Wanajeevi Ramaiah
-
వనజీవి రామయ్యకు తుమ్మల పరామర్శ
హైదరాబాద్: బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్యను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మంగళవారం ఉదయం పరామర్శించారు. రామయ్యను పలుకరించిన తుమ్మల, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రామయ్య ఆరోగ్య పరిస్థితి వివరాలను తుమ్మల డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రభుత్వ పరంగా ఎంత ఖర్చయినా భరించి రామయ్యకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వనజీవి రామయ్యకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. -
వనజీవి రామయ్యకు తీవ్ర అస్వస్థత
► హైదరాబాద్ తరలించిన కుటుంబ సభ్యులు ఖమ్మం: ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య ఆదివారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబీకులు ఆయనను ఖమ్మం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొద్దికాలం క్రితం రామయ్యకు గుండెనొప్పి రావడంతో స్టంట్ వేశారు. మళ్లీ గుండెనొప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. కాగా.. స్టంట్ వేసిన సమయంలోనే బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయినప్పటకీ ఆయన మొక్కలు నాటడం మాత్రం మానుకోలేదు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం సాక్షి, హైదరాబాద్: దరిపెల్లి రాములుకు పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అత్యుత్తమ వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. -
మహారాష్ట్ర పాఠ్యాంశాల్లోకి వనజీవి రామయ్య?
ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జీవిత చరిత్రను మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కోటి మొక్కలు నాటి పద్మశ్రీ పొందిన రామయ్య కృషిని గుర్తించిన మహారాష్ట్ర సర్కారు తెలుగు సబ్జెక్ట్లో ఒక పాఠంగా పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. రామయ్య సమాజానికి, ప్రజలకు మొక్కలు నాటడం ద్వారా చేసిన సేవలను పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు వివరించాలని నిర్ణయించి నట్లు తెలిసింది. మంగళవారం మహారాష్ట్రకు చెందిన ఓ అధికారి రామయ్యకు ఫోన్ చేసి ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పినట్టు సమాచారం.