అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరు బలి | MP Teenager Killed By Friend Over Bad Joke On Girl | Sakshi

అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరు బలి

Jan 17 2024 2:04 PM | Updated on Jan 17 2024 2:12 PM

MP Teenager Killed By Friend Over Bad Joke On Girl - Sakshi

అమ్మాయి మీద వెకిలి జోకు వేసి.. తన స్నేహితుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు.

క్రైమ్‌: అమ్మాయి మీద వెకిలి జోకు వేసి.. తన స్నేహితుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. ఆ యువతి సదరు స్నేహితుడి బాగా తెలిసిన అమ్మాయి కావడమే గొడవ ముదిరి ఇంతటి ఘోరానికి కారణమైంది. 

మధ్యప్రదేశ్‌ సాగర్‌ జిల్లా నెగువాన్‌ తోడ్కా గ్రామంలో ఈ ఘటన జరిగింది.  దశరథ్‌(20) అలియాస్‌ చోటు రోజూ 12వ తేదీ సాయంత్రం స్నేహితులతో కబుర్లు చెబుతూ ఉన్నాడు. ఆ సమయంలో దుర్గేష్‌ అనే స్నేహితుడి దగ్గర ఓ అమ్మాయి గురించి చెడుగా మాట్లాడుతూ జోకులేశాడు. అయితే ఆ యువతి దుర్గేష్‌కు ఫ్యామిలీ ఫ్రెండ్‌. దీంతో దుర్గేష్‌ పట్టరాని కోపంతో దశరథ్‌పై దాడి చేశాడు. పక్కనే ఉన్న స్నేహితులు దుర్గేష్‌ను లాక్కెల్లి.. ఆ గొడవను అప్పటికప్పుడు సర్దుమణిగేలా చేశారు. అయితే.. 

దుర్గేష్‌ కోపం అంతటితో చల్లారలేదు. ఇద్దరు స్నేహితుల్ని తీసుకుని మరోసారి దశరథ్‌ ఇంటి దగ్గరకు వెళ్లి మరీ దాడికి పాల్పడ్డాడు. దాడికి అడ్డుకోబోయిన దశరథ్‌ తండ్రి జ్ఞాన్‌శ్యామ్‌ను సైతం చితకబాదారు. తీవ్ర గాయాలతో తండ్రీ కొడుకులిద్దరూ ఆస్పత్రిలో చేరగా.. దశరథ్‌ ఆదివారం కన్నుమూశాడు. జ్ఞాన్‌ శ్యామ్‌ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు దుర్గేష్‌ కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement