VRO/VRA
-
10 నుంచి రెవెన్యూ సదస్సులు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రైతుల భూ సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో వచ్చే నెల 10 నుంచి 25వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. రెవెన్యూ సదస్సులు, వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షల ఏర్పాట్లపై గురువారం సీసీఎల్ఏ కృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిన భూసమస్యలపై దృష్టిసారించాలన్నారు. శ్మశాన వాటిక ల్లో భూముల పరిరక్షణకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేస్తామని చెప్పారు. శ్మశాన వాటికలకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిపక్షంలో కొనుగోలు చేయాలన్నారు. ఫిబ్రవరి 2న జరగనున్న వీఆర్వో, వీఆర్ఏ రాత పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి వేలిముద్రలు సేకరించాలన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ పరీక్షలకు జిల్లాలో 44వేల మంది హాజరు కానున్నారని చెప్పారు. వీరి కోసం 168 కేంద్రాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి, ఆర్డీఓ జె.వెంకటరావు తదితరులు హాజయ్యారు. -
రెవెన్యూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని రెవెన్యూశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. జిల్లాలోని 53 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), 83 గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం డీఆర్వో రాజు, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ 18 ఏళ్లకుపైబడి 35 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన వీఆర్వోలకు రూ.7,520 నుంచి రూ.22,430 వరకు వేతనం ఉంటుంది. వీఆర్వోలకు దరఖాస్తులు చేసుకునే వారు ఇంటర్ విద్యార్హత ఉందన్నారు. పరీక్ష ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీలకు రూ.150 మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. వీఆర్వోలకు 2014 జనవరి 12 వరకు దరఖాస్తులకు చివరి తేదని తెలిపారు. వీఆర్వోలకు ఫిబ్రవరి 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. అబ్జెక్టివ్ రూపంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష ప్రశ్నపత్రాలు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఆన్లైన్లో, మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. వీఆర్ఏలకు జనవరి 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వీఆర్ఏలకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. వీఆర్ఏలకు దరఖాస్తులు చేసుకునేవాళ్లు ఖచ్చితంగా ఆ గ్రామస్థులై ఉండాలని, లేనియేడల తిరస్కరించడం జరుగుతుందని తెలిపారు. -
వీఆర్ఓ, వీఆర్ఏల నోటిఫికేషన్ విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో 98 గ్రామ రెవెన్యూ అధికారి, 172 గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాల భర్తీ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారిగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిల్లా వాసులై ఉండడంతో పాటు కనీసం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు, ఈ ఏడాది జులై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగులకు 39 ఏళ్ల వయస్సు సడలింపు ఉందన్నారు. ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగిన వారు కూడా అర్హులన్నారు. వీఆర్వో పరీక్ష 2014 ఫిబ్రవరి 2న ఉదయం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. గ్రామ రెవెన్యూ సహాయకుడి పోస్టుకు ఏ గ్రామానికి చెందిన వారు అక్కడే అర్హులన్నారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలన్నారు. 18 నుంచి 36 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు, మాజీ సైనిక ఉద్యోగులకు 39 ఏళ్ల వరకు అర్హులన్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 2న మధ్యాహ్నం ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ద్వారా మీ-సేవ, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా జనవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు రూ. 300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 150 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వికలాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అభ్యర్థులు పరీక్ష ఫీజును జనవరి 12లోగా చెల్లించాలన్నారు. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బోత్ ఆప్షన్ చేయించుకుంటే ఒకే సెంటర్లో రెండు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దరఖాస్తులను ఠీఠీఠీ.ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ లో నమోదు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాయవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 08455-272525కు సంప్రదించవచ్చన్నారు.