raja nagaram
-
‘నన్నయ్య’ విద్యార్థినుల ఆకలి కేకలు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థినులు ఆకలి కేకలు జాతీయ రహదారిపై ప్రతిధ్వనించాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి సుమారు 650 మంది విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో గంటన్నరపాటు యూనివర్సిటీలోకి రాకపోకలు స్తంభించిపోయాయి.– రాజానగరం జీతాల కోసం ‘108’ ఆందోళనప్రభుత్వం 108 ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని చిత్తూరు జిల్లా పుంగనూరులో బుధవారం నిరసన తెలిపారు. పుంగనూరులోని ఏరియా ఆస్పత్రి వద్ద 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, మోకాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యోగేష్ మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు ఇవ్వాలని కోరారు. – పుంగనూరు -
కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్ తనయుడే రాజా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జక్కంపూడి కుటుంబం...ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. మరోవైపు జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడంపై కాపు సామాజిక వర్గనేతలు హర్షం వ్యక్తం చేశారు. -
దైవదర్శనానికి వెళ్తూ... మృత్యువాత
పాతపట్నం : తూర్పుగోదావరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు శ్రీకాకుళం జిల్లా వాసులు మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు రాజానగరం వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం చిన్నమల్లిపురం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు విజయవాడ కనకదుర్గ దర్శనానికి శుక్రవారం రాత్రి కారులో బయలుదేరారు. వారి వాహనం రాజానగరం సమీపంలో కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న అప్పలస్వామి(34), గడియ బొద్దు(55) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
‘నలుగురుండి ఏం చేస్తున్నారు’
రాజానగరం : అన్నదాన సత్రానికి ఆస్తులు అధికంగా ఉన్నా, ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణ మంటపం నిర్మిస్తామంటూ గ్రామంలోని శ్రీరాజాకాండ్రేగుల జోగిజగన్నాథరావు బహుదూర్ పంతులు అన్నదాన సత్రాన్ని నేలకూల్చిన ప్రాంతాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సత్రానికి ఉన్న ఆస్తులు, వస్తున్న ఆదాయాన్ని పరిశీలించారు. అధికారులపై మండిపడ్డారు. ఏడు గ్రామాల్లో 142 ఎకరాలు ఉంటే దానిలో సాగు భూమిగా ఉన్న 80 ఎకరాలకు రూ.ఎనిమిది లక్షల 20 వేలు మాత్రమే ఆదాయం రావడంపై ఆరా తీశారు. ‘నాలుగు ఎకరాలకు కనీసం రూ. లక్ష ఆదాయం రావలసిన తరుణంలో 80 ఎకరాలకు రూ.ఎనిమిది లక్షలా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. నలుగురు ఉద్యోగులు ఉండి ఏం లాభం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణం నిబంధనల మేరకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, పన్నుల వసూలుపై దృష్టిని సారించాలని సూచించారు. కూల్చి వే సిన సత్రం స్థల ంలో కల్యాణ మంటపాన్ని నిర్మించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉంటుందనే విషయమై చర్చించారు. రెండు అంతస్తులతో భవనాన్ని నిర్మించి, దిగువన కల్యాణాలకు, ఎగువ భోజన వసతులకు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్నారు. దాతలు ఇచ్చిన భూములను కూడా కాపాడలేని స్థితిలో ఉద్యోగులు ఉండడం విచారకరమంటూ ఆక్రమణలపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వే చేయించి, గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఉన్న ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ సూరిబాబు, అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు, ఈఈ సుబ్బారావు, ఆర్జేసీ అజాద్, స్థానిక ఉద్యోగులు ఉన్నారు. -
ఇవి ములక్కాడలు కాదండోయ్!
రాజానగరం, : ఆహా..... విరగకాశాయి ములక్కాడలు అనుకుంటున్నారు కదూ? నిజమే విరక్కాశాయి, కాని అవి ములక్కాడలు కాదు, వాటిలా భ్రమింపజేస్తున్న ఏడాకుల పాల (అలస్టోనియా స్కోలో రోసెస్) కాయలవి. ఆర్అండ్బి రోడ్లతోపాటు 16వ నంబరు జాతీయ రహదారి వెంబడి పలుచోట్ల ఉన్న ఈ చెట్లు ప్రస్తుతం విపరీతంగా కాయలు కాసి చూపరులను ‘ముల క్కాడలా?’ అనే భ్రమలో పడవేస్త్తున్నాయి. ఆకులు చూస్తే మామిడి ఆకుల మాదిరిగా ఉండే ఈ చెట్టును ఏడాకుల పాలగా పిలుస్తుంటారు. అంతేకాక మామిడి ఆకులను పోలి ఉండటంతో వీటి ఆకులను చాలామంది ఇళ్లకు తోరణాలుగా కూడా కడుతున్నారు. అయితే దీని శాస్త్రీయ నామం ‘అలస్టోనియా స్కోలో రోసెస్’గా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు దుర్గేష్ తెలిపారు. సాధారణంగా గ్రీష్మరుతువులో చెట్లన్నీ ఆకులు రాలుస్తుంటాయి. కాని ఈ చెట్టు మాత్రం ఆకుపచ్చదనంతో ఎవర్‌గ్రీన్‌గా ఉంటుందన్నారు. గుబురుగా పెరిగి మంచి నీడనిచ్చే విధంగా ఉంటాయి కాబట్టే ఈ చెట్లను ఎక్కువగా రోడ్ల పక్కన పెంచుతున్నారన్నారు. విద్యార్థులు ఉపయోగించే పలకల తయారీకి, కర్ర పెట్టెలు, బ్లాక్బోర్డ్సు తయారీకి దీని కలపను వాడుతుంటారు. -
అవినీతిరహిత సమాజం నిర్మిద్దాం
రాజానగరం, న్యూస్‌లైన్ : అవినీతిరహిత, సమసమాజ స్థాపనకు యువత నడుం బిగించాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు పిలుపునిచ్చారు. స్థానిక జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రిలోని ఆడిటోరియంలో ‘వైద్య వృత్తిలో నైతిక విలువలు-అవినీతి’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్డీవో వేణుగోపాలరెడ్డి అధ్యక్షత వహించారు. విజయబాబు మాట్లాడుతూ సమాజానికి మనం ఏవిధంగా సహాయపడుతున్నామనే ఆలోచన విద్యార్థి దశ నుంచే అలవరచుకోవాలన్నారు. విద్యార్థిగా ఎన్ని పతకాలు పొందామనేది ముఖ్యం కాదని, ఏమేరకు మానవీయ విలువలు కలిగి ఉన్నామనేది ముఖ్యమన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన రావాలని, అప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్నారు. నైతిక విలువలపై అవగాహన పెరగాలి విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరిలో నైతిక విలువలపై అవగాహన పెరగాలని, సేవా దృక్పథం అలవర్చుకోవాలని మరో ముఖ్యఅతిథి, ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. వైద్యునికి వాక్చాతుర ్యం, సహనం అవసరమన్నారు. ఎంసీఐ సభ్యుడు డాక్టర్ గన్ని భాస్కరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవీ శర్మ, సూపరింటెండెంట్ డాక్టర్ టి. సత్యనారాయణ, బెస్ట్ చైర్మన్ వైవీ నరసింహారావు, కో చైర్మన్ బీవీఎస్ భాస్కర్ పాల్గొన్నారు. -
బంగారం కోసమే హత్య!
తూర్పు గానుగూడెం (రాజానగరం), న్యూస్‌లైన్ : జాతీయ రహదారి పక్కనున్న తూర్పు గానుగూడెం వద్ద పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కాకినాడకు చెందిన డింగిరి రమేష్ (30)దిగా పోలీసులు గుర్తించారు. ‘గుర్తు తెలియని మృతదేహం లభ్యం’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన వార్తను చూసి ఇక్కడకు వచ్చిన మృతుని బంధువుల ద్వారా అతడి వివరాలు లభ్యమైనట్టు సీఐ ఏబీజీ తిలక్ తెలిపారు. రాజస్తాన్‌కు చెందిన రమేష్ కుటుంబం ఉపాధి కోసం కాకినాడలో ఉంటోంది. కాకినాడలోని రాజు జ్యుయలరీలో రమేష్ సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న జ్యుయలరీ నుంచి 1600 గ్రాముల బంగారాన్ని హాల్మార్క ముద్రణ కోసం రాజమండ్రికి తీసుకువె ళ్లాడు. ఆ రోజు నుంచి జ్యుయలరీకి కాని, ఇంటికి కాని అతడు తిరిగిరాలేదు. దీంతో కాకినాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో రమేష్ అదృశ్యంపై జ్యుయలరీ యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఇదే సమయంలో రాజానగరం మండలం తూర్పు గానుగూడెం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలుసుకుని అతడి బంధువులు శుక్రవారం ఇక్కడకు చేరుకున్నారు. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉన్న రమేష్ మృతదేహాన్ని వారు గుర్తించినట్టు సీఐ తెలిపారు. మృతుడి వద్ద బంగారం ఏమీ లేదని, దీని కోసమే దుండగులు అతడిని హతమార్చి, రోడ్డు పక్కన పడేసి ఉండవచ్చని పోలీసులుఅనుమానిస్తున్నారు. కన్నీటిపర్యంతమైన బంధువులు ఉపాధి కోసం సొంత ప్రాంతాన్ని వదిలి ఇక్కడ ఉంటున్నామని, ఎన్నడూ ఎవరితోను మాట పడలేదని, కుటుంబాన్ని పోషించే వ్యక్తిని ఇలా కుటుంబానికి దూరం చేస్తారనుకోలేదంటూ రమేష్ బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. స్థానిక పోలీసు స్టేషన్ వద్దకు 9 నెలల పాపతో వచ్చిన, గర్భిణి అయిన రమేష్ భార్య రోదన చూపరులను కంటతడి పెట్టించింది. అతడి వద్ద ఉన్న బంగారాన్ని కాజేసేందుకే రమేష్‌ను హతమార్చి ఉంటారని అతడి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.