రాజానగరం, న్యూస్‌లైన్ : అవినీతిరహిత, సమసమాజ స్థాపనకు యువత నడుం బిగించాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు పిలుపునిచ్చారు. స్థానిక జీఎస్‌ఎల్ జనరల్ ఆస్పత్రిలోని ఆడిటోరియంలో ‘వైద్య వృత్తిలో నైతిక విలువలు-అవినీతి’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్డీవో వేణుగోపాలరెడ్డి అధ్యక్షత వహించారు. విజయబాబు మాట్లాడుతూ సమాజానికి మనం ఏవిధంగా సహాయపడుతున్నామనే ఆలోచన విద్యార్థి దశ నుంచే అలవరచుకోవాలన్నారు. విద్యార్థిగా ఎన్ని పతకాలు పొందామనేది ముఖ్యం కాదని, ఏమేరకు మానవీయ విలువలు కలిగి ఉన్నామనేది ముఖ్యమన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన రావాలని, అప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్నారు.
నైతిక విలువలపై అవగాహన పెరగాలి
విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరిలో నైతిక విలువలపై అవగాహన పెరగాలని, సేవా దృక్పథం అలవర్చుకోవాలని మరో ముఖ్యఅతిథి, ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. వైద్యునికి వాక్చాతుర ్యం, సహనం అవసరమన్నారు. ఎంసీఐ సభ్యుడు డాక్టర్ గన్ని భాస్కరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవీ శర్మ, సూపరింటెండెంట్ డాక్టర్ టి. సత్యనారాయణ, బెస్ట్ చైర్మన్ వైవీ నరసింహారావు, కో చైర్మన్ బీవీఎస్ భాస్కర్ పాల్గొన్నారు.
అవినీతిరహిత సమాజం నిర్మిద్దాం
Published Thu, Dec 19 2013 4:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement