vtps
-
మహిళ కాపురంలో టిక్ టాక్ చిచ్చు
సాక్షి, విజయవాడ: పచ్చని కాపురంలో ‘టిక్ టాక్’ చిచ్చుపెట్టింది. టిక్ టాక్ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది. సోషల్ మిడియాలో బాగా క్రేజ్ ఉన్న ‘టిక్ టాక్’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్ టాక్ ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి జాఢ్యంలా మారి జీవితాల్లో చిచ్చు పెడుతుంది. తాజాగా ఈ టిక్ టాక్ మాయలో పడి కట్టుకున్న భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుని...మొదటి భార్యను కడతేర్చేందుకు సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...విజయవాడ వీటీపీఎస్‌లో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సత్యరాజుతో అనురాధకు పదేళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజులపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవటంతో అనురాధకి కష్టాలు మొదలయ్యాయి. భర్త సూటిపోటీ మాటలతో పాటు, అత్తింటి ఆరళ్ళు పెరిగిపోయాయి. అయినా వాటన్నింటినీ పంటిబిగువున అదిమి పెట్టుకొన్నఅతికష్టం మీద కాలం వెళ్లదీస్తుంది. అయితే టిక్ టాక్‌లో వచ్చిన వీడియోతో భర్త నిజస్వరూపం బయటపడింది. పరస్త్రీతో సన్నిహితంగా ఉన్న ఆ వీడియోను చూసిన అనురాధ తట్టుకోలేకపోయింది. ఆరాతీస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన వనిత అనే యువతిని తిరుపతిలో వివాహం చేసుకొని వేరుకాపురం పెట్టినట్టు తెలుసుకొంది. ఈ విషయాన్ని నిలదీయడంతో పెద్దల సమక్షంలో తప్పు ఒప్పుకుని, మరోసారి అలా జరగదంటూ ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత తన నిజ స్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. ఇంకా పిల్లలు లేరంటూ మొదటి భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు ఎక్కువ కావడంతో మొదటి భార్య తన తల్లిదండ్రులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. -
మహిళ కాపురంలో టిక్ టాక్ చిచ్చు
-
ఆంధప్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభం
హైదరాబాద్: ఆంధప్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. డిమాండ్ బాగా పెరగడంతో ప్రధాన ఉత్పత్తి కేంద్రాల్లో పడిపోయిన విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. 1300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లోటు ఏర్పడింది. ఆర్టీపీపీలో 420 మెగావాట్లు, వీటీపీఎస్ లో 210 మెగావాట్లు, కృష్ణపట్నంలో 200 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉత్పత్తి అవుతోంది. అనంతపురం విండ్ పవర్ స్టేషన్లో 500 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. కడప ఆర్టీపీపీలో సాంకేతిక లోపంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు భారీగా పెరిగాయి. ఈ రాత్రి నుంచి విద్యుత్ కోతలు మరింత పెరగనున్నాయి. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో పలు రైళ్లు రద్దు
సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దాంతో సీమాంధ్రతోపాటు హైదరాబాద్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లనున్నాయి. అయితే ఇప్పటికే అధికారులు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనధికార కోతలు విధిస్తున్నారు. కాగా విజయవాడ సమీపంలోని వీటీపీఎస్‌లో ఉద్యోగుల సమ్మె నేడు 3వ రోజుకు చేరుకుంది. దాంతో 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది, ఆ ప్రాజెక్ట్‌లో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె రైల్వే శాఖను తాకింది. దాంతో సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రేణిగుంట మార్గంలోని అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో పలురైళ్లు ఆగిపోవడం లేదా రద్దు చేసే అవకాశం ఉందని వాల్తేర్ డివిజన్ అధికారులు వెల్లడించారు. ఉద్యోగుల సమ్మెతో ప్రకాశం జిల్లా పూర్తిగా అంధకారమయం అయింది. దాంతో జిల్లాలో పలురైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. -
ఉద్యోగుల ఆందోళనతో సగానికి పడిపోయిన విద్యుత్ ఉత్పత్తి