vv lakshmi narayana
-
'గ్లాస్ గుచ్చుకుంది'..!
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకు గ్లాసు గుర్తు గట్టిగానే గుచ్చుకుంటోందట. ఇప్పటికే జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన ఓట్లనే చీల్చుతారని తెగ ఇదైపోతున్నారట. దీనికి గ్లాసు గుర్తు తోడు కావడంతో భయపడ్డ ఆయన, గ్లాస్ గుర్తు దక్కిన స్వతంత్ర అభ్యర్థి ఇంటికెళ్లి మరీ బతిమాలుకున్నారట.తను గెలిచాక అధిక మొత్తం ముట్టజెప్తానని హామీ ఇచ్చారట. అయి తే 2014లో ఆయన తీరు గుర్తుకొచ్చి తక్షణ బేరం మాట్లాడుకున్నారట. కాస్త ‘భారీ’స్థాయిలో బతిమాలుకున్నాకే ఆ అభ్యర్థి వెనక్కి తగ్గినట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి పరువు తప్ప, అధికారం మాత్రం దక్కదన్న నమ్మకానికొచ్చేశారట..!ఇవి చదవండి: 'పులుసు కారుతోంది'..! -
ఇది కూడా తెలియదా వీవీ అలియాస్ జేడీ..?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఔను... సరిగ్గా ఊహించిందే జరుగుతోంది. ఎన్నికల ముందే జనసేన విశాఖ అభ్యర్థి జేడీ అలియాస్ వీవీ లక్ష్మీనారాయణ ముసుగు ఒక్కొక్కటీ తొలగిపోతోంది. తానో మేథావిలా బిల్డప్ ఇస్తూ బాండ్ పేపర్ హామీలంటూ హడావుడి చేసిన జేడీ యవ్వారం చూసి న్యాయ నిపుణులు నవ్వుకుంటున్నారు. చట్ట ప్రకారం చెల్లని బాండ్ పేపర్లను తెరపైకి తీసుకువచ్చి ప్రేలాపనలు చేయడం ఒక్క జేడీకే చెల్లిందని విమర్శిస్తున్నారు. ఎంపీ అభ్యర్ధిగా తాను ఇచ్చే హామీలు ఇవేనంటూ కొన్నింటిని పేర్కొంటూ వంద రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా చీప్ పబ్లిసిటీ ఎపిసోడ్ అంటూ ఇప్పటికే మేథావులు, విద్యావంతులు తేలిగ్గా తీసిపారేయగా..., ఇప్పుడు న్యాయవాదులు జేడీ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపరు ఎందుకు ఉపయోగిస్తారు..? అన్న చిన్న విషయంపై ఒక మాజీ సీబీఐ అధికారికి పరిజ్ఞానం లేకపోవడం ఏమిటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. మేనిఫెస్టో అమలు చేసేది ఒక్క శాసనసభకు పోటీ చేసేవారికి తప్ప, ఒక ఎంపీ చేయాల్సిన అవసరం లేదన్నది జగమెరిగిన సత్యం. మేనిఫెస్టోకు సంబంధించి చాలా వరకు అంశాలు రాష్ట్ర నాయకత్వం పరిధిలోనే ఉంటుందనేది తెలియని విషయం కాదు.. అంతేగాని ఒక ఎంపీ.. రాష్ట్ర నాయకుడు కాదు, అతను మేనిఫెస్టోను అమలు పరిచేదీ లేదు. మేనిఫెస్టోలో ఉన్న అంశాల్ని రా>ష్ట్ర నాయకులు, రాష్ట్రాన్ని పాలించే వారికి మాత్రమే అమలు చేసే అధికారం ఉంటుందన్నది చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. ఒక ఎంపీ అభ్యర్థి మేనిఫెస్టోకి సంబంధించి ఎటువంటి ప్రసంగాలు, సలహాలు, ప్రభుత్వం పై ఒత్తిడి చేయడం చేయకూడదన్న విషయాన్ని ఒక ఐపీఎస్ అధికారిగా తెలియక పోవడం విడ్డూరంగా ఉంది. విశాఖపట్నం ఎంపీగా జనసేన తరుపున పొటీ చేస్తున్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ తాను అమలు చేసే పథకాలంటూ వంద రూపాయల నాన్ జ్యుడిషయల్ స్టాంప్ పేపర్‌పై తయారు చేసి చూపడం పట్ల పలు వర్గాల ప్రజలు, న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీనారాయణ బాండ్‌పేపర్‌లో జనసేన పేరులేని వైనం సుప్రీంకోర్టు ఏం చెప్పింది..? చాలా మంది పార్టీ సభ్యులతో సహా వ్యక్త పరిచే అభిప్రాయం ఏమిటంటే రాజకీయ పార్టీల మేనిఫెస్టో చట్టపరంగా అమలు చేయాల్సిన అవసరం లేదని మిథిలేష్ కుమార్ పాండే వెర్సస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ వ్యాజ్యం దాఖలు చేసిన ఫిర్యాది.. ఒకే ఒక ఆధారంపై.. అదీ ఎలక్షన్ మేనిఫెస్టో తప్ప మరొక సాక్షాన్ని ఫిర్యాదులోగాని, వాదనలలో గాని వినిపించలేదు. అసలు ఫిర్యాదు ఏమిటంటే.. మేనిఫెస్టోలో సంబంధిత పొలిటికల్ పార్టీకి పరిపూర్ణమైన మెజారిటీ రాని పక్షంలో వేరే ఏ ఇతర పార్టీల మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదనీ, మేనిఫెస్టోలో సూచించిన విధంగా ఆ పార్టీ ఎన్నికలకు ముందు ఏ పార్టీ మద్దతు తీసుకోకూడదు అన్నది వాజ్యం సారాంశం. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న వాఖ్యలు ఇలా ఉన్నాయి. ♦ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఏ రకమైనæ హామీలు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనే అధికారం కోర్టు పరిధిలో లేదు. ♦ 1982 ఆల్ ఇంగ్లండ్ లా జర్నల్ ప్రకారం బ్రూవేల్ లండన్ బరో కౌన్సిల్ వెర్సెస్ గ్రేటర్ లండన్ కౌన్సిల్ కేసులో లార్జ్ డెనింగ్ చెప్పిన విధంగా మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు ఓట్లు పొందడానికై విడుదల చేసిన మేనిఫెస్టోని ప్రధాన అజెండాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ♦ మేనిఫెస్టో ఒక బాండులా సంతకం చేసి, సీలు చేసి ఇచ్చినా సరే ఇది వరలో లేనివి చెప్పినా సరే, వాగ్దానాలు, గతంలో చేసిన ప్రస్తావనలు ఉన్నా అవేవీ పరిగణనలోకి రావు. ఓటర్లలో అతి తక్కువ మంది ఎన్నికల మేనిఫెస్టోలు చదువుతారు. ఎక్కువ మంది పత్రికలు, టీవీల ద్వారా వివరాలు తెలుసుకుంటారు. చాలా మందికి మేనిఫెస్టోలో విషయాలపై అవగాహన ఉండదు. ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెళ్లినప్పుడు మేనిఫెస్టోపై అవగాహన ఉండి ఓటు వేయరు. ఎక్కువ మంది పార్టీ పరంగానే ఓటు వేస్తారు. మేనిఫెస్టో వల్ల ఏమీ కాదన్న విషయంలో ఎలాంటి సందేహంలేదు. ♦ చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఫలానా పార్టీకి ఓటు వేస్తారు. ఏ ఒక్కరు కూడా అభిమానానికి వ్యతిరేకంగా ఓటు వేయరు. ఏ ఒక్క రాజకీయపార్టీ కూడా ఎలాంటి శాసనాధికారానికి కట్టుబడి ఉండవు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వారు ఏ ఒక్క ప్రస్తావన, వాగ్దానమైనా ఖచ్చితంగా అవసరాన్ని బట్టి స్వీకరించాలి. మేనిఫెస్టోలో ఉన్నవాటికి కట్టుబడివున్నామని కాకుండా పార్టీ వల్ల ఏమౌతుందో, పరిస్థితులను బట్టి చెయ్యాల్సి ఉంటుంది. అది ఆచరణ యోగ్యమై నిష్పక్ష పాతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవీ మార్గదర్శకాలు ♦ చట్టప్రకారం నాన్ జ్యుడీషల్ స్టాంప్ పేపర్ ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వాడాలి. ♦ ఏపీ స్టాంప్స్ యాక్ట్, ఇండియన్ స్టాంప్ యాక్ట్‌లోని క్లాజు ప్రకారం ఓటరుకి వారి హక్కుల సాధించుకునేందుకు మేనిఫెస్టోపై కోర్టుకు వెళ్లే హక్కులేదు. ♦ ఇప్పుడు నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ ఎలాంటి సందర్భాల్లో వినియోగిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ♦ చట్ట ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆర్ధిక ఒప్పందాలు, పరస్పర అవగాహన ఒప్పందాలు కోర్టులో చెల్లుబాటు అయ్యే విధంగా నాన్ జ్యుడీషియల్ స్టాంపులు పనిచేస్తాయి. ♦ ఇందులో వాది, ప్రతివాదులు, మేజర్ అవ్వని వారు, మానసికంగా పరిపక్వత లేనివారు, చట్టప్రకారంగా చెల్లుబాటు కానివారు, దివాలా తీసినవారు, మానసిక వికలాంగులు ఉన్నారు. ♦ ఆర్థిక పరమైన లావాదేవీలు, నిబంధనలు ఉన్నప్పుడు మాత్రమే నాన్‌జ్యుడీషియల్ స్టాంపు చెల్లుబాటు అవుతుంది. ♦ ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు పరస్పర అవగాహనతో ఒక పనిని చేయుటకుగాని, చేయకుండా ఉండేందుకు గాని, ఆర్థిక లావాదేవీలతో కూడిన ఆ లావాదేవీల విలువ రూపాయల్లో గాని, వాటిని సమానమైన గుణిజాలతో కూడినదై ఉండాలి. ♦ ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, చదువుకున్న ఎంపీ అభ్యర్ధులు చేస్తున్న విధానాలతో నాన్ జ్యుడీయల్ స్టాంపుపై ఉన్న అనర్హత పై చిక్కు ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీరిచ్చిన బాండ్లో రెండో పార్టీ ఎవరు.? ♦ రాజకీయ నాయకులు ఇచ్చే బాండ్ పేపర్‌పై రెండో పార్టీ ఎవరన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవరూ రెండో పార్టీ కాదు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా పూర్తిగా అపరిచితులైన వ్యక్తులతో కాంట్రాక్ట్‌లు చేసేవి, ఇందులో ఎవరితోనైతే అగ్రిమెంట్ చేసుకుంటున్నామో వారి చిరునామా వివరాలు లేకపోతే ఆ ఒప్పందం చెల్లదు. ♦ లావాదేవాలు నిమిత్తమై చెప్పిన ప్రతిఫలం ఈ కాంట్రాక్ట్‌లో ఎక్కడా ఉండదు. ♦ ఇలాంటి సందర్భంలో రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ విలువ ఎలా నిర్ణయిస్తారు.? ♦ దీనిని సుప్రీంకోర్టులో ఒక కేసు మిథిలేష్ కుమార్ పాండే వెర్సస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చెప్పిన విధంగా ఇలాంటి కాంట్రాక్టులు, మేనిఫెస్టోలు చెల్లనే చెల్లవు. ఆర్థిక లావాదేవీలకే బాండ్ పేపర్లు రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఏ రకమైనæ హామీలు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనే అధికారం కోర్టు పరిధిలో లేదు. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపరు ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు పరస్పర అవగాహనతో ఒక పనిని చేయుటకుగాని, చేయకుండా ఉండేందుకు గాని, ఆర్థిక లావాదేవీలతో కూడినదై ఉండి, ఆ లావాదేవీల విలువ రూపాయల్లో గాని, వాటిని సమానమైన గుణిజాలతో కూడినదై ఉండాలి. కానీ పార్టీలు మేనిఫెస్టోలు బాండ్ పేపర్ మీద చేయటం సరికాదు. మేనిఫెస్టో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆ పార్టీకి అనుగుణంగా మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల మేనిఫెస్టో చట్టపరంగా అమలు చేయాల్సిన అవసరం లేదని మిథిలేష్ కుమార్ పాండే వెర్సస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. – ఎన్.ఎస్.వి.రెడ్డి, సీనియర్ న్యాయవాది -
బాలయ్య చిన్నల్లుడిపై బాబు మార్కు పాలి‘ట్రిక్స్’
వీవీ లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ.. ఇది ఏ తాను ముక్కో అందరికీ తెలుసు.. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎవరి ప్రభావంతో.. ఎవరి ప్రయోజనాలకోసం పనిచేశారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి... ప్రత్యక్ష పోటీకి దిగడం కూడా అదే ‘వర్గ’ ప్రయోజనం కోసమేనని తేటతెల్లమవుతోంది. అదే సమయంలో ఆయన ఉన్నట్టుండీ జనసేన తరఫున విశాఖ ఎంపీ బరిలోకి దిగడం వెనుక ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేమిటో తెలియాలంటే బాలకృష్ణ అల్లుళ్ల పోరు వద్దకు వెళ్లాల్సిందే. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖపట్నం లోక్‌సభ సీటును బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనుమడు శ్రీ భరత్ మొదట్నుంచీ ఆశిస్తూ వచ్చారు. ఆర్నెల్లక్రితం మూర్తి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దరిమిలా భరత్.. గీతం చైర్మన్ బాధ్యతలతోపాటు రాజకీయ వారసత్వం కూడా ఆశించారు. ఆ మేరకు సీఎం చంద్రబాబు నుంచి ఎంపీ టికెట్ హామీ కూడా తీసుకుని కొన్నాళ్లుగా ప్రచారం సైతం మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు తనయుడు లోకేష్ భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి పోటీ చేయాలని భావించడంతో.. తన కుమారుడికి ఇబ్బంది అవుతుందని భావించిన చంద్రబాబు.. భరత్‌ను పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. ఇందుకు భరత్ అంగీకరించలేదు. తన మామ బాలకృష్ణ వైపు నుంచి చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాల్లో నారా లోకేష్ మంగళగిరికి తరలిపోగా.. భరత్‌కు విశాఖ ఎంపీ టికెట్ ఖరారు చేశారు. ఇవన్నీ పక్షం రోజులుగా అందరికీ తెలిసిన పరిణామాలే. విశాఖ నుంచి భరత్.. మంగళగిరి నుంచి లోకేష్.. మొత్తంగా బాలకృష్ణ అల్లుళ్ల టికెట్ కథ సుఖాంతమైనట్టేనని అందరూ భావించారు. కానీ సరిగ్గా అక్కడే చంద్రబాబు తన మాస్టర్ బ్రెయిన్‌కు పదునుపెట్టారు. తన మాట కాదని, తన కుమారుడిని జిల్లాలు దాటించి టికెట్ దక్కించుకున్న భరత్‌కు తన ’రాజకీయం’ ఎలా ఉంటుందో చవిచూపించాలనుకున్నారు. అంతే.. అప్పటివరకు భీమిలి నుంచి టీడీపీ తరఫున బరిలోకి దించాలని భావించిన జేడీ లక్ష్మీనారాయణను రాత్రికి రాత్రే జనసేనలోకి పంపారు. ఇటు టీడీపీ టికెట్‌ను భరత్‌కు ఖరారు చేసిన వెంటనే.. జనసేన నుంచి లక్ష్మీనారాయణ పేరును ఖరారు చేయించారు. జనసేన తరఫున అన్నిచోట్లా డమ్మీ అభ్యర్థులే.. భరత్‌పై మాత్రం లక్ష్మీనారాయణ వాస్తవానికి విశాఖ జిల్లాలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన.. టీడీపీ అభ్యర్థులపై నామమాత్రపు అభ్యర్థులను పోటీకి దించింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులపై ఏమాత్రం పోటీకి నిలవని అభ్యర్థులను దించుతోంది. అనకాపల్లి ఎంపీగా ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియని అభ్యర్థిని, అరకు లోక్‌సభ సీటుకు కూడా పోటీ చేయనని మొత్తుకుంటున్న అభ్యర్థిని బరిలోకి దిగాలని కోరుతోంది. కానీ విశాఖ లోక్‌సభకు వచ్చేసరికి ఏరికోరి లక్ష్మీనారాయణను బరిలోకి దించడం వెనుక చంద్రబాబు వ్యూహం దాగుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట్లో భరత్ కాకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావులను విశాఖ లోక్‌సభ అభ్యర్థులుగా టీడీపీ పరిశీలించిన సందర్భంలో మాత్రం పెద్దగా ఎవరికీ పరిచయం లేనివారి పేర్లను పరిశీలించిన జనసేన.. ఎప్పుడైతే టీడీపీ టికెట్ భరత్‌కు ఖరారైందో ఆ వెంటనే జేడీ లక్ష్మీనారాయణను అర్ధరాత్రి హడావుడిగా తీసుకొచ్చి ప్రకటించడం వెనుక చంద్రబాబు వ్యూహం దాగి ఉందని అంటున్నారు. కనీస పోటీలోలేకుండాచేసేందుకే.. విశాఖ లోక్‌సభ చరిత్ర తీస్తే టీడీపీ ముప్పై ఆరేళ్ల ప్రస్థానంలో కేవలం మూడుసార్లు మాత్రమే గెలుపొందింది. అప్పుడూ వివిధ రాజకీయ పార్టీల పొత్తుల నేపథ్యంతోనే తక్కువ ఓట్లతో బయటపడింది. విశాఖ లోక్‌సభ సీటు టీడీపీకి ఎప్పుడూ అనుకూల సీటు కాదని స్వయంగా ఆ పార్టీ నేతలే అంగీకరిస్తారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రమంతటా అనుకూల ప్రభావం ఉండడం, ఎంపీ సీట్లన్నింటినీ గెలుస్తుందని జాతీయ సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ దశలో విశాఖ సీటు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపనుందని తెలిసి కూడా భరత్‌ను కనీసంగా పోటీకి లేకుండా చేయాలనేది చంద్రబాబు తంత్రమని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. మరోసారి సీటు అడకుండా, లోకేష్‌తో ఏ విషయంలోనూ పోటీ లేకుండా చేయాలన్న ముందస్తు వ్యూహంతోనే భరత్‌కు వచ్చే టీడీపీ ఓట్లను గండి కొట్టడానికే టీడీపీ మనిషిగా ముద్రపడ్డ జేడీని జనసేన తరఫున రంగంలోకి దించారన్న అభిప్రాయాలు స్వయంగా ‘దేశం’ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. -
హోదాపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ
సాక్షి, గుంటూరు: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర మాజీ అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇందు కోసం తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేశారా? అన్న ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. అయితే అప్పటిలోగా తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నాక, తన ప్రణాళికను వెల్లడిస్తానన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే సంజీవనిగా భావించే ప్రత్యేక హోదా రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు. హోదా వస్తేనే కంపెనీలు ఇక్కడికి తరలివచ్చి రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఐపీఎస్ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. కర్లపాలెం మండలం యాజిలీలో అభయ ఫౌండేషన్ చైర్మన్ బాలచందర్, ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ ఇక్కుర్తి లక్ష్మి నరసింహాలు సంయుక్తంగా ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. లాభసాటి వ్యవసాయంపై రైతులతో ముఖాముఖీలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం ఓ మంచి కార్యక్రమం యాజిలీలో ప్రారంభించడం అదృష్టం. రైతుల కోసం ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ ప్రయత్నం అభినందనీయం. యాజిలీ లాంటి జెడ్పీ హైస్కూల్‌ను నేనెక్కడా చూడలేదు. తనకు సున్నా మార్కులు వస్తున్నా.. ప్రజలకు వంద మార్కులు తెచ్చేందుకు రైతన్న ప్రయత్నం చేస్తాడు. ఎన్ఆర్డీఎస్ సంస్థలో పని చేస్తానని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదు. వాళ్లను వేడుకోవడం కంటే ఉద్యోగం మానేస్తే నాకు నచ్చిన చోట పనిచేయవచ్చునని వీఆర్ఎస్ తీసుకున్నా. నేను రేపు వ్యవసాయశాఖ మంత్రి అయితే రైతులకు ఏం చేయాలో ఆలోచిస్తాను. మంత్రిని కాకపోతే సామాజిక కార్యకర్తగా పనిచేస్తా. రైతులకు 200 మార్కులు వచ్చేలా మేం కృషి చేస్తాం. ముందు మేం ఉంటాం. మా వెంట మీరు నడవండంటూ లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. -
అవినీతిరహిత సమాజం నిర్మిద్దాం
రాజానగరం, న్యూస్‌లైన్ : అవినీతిరహిత, సమసమాజ స్థాపనకు యువత నడుం బిగించాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు పిలుపునిచ్చారు. స్థానిక జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రిలోని ఆడిటోరియంలో ‘వైద్య వృత్తిలో నైతిక విలువలు-అవినీతి’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్డీవో వేణుగోపాలరెడ్డి అధ్యక్షత వహించారు. విజయబాబు మాట్లాడుతూ సమాజానికి మనం ఏవిధంగా సహాయపడుతున్నామనే ఆలోచన విద్యార్థి దశ నుంచే అలవరచుకోవాలన్నారు. విద్యార్థిగా ఎన్ని పతకాలు పొందామనేది ముఖ్యం కాదని, ఏమేరకు మానవీయ విలువలు కలిగి ఉన్నామనేది ముఖ్యమన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన రావాలని, అప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్నారు. నైతిక విలువలపై అవగాహన పెరగాలి విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరిలో నైతిక విలువలపై అవగాహన పెరగాలని, సేవా దృక్పథం అలవర్చుకోవాలని మరో ముఖ్యఅతిథి, ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. వైద్యునికి వాక్చాతుర ్యం, సహనం అవసరమన్నారు. ఎంసీఐ సభ్యుడు డాక్టర్ గన్ని భాస్కరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవీ శర్మ, సూపరింటెండెంట్ డాక్టర్ టి. సత్యనారాయణ, బెస్ట్ చైర్మన్ వైవీ నరసింహారావు, కో చైర్మన్ బీవీఎస్ భాస్కర్ పాల్గొన్నారు.