voters removed
-
అవినీతిలో చంద్రబాబుది ‘గిన్నిస్’ రికార్డు
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఏవిధంగా ఖర్చు చేయాలనే దానిపై నిబంధనలున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరీ దుబారా ఖర్చులు చేస్తుంది. విదేశీ పర్యటనల పేరుతో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లపై తిరుగుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాధారణ విమానాలలో రూ.వేల వ్యయంతో ప్రయాణిస్తుంటే.. చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విహరిస్తున్నారు. ఓ పక్క ఆదాయం లేదంటూనే నెలకు ఒక్క రోజు కూడా ఉపయోగించని ప్రత్యేక బస్సును రూ.5.5 కోట్ల తో కొన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి రాజధానిలో భవనాలకు శంకుస్థాపనలు చేసి, శిలాఫలకాలు పెడుతున్నారు. నాలుగు సార్లు రాళ్ళు వేసి రూ.350 కోట్లు ఖర్చు చేయడం ఏ పరిపాలనానుభవం కిందకు వస్తుందో టీడీపీ నాయకులే చెప్పాలి’ అన్నారు.. ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు. ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం.. ‘పోలవరం సందర్శనకు రూ.84.5 కోట్లు పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రాష్ట్రానికి అప్పగించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మొత్తం కేంద్రం మంజూరు చేస్తోంది. కేంద్ర నిధులను పట్టిసీమ ప్రాజెక్టుకు మళ్ళించి తమకు సంబంధించిన వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇంకా పూర్తిగా నిర్మించని పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు ప్రచారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని తరలించడానికి, ఉచితంగా భోజనాలు పెట్టడానికి, సుమారు రూ.84.5 కోట్లు ఖర్చు పెట్టారు. ధర్మ పోరాట దీక్షల పేరుతో సుమారు రూ.63 కోట్లు ఖర్చు చేశారు. 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు చివరకు చేతులు ఎత్తివేసి కేంద్రాన్ని విమర్శించడానికి పూనుకున్నాడు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఉండాల్సిన దానికన్నా అధిక వ్యయానికి టెండర్లు పిలవడాన్ని వివిధ కేంద్ర సంస్థలు తప్పు పట్టాయి. కేంద్రం ఇచ్చిన సొమ్ము ఎంత, పనులకు రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందీ శ్వేతపత్రం విడుదల చేయమంటే విడుదల చేయలేదు. చంద్రబాబు పాలనలో ఇసుక, మట్టి, భూముల వంటి అన్ని వనరులనూ దోచుకున్నారు. ఇలాంటి అవినీతి పాలనలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు సాధించాడు. అమరావతి కాదు భ్రమరావతి.. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అమరావతి పేరుతో ప్రజలను మోసం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం సచివాలయం, హై కోర్టు, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా తదితర భవనాలు రాజధానిలో నిర్మించడానికి కేంద్రం నిధులు మంజూరు చేయాలి. కేంద్ర ప్రభుత్వం భవనాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా శాశ్వత భవనం నిర్మాణం చేపట్టలేదు. హైకోర్టు, సచివాలయం వంటి వాటికి కూడా తాత్కాలిక భవనాలు నిర్మించారు. వర్షం వస్తే ఆ భవనాలలో నీరు చేరుతుంది. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన వేలాది ఎకరాలను తన అనుయాయులకు, ప్రైవేటు విద్యావైద్య సంస్థలకు అతి తక్కువ ధరలకు కేటాయించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించకపోగా, వారికి ఉపాధి కల్పించలేదు. రైతులకు ఏవిధమైన ప్రభుత్వం నుంచి సహాయం అందక వీధిన పడ్డారు. దీక్షల పేరుతో రూ.కోట్ల దుర్వినియోగం నవ నిర్మాణ దీక్షల పేరుతో సుమారు రూ.80 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా దీక్షల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే దీక్షల పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేసింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టింది. ఒక్క సంవత్సరం కూడా హైదరాబాద్ సచివాలయంలో ఉండకుండా సచివాలయం ఎల్ బ్లాక్ రిపేర్లుకు రూ.14.63 కోట్లు ఖర్చు చేశారు. దీనిని ఏవిధంగా సమర్థిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం మరమ్మతులకు సుమారు రూ.6.90 కోట్లు ఖర్చు చేశారు. తన కుటుంబాన్ని హోటల్ పార్కు హయాత్‌లో పెట్టి కోట్లు ఖర్చు చేయడం నిజం. దీని వలన ప్రజలకు ఒనగూరేది ఏమీ లేదు. పుష్కరాల పేరుతో కోట్లు ఖర్చు చేసి 29 మందిని బలి చేశారు. అనేక మంది క్షతగాత్రులవడానికి కారకులయ్యారు. ప్రత్యేకహోదాపై యూ టర్న్ కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ మిత్రత్వం కొనసాగినంత కాలం ప్రత్యేక హోదాను వ్యతిరేకించి అదేమైనా సంజీవినా, దానివల్ల ఒరిగేది ఏమీ లేదని చెబుతూ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో పొత్తుకు స్వస్తి చెప్పాక యూ టర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కు తానే పోరాట యోధుడినని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం. విద్యార్థులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానన్న చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడు. ‘ఐటీ గ్రిడ్స్’పై సమగ్ర విచారణ జరపాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం నేరం. పౌరుల ప్రైవసీ సమాచారాన్ని సేవా మిత్ర పేరుతో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు అందజేయడం, నాలుగు విభాగాలు గా విభజించి ఏ పార్టీకి చెందిన వారు, ఏపార్టీకి అభిమానులు వంటి మొత్తం సమాచారాన్ని దుర్వినియోగం చేశారు. వీటిని ప్రశ్నించిన వారిని రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటాను ఇవ్వడం దారుణం. దీని పై ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. యాప్‌ను ఏర్పాటు చేసి ప్రైవేటు సంస్థల ద్వారా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ‘బాబు’కు బుద్ధి చెప్పడం తథ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓట్ల తొలగింపు చేస్తున్న ప్రైవేటు సంస్థల పై చర్యలు తీసుకోవడం మాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సమస్యగా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యం. దీనిపై ఫిర్యాదు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం దారుణం. నేరం ఎక్కడ జరిగితే అక్కడ పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. అంతే గాని చంద్రబాబు తెలంగాణ పోలీసులకు సంబంధం లేనట్లు మాట్లాడడం అవివేకం. చట్టం ముందు అందరూ సమానులే ఎవరూ అతీతులు కాదు. చంద్రబాబు అవినీతి పాలనను ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు. -
ఓట్ల తొలగింపునకు 66,254 దరఖాస్తులు
కర్నూలు(అగ్రికల్చర్): గత ఏడాది నవంబర్ ఒకటి నుంచి ఈ నెల నాల్గో తేదీ వరకు ఓట్ల తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు 66,254 వచ్చినట్లు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. ఇందులో 14,574 దరఖాస్తులపై విచారణ పూర్తి చేశామని, 51,680 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిపై బుధవారం సాయంత్రంలోగా విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం ‘సాక్షి’లో ‘ఓటుపై కుట్ర’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి..ఓట్ల తొలగింపు, నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు, బల్క్ ఫారం–7 దరఖాస్తులపై కేసులు తదితర వివరాలను వెల్లడించారు. విచారణ లేకుండా, అనవసరంగా ఏ ఒక్క ఓటునూ తొలగించబోమన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనుమతి లేకుండా ఓట్లను తొలగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపుపై ప్రజల్లో ఉన్న సందేహాల నివృత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలగింపునకు దరఖాస్తు చేసిన వారితో పాటు ఓటర్లకూ నోటీసులు ఇస్తామని తెలిపారు. ఐపీ నంబరు ఆధారంగా దరఖాస్తు చేసిన వారి అడ్రెస్‌లకు వెళ్లి విచారణ చేస్తామని, లేదని చెబితే అటువంటి ఓటర్లను తొలగించే అవకాశం ఉండదని వివరించారు. ఓట్ల తొలగింపునకు అత్యధికంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 9,997, ఆదోని 9,786, పత్తికొండ 7,942, ఆలూరులో 7,951 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. వీటిపై విచారణ చురుగ్గా సాగుతోందన్నారు. ఇది వరకే తొలగించి ఉంటే అటువంటి వారు వెంటనే ఫారం–6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 21 కేసుల నమోదు బల్క్‌గా ఓట్ల తొలగింపునకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఇప్పటి వరకు 21 కేసులు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు. డోన్ నియోజకవర్గంలో 2, పత్తికొండ 3, ఎమ్మిగనూరు 2, ఆదోని 1, ఆలూరు 7, ఆళ్లగడ్డలో 6 కేసులు నమోదైనట్లు చెప్పారు. జిల్లాలో డెమొగ్రాఫికల్ సెమిలర్ ఎంట్రీస్ (డీఎస్ఈ) 11,155 ఉన్నాయని, వీటిపై విచారణ పూర్తయ్యిందని, ఇందులో 2,871 ఓట్లు తొలగించేందుకు గుర్తించామని తెలిపారు. ఆళ్లగడ్డ 158, శ్రీశైలం 221, నందికొట్కూరు 135, కర్నూలు 185, పాణ్యం 305, నంద్యాల 189, బనగానపల్లి 204, డోన్ 278, పత్తికొండ 209, కోడుమూరు 20, ఎమ్మిగనూరు 207, మంత్రాలయం 199, ఆదోని 193, ఆలూరులో 187 ప్రకారం డీఎస్ఈ ఓటర్లను తొలగించనున్నట్లు వివరించారు. ఓటరు నమోదుకు 2,35,585 దరఖాస్తులు ఓటరు నమోదు కోసం ఇప్పటి వరకు 2,35,585 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఇందులో 1,91,844 దరఖాస్తులపై విచారణ పూర్తయ్యిందని, మిగిలిన వాటిపై బుధవారం సాయంత్రంలోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు. అర్హత ఉన్నట్లు తేలితేనే ఓటర్లుగా గుర్తిసామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం ఉందన్నారు. విలేకరుల సమావేశంలో డీఆర్వో వెంకటేశం, ఎన్నికల సెల్ ఇన్చార్జ్ లక్ష్మిరాజు తదితరులు పాల్గొన్నారు. -
మాటు వేసి ఓటు తీస్తున్నారు
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో) : జిల్లాలో గత పదిరోజులుగా ఆన్లైన్లో ఓట్ల తొలగింపునకు సంబంధించి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. ఇవి నిత్యం వందల సంఖ్యలో రావడం విశేషం. వీటిలో అత్యధికంగా తప్పుడు దరఖాస్తులే. ఓటర్లకు తెలీకుండానే వారి పేరిట దరఖాస్తు చేస్తున్నవి అధికంగా ఉంటుండగా, అలాగే ఆయా ఓటర్లు స్థానికంగా నివాసం ఉండటం లేదనీ, ఇళ్లు ఖాళీ చేశారనే కారణాలు చూపించి, అభ్యంతరాలు చెబుతూ వారి ఓట్లు తొలగించాలంటూ మరికొన్ని దరఖాస్తులు వస్తున్నాయి. మొత్తానికి ఓటర్ల జాబితాలో ఉన్న వారిని అర్ధాంతరంగా తప్పించడమే లక్ష్యంగా ఇదంతా సాగుతోంది. అధికార దుర్వినియోగం నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ (ఎన్వీఎస్పీ)ను పలువురు అధికార పార్టీ నాయకులు దుర్విని యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోర్టల్‌లోకి వెళ్లి ఫామ్–7లో ఓటరు ఐడీ వివరాలు నమోదు చేసి, ఓటు తొలగించాలని ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో బూత్‌స్థాయి అధికారులు (బీఎల్ఓలు) పరిశీలించి ఆ పత్రాలలో పేర్కొన్నది నిజమైతే తొలగిస్తారు, లేకపోతే ఓటును కొనసాగిస్తారు. బీఎల్ఓలు ఏమి చేస్తారనేది పక్కన పెడితే ముందుగా టీడీపీ నాయకులు మాత్రం వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, ఇతరపార్టీల వారి ఓట్లను గుర్తించి తొలగించేందుకు ఎడాపెడా దరఖాస్తులు పెడుతున్నారు. ఇంటర్నెట్ ద్వారా ♦ ఎస్వీఎస్పీ పోర్టల్‌లో ఫామ్–7 ద్వారా ఓట్లు తొలగించాలనే దరఖాస్తులు జిల్లాలో 55,062 వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అధికారులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు రెండేసి సెట్లు చొప్పున ఓటర్ల జాబితాను గతంలో అందించారు. ♦ అప్పటి నుండే అధికార పార్టీ తనకు దక్కని ఓట్లపై కన్నేసింది. అప్పటి నుండే తొలగింపు పర్వానికి తెరలేపింది. ఓటర్ల జాబితాలను పక్కనపెట్టుకుని అందులో అధికార పార్టీకి కచ్చితంగా ఓటు వేయరని భావించే వారిని లక్ష్యంగా చేసి వారి ఓటు తొలగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ ఆచంట నియోజకవర్గంలోని 190 బూత్‌ల్లో ఆరువేలకు పైగా ఓట్లు తొలగించాలంటూ ఎఫ్–7తో దరఖాస్తులు చేశారు. నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ల పేరుతో ప్రతీ బూత్లోనూ 20 నుంచి 35 వరకూ ఎఫ్–7 దరఖాస్తులు వచ్చాయి. అయితే అసలు వైసీపీ కన్వీనర్లకు, ఈ ఎఫ్–7లకు అసలు సంబంధమే లేకపోయినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడానికి టీడీపీ నేతలే దీనికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ఎఫ్–7 దరఖాస్తులకు తమకు ఎటువంటి సబంధం లేదని మండలాలు, గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినతి పత్రాలు సమర్పించింది. అయినా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టడానికి అధికార పక్షం సన్నాహాలు చేస్తోంది. ♦ తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో కొందరి ఓట్లు తొలగించాలని ఆయా గ్రామాల్లో వైసీపీ బూత్ కన్వీనర్ల పేరుతో అధికారులకు విజ్ఞప్తులు అందుతున్నాయి. అయితే ఈ విజ్ఞప్తులన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ కన్వీనర్ల పేర్లతో రావడం గమనార్హం. దరఖాస్తులు వివరాలు ♦ కొవ్వూరు నియోజకవర్గంలో 3,748, నిడదవోలు 438, ఆచంట 5,700, పాలకొల్లు 5,525, నర్సాపురం 5,412, భీమవరం 7,570, ఉండి 589, తణుకు 2,930, తాడేపల్లిగూడెం 2,071, ఉంగుటూరు 1,836, దెందులూరు1,742, ఏలూరు 2,883, గోపాలపురం 7,468, పోలవరం 744, చింతలపూడి 6,406 ఇలా మొత్తం 55,062 దరఖాస్తులు వచ్చాయి. ♦ ఆచంట మండలంలో జక్కంశెట్టి వెంకటేశ్వరరావు ఓటు తొలగించాలని కోరుతూ అతనే ఎఫ్–7తో దరఖాస్తు చేసుకొన్నట్లు వచ్చింది. ఈ విషయమై రెవెన్యూ అధికారులు విచారణ చేయగా అసలు వాస్తవం బయటకు వచ్చింది. జక్కంశెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అసలు ఎఫ్–7తో దరఖాస్తు చేయనేలేదు. నా ఓటు హక్కును తొలగించేందుకు ఎవరో కావాలనే నా పేరుతో దరఖాస్తు చేసిఉంటారని వెంకటేశ్వరరావు వాపోతున్నారు. తప్పుడు ఫిర్యాదులపై కేసులు జిల్లాలో ఫామ్–7 ద్వారా ఓట్లు తొలగించాలని తప్పుడు ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమే. అయితే ఫామ్–7తో ఫిర్యాదులు అందాయనే ఉద్దేశంతో ఓటు తొలగించే అవకాశం లేదు. జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తులను పరిశీలించి విచారణ చేస్తున్నాం. మోసపూరితంగా ఫామ్–7ను దరఖాస్తు చేస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయిస్తున్నాం. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటు తొలగించాలంటే కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలన తరువాతే అనుమతులు ఇస్తున్నాం. తప్పుడు దరఖాస్తులపై చర్యలు తప్పవు. – ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్, జిల్లా అదనపు ఎన్నికల అధికారి -
2 రోజులు.. 23 వేల ఓటర్లు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నూతన ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులతోపాటు జాబితాలో పేరులేని అర్హులంతా నమోదుకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా వివిధ మాధ్యమాల ద్వారా ఓటు విలువ, ప్రాధాన్యత తెలుసుకుంటున్న యువత పెద్దఎత్తున ఓటరుగా నమోదు చేయించుకునేందుకు బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) వద్దకు బారులుదీరుతున్నారు. రెండు రోజుల్లోనే 23 వేల మందికి పైగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లే జిల్లా ఏరియాల్లో 3,073 ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి బీఎల్ఓలు దరఖాస్తులు స్వీకరించారు. రెండు రోజుల్లో కలిపి మొత్తం 23,174 మంది ఓటు హక్కు కోసం అర్జీలు అందాయి. ఈనెల 25వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు గడువు ఉంది. ఈ లోగా దరఖాస్తుల సంఖ్య 35 వేలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 10న విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 26.56 లక్షలు. కొత్తగా వస్తున్న దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుంటే ఓటర్ల సంఖ్య 27 లక్షలకు చేరే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రత్యేక క్యాంపులకు మంచి స్పందన వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించారు. వచ్చేనెల 8న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. తొలగింపులు తక్కువే! ప్రత్యేక క్యాంపులు కొనసాగిన రెండు రోజుల్లో ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు కోసం మొత్తం 1,144 దరఖాస్తులు అందాయి. ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటర్లు మారితే తప్పనిసరిగా తొలి జాబితాలో తమ పేర్లను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మరో నియోజకవర్గం లో ఓటు హక్కు పొందే వీలుంటుంది. వివిధ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చి నగ ర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, సరూర్‌నగర్‌తోపాటు పరిశ్రమల కేంద్రంగా మారుతున్న షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా తమ సొంత ఊళ్లలో ఓటు హక్కు ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో తాత్కాలిక నివాస ప్రాంతాల్లోని ఓటరు జాబితాలో తమ పేర్లను తొలగించుకుని తమ సొంత నియోజకవర్గంలో పొందేందుకు ఆసక్తి కనబర్చుతారు. అలాగే తమ పేర్లు, ఇంటిపేరు, పుట్టిన తేదీ తదితర వాటిలో తప్పుల సవరణకు కూడా 1,097పైగా దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటితోపాటు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నివాస స్థలం మారితే.. చిరునామా మార్పు కోసమూ 1,553 మంది అర్జీలు సమర్పించారు. అందుబాటులోకి కాల్ సెంటర్ ఓటరు జాబితాపై ఫిర్యాదులు, ఓటరు నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులు, సందేహాల నివృత్తి కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తమ సమస్యను కాల్ సెంటర్లోని సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే పరిష్కార మార్గాలు చూపిస్తారు. కలెక్టరేట్లోని ఎన్నికల విభాగంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఓటరు జాబితా, ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను ఈ కాల్ సెంటర్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. 040–23230811, 040–23230813, 040–23230814 కు అన్ని రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయవచ్చు. -
రాజకీయ దురుద్దేశంతోనే ఓట్ల తొలగింపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవల జరిగిన ఓటర్ల రివిజన్ ప్రత్యేక సమ్మరీ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించారని, అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్టు అధికారులు వ్యవహరించి వాస్తవిక ఓటర్లకి ఓటు లేకుండా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, ఉభయ కమ్యూనిస్టు, లోక్‌సత్తా పార్టీ ప్రతినిధులు మండిపడ్డారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని బుధవారం తన ఛాంబర్లో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రీజనల్ కో ఆర్టినేటర్ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇంతలా ఓట్లు రద్దయిన ప్రక్రియ జరగలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా రెండు వేల మంది ఓట్లను తొలగిస్తే.. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలోనే సుమారు 28 వేల ఓట్లను రద్దు చేయడం దారుణమన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రాజకీయ దురుద్దేశంతోనే అధికారులకు చెప్పి, ఓట్లను తొలగించారన్నారు. తమ పార్టీ బలంగా ఉన్న చోట వందలాది ఓట్లును తొలగించారన్నారు. హెచ్‌బీ కాలనీ, చిన్నబరాటం వీధి, మాజీ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి ఉన్న ప్రాంతంలోనూ, వివిధ ప్రాంతాల్లో వందల సంఖ్యలో గత 30 ఏళ్లుగా నివాసం ఉన్నవారు, గతంలో పలు పదవులు చేసినవారి పేర్లు సైతం ఈ కొత్త జాబితాలో లేవన్నారు. పూర్తి వివరాలు, జాబితాను కలెక్టర్‌కు అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాల గొప్పదని, ఈ హక్కును రద్దు చేసే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలకు వెళ్లాలని.. అలాకాకుండా అడ్డదారిలో ఓట్లను తొలగించి ప్రయోజనం పొందాలన్నా దురుద్దేశం మంచిది కాదన్నారు. జిల్లాలోనూ, నగరంలోనూ వేలల్లో ఓట్లు రద్దయినా, స్థానిక శాసన సభ్యురాలు ఉన్న ప్రాంతంలో ఒక్క ఓటు కూడా ఎందుకు పోలేదని, అధికారులు ఎందుకు మార్పులు చేయలేదని కలెక్టర్‌ను ధర్మాన ప్రశ్నించారు. గతంతో పలు పధవులు చేసిన వారి ఓట్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లను సైతం తొలగించారని కలెక్టర్‌కు వివరించారు. పట్టణంలో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని హౌసింగ్ బోర్డు కాలనీ, ఆఫీషియల్ కాలనీ ప్రాంతాలో వేలాది ఓట్లను తొలగించారన్నారు. తొలగించిన వారి వివరాలను కలెక్టర్‌కు నేతలు అందజేశారు. తొలగించిన ఓట్లను తిరిగి చేర్పించాలని కోరారు. తొలగించిన వారి ఓట్లు చేర్పించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి, ఇంటింటా సర్వేలు చేసి అర్హులందరికీ ఓటు హక్కును కల్పించాలన్నారు. ప్రజా స్వామ్యానికి అగాధం:తమ్మినేని శ్రీకాకుళం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఓట్ల తొలగింపు ప్రజా స్వామ్యానికి పెద్ద అగాధమన్నారు. రాజకీయాల్లో ఓట్లు తొలగించడం అన్యాయమన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు అధికారులు కూడా ఓట్లను తొలగించడం సరికాదని వ్యాఖ్యానించారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకొకపోతే ప్రతిసారి ఇవే పొరపాట్లు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓట్లు తమకు అనుకూలంగా లేవనే ఇబ్బందితోనే అధికార పార్టీ ప్రమేయంతో 28 వేల ఓట్లను నగరంలో తొలగించడం దారుణమన్నారు. దీనిపై ఎన్నిక కమిషన్ పరిధిలో చర్యలు తీసుకోవాలని, అప్పటికీ చర్యల్లేకపోతే న్యాయస్థానం ద్వారా రక్షణ పొందాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ముందుగానే అ«ధికారులు చర్యలు తీసుకొని, వాస్తవంగా తొలగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని కలెక్టర్‌కు తమ్మినేని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తమ పార్టీ యువ నేత స్వరూప్, తదితరులకూ పూర్తి అవగాహన ఉందని, వారి సాయం తీసుకోవాలని, ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా చూడాలని కోరారు. సూర్యమహాల్ ప్రాంతంలో దళితులకు చెందిన 250 ఓట్లను తొలగించారని, మాజీ కౌన్సిలర్ రఫీ కుటుంబ సభ్యుల ఓట్లు లేవని, చిన్నబరాటం వీధిలో 321 నుంచి 610 వరకు, శిమ్మ రాజశేఖర్ వార్డు పరిధిలో 168 ఓట్లు లేవన్నారు. హౌసింగ్ బోర్టు కాలనీలో జేఎం శ్రీను, వారి కుటుంబ సభ్యులు ఓట్లు లేవని, కొంతమందిన ఓట్లను ఓ పోలింగ్ కేంద్రం నుంచి దూరంగా ఉన్న మరో కేంద్రానికి పంపించారని కలెక్టర్‌కు తమ్మినే వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, çటెక్కలి, పలాస నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మార్పు ధర్మారావు, పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి ఎంవీ పద్మావతి, జిల్లా అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మామిడి శ్రీకాంత్, శ్రీకాకుళం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ అందవరపు సూరిబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ వైవీ సూర్యనారాయణ, డాక్టర్ సెల్ జిల్లా కన్వీనర్ పైడి మహేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, కమ్యూనిస్టు పార్టీ నాయకులు బైరి కృష్ణమూర్తి, కోరాడ నారాయణరావు, లోక్ సత్తా నాయకుడు పంచాది రాంబాబు ఉన్నారు. -
'భన్వర్ లాల్ టీఆర్ఎస్కు అనుకూలం'
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కలిశారు. అనంతరం ఆయన ఢిల్లీలోని మీడియాతో మాట్లాడారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపు అంశంపై కేంద్ర అధికారులకు వివరించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అధికార పార్టీ టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.