వనజీవి రామయ‍్యకు తుమ‍్మల పరామర‍్శ | provide better medicine for vanazivi ramayya cm kcr | Sakshi
Sakshi News home page

వనజీవి రామయ‍్యకు తుమ‍్మల పరామర‍్శ

Published Tue, Jun 13 2017 2:08 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

provide better medicine for vanazivi ramayya cm kcr

హైదరాబాద్: బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్యను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మంగళవారం ఉదయం పరామర్శించారు. రామయ్యను పలుకరించిన తుమ్మల, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రామయ్య ఆరోగ్య పరిస్థితి వివరాలను తుమ్మల డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
 
అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రభుత్వ పరంగా ఎంత ఖర్చయినా భరించి రామయ్యకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వనజీవి రామయ్యకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement