10 నుంచి రెవెన్యూ సదస్సులు | 10th from Revenue Conferences | Sakshi
Sakshi News home page

10 నుంచి రెవెన్యూ సదస్సులు

Published Fri, Jan 24 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

10th from Revenue Conferences

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రైతుల భూ సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో వచ్చే నెల 10 నుంచి 25వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. రెవెన్యూ సదస్సులు, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షల ఏర్పాట్లపై గురువారం సీసీఎల్‌ఏ కృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిన భూసమస్యలపై దృష్టిసారించాలన్నారు. శ్మశాన వాటిక ల్లో భూముల పరిరక్షణకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేస్తామని చెప్పారు. శ్మశాన వాటికలకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిపక్షంలో కొనుగోలు చేయాలన్నారు. ఫిబ్రవరి 2న జరగనున్న వీఆర్వో, వీఆర్‌ఏ రాత పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి వేలిముద్రలు సేకరించాలన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ పరీక్షలకు జిల్లాలో 44వేల మంది హాజరు కానున్నారని చెప్పారు. వీరి కోసం 168 కేంద్రాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి, ఆర్డీఓ జె.వెంకటరావు తదితరులు హాజయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement