Waiting hall
-
48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూమ్!
న్యూఢిల్లీ: రైలు ఎక్కేందుకు ట్రాఫిక్ కారణంగా కాస్త ముందుగా వెళ్లాలనుకునే ప్రయాణికులు అక్కడ స్టేషన్లో విశ్రాంతి రూం సరిగా ఉండక ఎక్కడ బస చేయాలో తోచక ఇబ్బంది పడే ప్రయాణికుల కోసం ముంబై రైల్వే శాఖ సరికొత్త పాడ్ రూంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా మంది హోటల్‌కి వెళ్లి రూం అద్దెకు తీసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి వారి కోసం ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని మొదటి అంతస్తులో 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూంను అందుబాటులోకి తీసుకువచ్చింది. (చదవండి: అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ) అయితే వీటిలో క్లాసిక్ పాడ్లు, ప్రైవేట్ పాడ్లు "లేడీస్-ఓన్లీ" పాడ్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పాడ్లు వంటి గదులు ఉన్నాయి. దీన్ని క్యాప్సూల్ హోటల్‌గా పిలిచే ఈ పాడ్ హోటల్లో ఒక్కో మంచంతో కూడిన చిన్న గదులు ఉంటాయి. ఈ మోడల్ జపాన్‌లో ఉద్భవించింది. ఇది కేవలం రాత్రి బస చేయడానికి లేదా చిన్న వ్యాపార పర్యటనలో అలసటతో నిద్రపోవడానికి బయట హోటల్‌కి వెళ్లడానికి విముఖత చూపే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ కాంపాక్ట్ వసతి పరిష్కారాన్ని అందించింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూలో "స్నీక్ పీక్" అనే పేరుతో ఈ అత్యధునిక సరికొత్త విశ్రాంతి పాడ్ రూంలకు స్వాగతం అంటూ వాటికి సంబంధించిన వీడియోను ఒకటి సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. (చదవండి: బాప్రే! ఈ పేయింటింగ్ ధర రూ. 260 కోట్లా!!) Koo App Sneak Peek! Welcome to the new-age Pod retiring rooms by @RailMinIndia at Mumbai Central. View attached media content - Ashwini Vaishnaw (@ashwinivaishnaw) 17 Nov 2021 -
జపాన్ తరహా పాడ్ రూమ్స్ ఇప్పుడు భారత్‌లో..!
భారతీయ రైల్వేస్ ప్రయాణికులకు అద్బుతమైన, విలాసవంతమైన ప్రయాణాలను అందించడం కోసం రకరకాల సౌకర్యాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకుగాను పలు రైల్వే స్టేషన్లలో ఎన్నో వసతులను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడం కోసం పలు రైల్వే స్టేషన్లలో వెయింటింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఏసీ, నాన్ ఏసీ వంటి హాల్స్‌ను ప్రయాణికులకు రైల్వే శాఖ అందుబాటులో ఉంచుతుంది. తాజాగా ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం ఆధునాథన ‘పాడ్ రూమ్స్’ను భారతీయ రైల్వేస్ నిర్మించింది. రైల్వే, బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దాన్వే నవంబర్ 17న ప్రారంభించారు ముంబై సెంట్రల్ స్టేషన్‌లోని మొదటి అంతస్తులో ఈ అర్భన్ పాడ్ రూమ్ హోటల్‌ను నిర్మించింది. కాగా పాడ్ హోటల్స్‌కు సంబంధించిన ఫోటోలను రైల్వే మంత్రిత్వశాఖ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చదవండి: ఐరన్ మ్యాన్ కలను నిజం చేసిన ఆనంద్ మహీంద్రా పాడ్ హోటల్స్ అంటే..! పాడ్ హోటల్స్ జపాన్‌లో అత్యంత ప్రాచుర్యాన్ని పొందాయి. జపాన్‌లో వీటిని క్యాప్సూల్స్ హోటల్స్‌గా పిలుస్తుంటారు. ఈ హోటల్స్‌లో ప్రయాణికులకు హలీవుడ్ సినిమా రేంజ్ ఇంటీరియర్స్‌ను ఏర్పాటు చేశారు. పాడ్ హోటల్స్‌లో వ్యక్తిగత సేఫ్‌లను కూడా ప్రయాణికులు పొందవచ్చును. ఇందులో ప్రయాణికులు రాత్రివేళల్లో బస చేసే విధంగా గదులను ఏర్పాటు చేశారు. హోటల్ ప్రాంగణంలో ఉచిత వైఫై సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ హోటల్ గదులలో ఏసీ, టెలివిజన్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, రీడింగ్ లైట్స్ మరెన్నో సదుపాయాలను ఏర్పాటుచేశారు. ఛార్జీలు ఎంతంటే...! ఈ హోటల్లో బస చేసే ప్రయాణికులకు 12 గంటలకు రూ.999, 24 గంటలకు 1,999 ఛార్జీలను రైల్వే శాఖ వసూలు చేయనుంది. మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేక పాడ్లతో సహా 48 క్యాప్సూల్ లాంటి గదులను నిర్మించారు. Travelling by train on a short business trip or taking a group of students on a tour, POD rooms at Mumbai Central station are here to make your journey comfortable and easy. pic.twitter.com/7yfbSfeZ9g — Ministry of Railways (@RailMinIndia) November 17, 2021 pic.twitter.com/SMuAKQnQtr — Ministry of Railways (@RailMinIndia) November 17, 2021 చదవండి: రియల్మీ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు..! -
వెయిటింగ్ హాల్స్ ప్రారంభించిన ఎంపీ.
-
సాక్షి ఎఫెక్ట్ : తెరుచుకున్న వెయిటింగ్ హాల్
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రి వెయిటింగ్ హాల్ ఎట్టకేలకు తెరుచుకుంది. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించిన గంటకే వెయిటింగ్ హాల్‌కు సిబ్బంది తాళాలు వేశారు. తీవ్ర ఎండాల కారణంగా పేషెంట్ సహాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. సాక్షి కథనాలపై స్పందించిన అధికారులు తక్షణమే వెయిటింగ్ హాల్ తెరవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజల ఇబ్బందులపై అధికారుల్లో కదలిక తెప్పించిన సాక్షికు పేషెంట్ సహాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
- డీఆర్ఎం ప్రసాద్ - పిడుగురాళ్ళ రైల్వేస్టేషన్లో వసతులపై ఆరా పిడుగురాళ్ల: ఆదర్శ రైల్వేస్టేషన్ అయిన పిడుగురాళ్లలో ప్రయాణికులకు మెరగైన సౌకర్యాలను అందజేసేందుకు తగు చర్యలు చేపడతామని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక రైల్వేస్టేషన్‌కు అధికారుల బృందంతో వచ్చిన డీఆర్ఎం తొలుత రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలపై ఆరాతీశారు. స్టేషన్‌మాస్టర్ కె.వరకృపాకరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన బోరింగు పంపులను, వెయిటింగ్‌హాలు, సిబ్బంది క్వార్టర్లను పరిశీలించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తగుచర్యలు తీసుకోవాలని, పాడైన బోరింగు పంపులను, నీటి కుళాయిలను తక్షణమే బాగుచేయించాలని ఆదేశించారు. గాంధీనగర్‌వద్దనున్న మొండిగేటును డీఆర్ఎం పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పక్కనే జానపాడురోడ్డులో రైల్వే గేటు ఉన్నందున సమీపంలోని గాంధీనగర్ మొండిగేటుకు గేటు ఏర్పాటు సాధ్యం కాదని, అందుకే అక్కడ కాపలాకు ఉద్యోగిని నియమించామన్నారు. ఆ ఉద్యోగి సక్రమంగా విధులు నిర్వర్తించేవిధంగా అధికారులు పర్యవేక్షించాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం రైల్వేస్టేషన్ పరిసరాల్లో వివిధ సమస్యలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలపై డీఆర్ఎం ప్రసాద్ అసహనం వ్యక్తంచేశారు. డీఆర్ఎం వెంట ఏసీఎం అలీఖాన్, అధికారులు సతీష్, ఎంఎం ఖాన్ తదితరులు ఉన్నారు.