VVIT
-
గుంటూరులో సందడి చేసిన హిట్-2 టీమ్ ( ఫొటోలు)
-
దిశా నిర్దేశం
-
గుంటూరు వీవీఐటీలో ‘గ్యాంగ్‌లీడర్’ సందడి
-
ఏపీలో తొలిసారిగా బాలోత్సవ్
నంబూరు (తెనాలి): ప్రపంచ బాలల పండుగ–2017 పేరుతో గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీవీఐటీ)లో ఆదివారం వేలాది పిల్లల కోలాహలం మధ్య బాలోత్సవ్ ప్రారంభమైంది. తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఏటా బాలోత్సవ్ జరుగుతుంది. తొలిసారిగా ఇప్పుడు నవ్యాంధ్రలో మొదలైంది. 610 పాఠశాలల నుంచి 10 వేల మంది విద్యార్థులు, వారి తలిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్న వేడుకను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎ.రాజేంద్రప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. చిన్నారులు, అతిథులు బెలూన్లు ఎగుర వేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ బాలోత్సవ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. -
చిన్నారుల సెమీ క్రిస్మస్
పెదకాకాని: మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీవా స్కూల్లో శనివారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. చిన్నారులు ఏసు జీవిత కథను తెలిపే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రకరకాల వేషధారణతో చిన్నారులు ఆకట్టుకున్నారు. తెనాలి అంబేడ్కర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జంగం సుధీర్, కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లిఖార్జునరెడ్డి, వీవా స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీటీ జోషి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
వీవీఐటీలో ‘గూగుల్ డెవలపర్స్ కోడ్ ల్యాబ్’
పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని ఏపీఎస్ఎస్డీసీ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్(సిఓఇ)లో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ గూగుల్ భారతదేశంలో తన మొట్టమొదటి గూగుల్ డెవలపర్స్ కోడ్ ల్యాబ్‌ను ప్రారంభించనుందని వి.వి.ఐ.టి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. గూగుల్‌కు చెందిన నిపుణులు కళాశాలకు శుక్రవారం విచ్చేసి ల్యాబ్ ప్రారంభానికి కళాశాలలో ఉన్న సదుపాయాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గూగుల్ మౌంటెన్‌వ్యూ, అమెరికాకు చెందిన క్లేర్ బేలే మాట్లాడుతూ ఎపిఎస్ఎస్డీసీ, వీవీఐటీ కళాశాలలతో సంయుక్తంగా గూగుల్ డెవలపర్స్ కోడ్ ల్యాబ్ ను ప్రారంభించనున్నామని తెలిపారు. పరిశోధన, అభివృద్ధిలో ఈ ల్యాబ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గూగుల్ భారతదేశ యువతలో మంచి నైపుణ్యం ఉందనే ఉద్దేశ్యంతోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇన్నోవేషన్ ల్యాబరేటరీలను ప్రారంభిస్తుందన్నారు. వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ గూగుల్, ఏపీఎస్ఎస్డీసీతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్వహించటం తమకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ సమావేశంలో గూగుల్ నిపుణుల బృందంలోని క్లేర్ బేలే, జేమ్స్ బాగ్మాన్ లతో పాటు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి చర్చించారు.