంగా బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని ఏ రోజుకారోజు పరిష్కరించాలన్నారు. వార్డుల వారీగా బీసీ ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీలకు అందజేశామన్నారు.. -
నవంబర్ 1 నుంచి ఓటుహక్కు నమోదు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సాక్షి, శివ్వంపేట (మెదక్‌జిల్లా): నవంబర్ 1 నుంచి 25 వరకు ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాలను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఆంజనేయశర్మ, ఈఓ శ్రీనివాసులు భన్వర్‌లాల్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న ఆంజనేయశర్మను భన్వర్‌లాల్ అభినందించారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, జనవరి 2015 సంవత్సరానికి 18 సంవత్సరాలు నిండే యువతీయువకులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారి కోసం నవంబర్ 1 నుంచి 25 వరకు గ్రామాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తునట్టు చెప్పారు. ఓటరుజాబితాలో పేర్లు తప్పిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జనవరి 5న ఓటరు జాబితా విడుదల చేస్తామని, 25న గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌గుప్తా, ప్రధాన అర్చకులు దేవదత్తశర్మ పాల్గొన్నారు. -
ఆఖరి ఛాన్స్
రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రజాస్వామ్య ఘన సౌధ నిర్మాణంలో మీరూ భాగస్వాములయ్యేందుకుఇదే చివరి ఛాన్స్.ప్రతి ఆదివారం మీకు ఆట విడుపు అయితే ఈ సన్డే ఓటరు నమోదుకు మరో అవకాశం. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఓటర్ల నమోదు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఓటరుగా నమోదైన వారు త్వరలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. పేరూ చూసుకోవచ్చు : గతంలో మీరు ఓటరుగా నమోదు చేసుకున్నారా..? ఆ జాబితాలో పేరు ఉందో.. లేదో పరిశీలించుకోవచ్చు. ఆదివారం పోలింగ్ కేంద్రానికి వెళితే అక్కడ జాబితా అందుబాటులో ఉంటుంది. లేదంటే దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు చేసే ప్రాంతాలు : గ్రేటర్ పరిధిలో ఏ పోలింగ్ కేంద్రంలోనైనా నమోదు చేసుకోవచ్చు. మీ నియోజకవర్గం పరిధిలోని సమీప కేంద్రం అయితే మేలు. ఆఖరి అవకాశం : ఓటరుగా పేరు నమోదుకు ఈ ఎన్నికలకు ఇదే ఆఖరి అవకాశం. ఇవి తీసుకెళ్లండి : ఓటరుగా నమోదుకు