Vulgar comment
-
అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరు బలి
క్రైమ్: అమ్మాయి మీద వెకిలి జోకు వేసి.. తన స్నేహితుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. ఆ యువతి సదరు స్నేహితుడి బాగా తెలిసిన అమ్మాయి కావడమే గొడవ ముదిరి ఇంతటి ఘోరానికి కారణమైంది. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా నెగువాన్ తోడ్కా గ్రామంలో ఈ ఘటన జరిగింది. దశరథ్(20) అలియాస్ చోటు రోజూ 12వ తేదీ సాయంత్రం స్నేహితులతో కబుర్లు చెబుతూ ఉన్నాడు. ఆ సమయంలో దుర్గేష్ అనే స్నేహితుడి దగ్గర ఓ అమ్మాయి గురించి చెడుగా మాట్లాడుతూ జోకులేశాడు. అయితే ఆ యువతి దుర్గేష్‌కు ఫ్యామిలీ ఫ్రెండ్. దీంతో దుర్గేష్ పట్టరాని కోపంతో దశరథ్పై దాడి చేశాడు. పక్కనే ఉన్న స్నేహితులు దుర్గేష్‌ను లాక్కెల్లి.. ఆ గొడవను అప్పటికప్పుడు సర్దుమణిగేలా చేశారు. అయితే.. దుర్గేష్ కోపం అంతటితో చల్లారలేదు. ఇద్దరు స్నేహితుల్ని తీసుకుని మరోసారి దశరథ్ ఇంటి దగ్గరకు వెళ్లి మరీ దాడికి పాల్పడ్డాడు. దాడికి అడ్డుకోబోయిన దశరథ్ తండ్రి జ్ఞాన్‌శ్యామ్‌ను సైతం చితకబాదారు. తీవ్ర గాయాలతో తండ్రీ కొడుకులిద్దరూ ఆస్పత్రిలో చేరగా.. దశరథ్ ఆదివారం కన్నుమూశాడు. జ్ఞాన్ శ్యామ్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు దుర్గేష్ కోసం గాలింపు చేపట్టారు. -
అసభ్యంగా మాట్లాడి...కటకటాల పాలయ్యారు
నిర్భయ చట్టం కింద ఇరువురికి ఏడు నెలల జైలు విజయనగరం లీగల్: యువతిపై అసభ్యకర వ్యాఖ్య చేసిన ఇరువురు కటకటాల పాలయ్యారు. విజయనగరం జిల్లాలో నిర్భయ చట్టం కింద నమోదైన ఈకేసు తీర్పు శుక్రవారం వెలువడింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం...విజయనగరం పట్టణానికి చెందిన ఓ యువతి తనతల్లిదండ్రులతో గత ఏడాది జూలై 30న జ్యూయలరీ షాపునకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడున్న గొలగాన శ్రీను, వారాడ సతీష్‌లు ఆ యువతిని చూసి అసభ్యంగా వ్యాఖ్య చేశారు. ఆమె తల్లిదండ్రులు వారిని నిలదీయగా ఏమైపోయింది ఇప్పుడు అంటూ తగాదాకు దిగారు. దీంతో యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. విచారణ అనంతరం శ్రీను, సతీష్‌లకు ఏడు నెలల జైలుశిక్షతో పాటు చెరో వేయి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్జి కె.వి.రమణాజీరావు తీర్పు చెప్పారు. 2012లో ఢిల్లీలో జరిగిన సంఘటన తరువాత లైంగిక వేధింపులకు గురి చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు ‘పోక్సా’ (లైంగిక వేధింపుల నుంచి బాలబాలికలకు రక్షణ కల్పించే చట్టం) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఆ చట్టం ప్రకారమే జిల్లాలో తొలితీర్పు వెలువడింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పీపీ మల్లికార్జున్ వాధించారు. -
అమ్మాయిలకిది సేఫ్ సిటీ
'మీ సిటీలో మహిళల పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. ఈవ్‌టీజింగ్, అమ్మాయిల్ని అసభ్యంగా కామెంట్ చేయడం ఇక్కడ కనపడవు’ అంటూ ప్రశంసలు గుప్పించారు యువ ఫ్యాషన్ డిజైనర్ నిధి. ఢిల్లీకి చెందిన ఈమె నగరానికి వచ్చారు. బంజారాహిల్స్‌లోని అనహిత బొటిక్‌లో తన ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ తాజా కలెక్షన్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. నేను ఢిల్లీవాసినే అయినా హైదరాబాద్‌తో బాగా పరిచయం ఉంది. పన్నెండేళ్ల క్రితం నేను ఈ సిటీలోనే నిఫ్ట్‌లో డిజైనింగ్ కోర్సు చేశాను. అప్పుడు మాదాపూర్‌కి ఇప్పటి మాదాపూర్‌కి అసలు పోలికే లేదు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఆ రోడ్డు, వెదర్.. ఒహ్.. రియల్లీ బ్యూటీఫుల్. ఈ సిటీ గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిందేమిటంటే... ఇక్కడ ఈవ్‌టీజింగ్ చాలా తక్కువ. మా ఢిల్లీతో పోలిస్తే అసలు లేదనే చెప్పాలి. మహిళల పట్ల హైదరాబాదీలు చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. అది నాకు చాలా నచ్చిన అంశం. అందుకే అమ్మాయిలకి ఇది సేఫ్‌సిటీ. ఇక్కడి వారికి ఫ్యాషన్ స్పృహ ఎక్కువే. కలర్స్, ట్రెడిషనల్ వర్క్, హ్యాండ్లూమ్స్ను బాగా లైక్ చేస్తారిక్కడ. ఐదారేళ్లుగా మా లేబుల్‌కు ఈ సిటీలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘పేకాట’ ఫ్యాషన్... ఈసారి ఢిల్లీ విల్స్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించిన కలెక్షన్స్‌ను ఇక్కడికి తీసుకొచ్చాను. పరిణీతిచోప్రా, ఆలియాభట్, అదితిరావ్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ధరించి వాక్ చేసిన డిజైన్లు ఇందులో ఉన్నాయి. ప్లేయింగ్కార్డ్స్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని రూపొందించిన ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’, క్వీన్ ఆఫ్ హార్ట్స్ వంటి డిజైన్లను ఫ్యాషన్ లవర్స్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ర్యాంప్లుక్స్ని కోరుకునే వారికి స్పెషల్ ఇవి. - ఎస్బీ