wanky srinivas
-
నేచురల్ క్యూర్
చికిత్సకంటే... అది చేసే విధానంతోనే సగం జబ్బు నయమవుతుంది. అలాంటి సహజమైన చికిత్సకి పేరుమోసింది నగరంలోని నేచర్ క్యూర్ ఆస్పత్రి. రోజూవారీ ఒత్తిళ్లకు దూరంగా పచ్చని వాతావరణంలో రోగులకు సహజమైన వైద్యం. రకరకాల జబ్బులతో ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించాలనుకుంది ఆస్పత్రి యాజమాన్యం. సిబ్బంది, రోగుల్లో నూతనోత్తేజం నింపేందుకు ప్రముఖ చిత్రకారుడు, రచయిత బ్నింతో కలిసి ఆస్పత్రి ‘కళాకదంబం టాలెంట్ షో’ నిర్వహించింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమం అందరిలో ఉత్సాహాన్ని నింపింది. అనువైన వాతావరణం... ‘నేచర్ క్యూర్ ఆస్పత్రి నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. మా అమ్మమ్మ, మేనత్త, చిన్నమ్మలు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అప్పుడు నా పాఠశాల కాగానే నేరుగా ఇక్కడకు వచ్చి ప్లే గ్రౌండ్లో ఆడుకునేదాన్ని. నా ఫీల్డ్‌లో ఎంతో మంది అధిక బరువున్నవాళ్లను చూశాను. తగ్గించుకునేందుకు వాళ్లు పడే కష్టాలు చూశాను. కానీ ఈ ఆస్పత్రిలో ప్రకృతి చికిత్స దొరుకుతుంది. హెల్దీగా ఉండడానికి అనువైన వాతావరణంతో పాటు అవసరమైన చికిత్స విధానాలున్నాయి. ఇక్కడిలాగే నేనూ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాన’ంటున్నారు సినీనటి, యాంకర్ ఝాన్సీ. కళాకదంబం అందరిలో ఉన్న మానసిక ఒత్తిడి, ఆందోళనను దూరం చేయగలిగిందన్నారు. మైమరిపించిన భరణి పాటలు తనికెళ్ల భరణి. పరిచయం అక్కర్లేని పేరు. మంచి నటునిగా, రచయితగా పేరున్న ఆయన మంచి గాయకుడు కూడా. ‘కళాకదంబం’లో ఆయన పాడిన ‘ఆటకదరా శివా’, ‘ఈ జన్మకింతేరా మల్లన్నా’, ‘ఎంత గొప్పవాడివయ్యా శివా’వంటి స్వీయగీతాలు అందరినీ పరవశంలో ముంచెత్తాయి. భరణి పాడుతుంటే ఆస్పత్రి సిబ్బంది, రోగులు పాటలో లీనమైపోయారు. పాటకు కోరస్ కలిపారు. శివ తన్మయత్వంలో ఓలలాడారు. ‘ప్రకృతి చికిత్సాలయం ప్రశాంత ఆశ్రమంలా ఉందని.. బయట తినే చిరుతిళ్ల నుంచి మనం మోసుకొచ్చే రోగాలకు ఇక్కడ విముక్తి లభించడం ఆనందంగా ఉందని’ అన్నారు భరణి. ఆకట్టుకున్న మ్యాజిక్ మిమిక్రీ ఆర్టిస్టు కస్తూరి ఫణిమాదవ్ తన మ్యాజిక్‌తో అదరగొట్టాడు. జడ రిబ్బన్లు బయటకు తీయడం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమ కలిగించేలా చేసిన డైమండ్ కార్డు షో ఆకట్టుకుంది. అంతేకాదు వెంట్రిలాక్ విజమ్ (మాట్లాడే బొమ్మ)తో తమాషా చేయించాడు. నటీమణులు ఇషా, సంధ్య స్పెషల్ స్కిట్స్ ఆకట్టుకున్నాయి. బరువున్నా ఇరగదీశాడు అతడి వయస్సు 17 ఏళ్లే. బరువు మాత్రం 120 కేజీలు. అయితేనేం సెలబ్రిటీలకు తానేమి తక్కువ కాదని కుర్రాడు వీర సమీర్ సాహు డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఒక్కసాహునే కాదు... అక్కడ ఉన్నవారంతా కాసేపు తమకున్న అనారోగ్య సమస్యలను పక్కనబెట్టి పాటలకు స్టెప్పలేశారు. - వాంకె శ్రీనివాస్ -
బాల్ మిత్రులు
వారిద్దరూ బాల్యమిత్రులే కాదు, ‘బాల్’ మిత్రులు కూడా. ఇద్దరిదీ నిరుపేద నేపథ్యమే. బడిలో కలసి చదువుకున్నారు. ఆటలాడుకున్నారు. కష్టసుఖాలు పంచుకున్నారు. ఎదిగే వయసులో ఫుట్‌బాల్‌ను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఏకంగా ‘ఫిఫా’ స్లమ్ సాకర్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో చోటు సాధించారు. తారిఖ్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆయన మరణంతో అక్క, అన్నలతో కలసి టోలిచౌకిలోని అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాడు. తమ్ముడు, చెల్లి .. పాతబస్తీలోనే అమ్మ జహెరబాను బేగం వద్దే ఉంటున్నారు. ఆమె టైలరింగ్ చేస్తూ బతుకుబండిని నెట్టుకొస్తోంది. అమ్మమ్మ ఇంటి వద్ద ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు తారిఖ్ చదువు ఇబ్బందిగానే సాగింది. అమ్మమ్మ ఇళ్లలో పనులు చేసి సంపాదించేది. ఆమె సంపాదనతోనే తారిఖ్ చదువు ముందుకు సాగింది. ఇక సిమర్‌ప్రీత్ తండ్రి స్కూటర్ స్పేర్పార్ట్స దుకాణంలో ఉద్యోగి. చాలీచాలని సంపాదన. ఆర్థికంగా ఎలాంటి ఆసరా లేకున్నా సిమర్‌ప్రీత్.. స్కాలర్‌షిప్‌తో చదువు కొనసాగించాడు. తారిఖ్, సిమర్‌లు ఆరో తరగతి నుంచే మిత్రులు. ఇంటర్ చదువుతుండగా, మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స కోచింగ్ ఫౌండేషన్ సహకారంతో ‘అవేక్’ ఫౌండేషన్ మురికివాడల్లోని విద్యార్థులతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడించారు. వారిలో తారిఖ్, సిమర్‌లు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. వారి ఆటకు ఫిదా అయిన కోచ్ మహమ్మద్ సలేద్.. వారికి శిక్షణ ఇచ్చారు. కళాశాల కాగానే మైదానానికి... తారిఖ్ షాదాన్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సిమర్‌ప్రీత్ ఏవీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల కాగానే ‘బాల్’మిత్రులిద్దరూ నేరుగా మైదానానికి చేరుకుంటారు. మూడు నాలుగు గంటలు ఏకదీక్షతో సాధన చేస్తారు. వీరిద్దరూ మిడ్‌ఫీల్డర్లే! ఇటీవల నాగపూర్‌లో జరిగిన ఆలిండియా స్లమ్ సాకర్ టోర్నీలో స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ జట్టును రన్నరప్‌గా నిలపడంలో తారిఖ్, సిమర్‌లు కీలక పాత్ర పోషించారు. తమ ఆటతీరుతో అక్టోబర్‌లో చిలీలో నిర్వహించనున్న ‘ఫిఫా’ స్లమ్ సాకర్ టోర్నీకి ఎంపికయ్యారు. - వాంకె శ్రీనివాస్ -
మదర్స్ సెయిలింగ్
అమ్మ ఎప్పుడూ అద్భుతం. అంతుపట్టని పజిల్. లోకం అంతా తన చుట్టూనే తిరుగుతున్నా తను మాత్రం పిల్లలే లోకంగా బతుకుతుంది. పిల్లల కోసం ఇష్టాలు, అభిరుచులు, చివరకు కెరీర్ కూడా వదులకుంటుంది. ఈ ఇద్దరమ్మలు అందరికన్నా భిన్నం. చిన్నప్పుడు బిడ్డలకు ఆట బొమ్మలైన వారు... ఇప్పుడు వాళ్ల కోసమే ఆటలు నేర్చుకుంటున్నారు. సెయిలింగే తమ లైఫ్ అనుకున్న పిల్లల కోసం లైఫ్ జాకెట్స్ ధరించారు. సాహసంతో ఏటికి ఎదురీదుతున్నారు. హుస్సేన్‌సాగర్‌లో జరిగిన సెయిలింగ్ పోటీల్లో తమ పిల్లలతో పాటూ పాల్గొన్న జినా, నిపా అషర్ల అమ్మ మనసు వారి మాటల్లోనే... - వాంకె శ్రీనివాస్ ‘మేం కొంపల్లిలో ఉంటాం. పాప జుహీ, వాటర్ స్పోర్ట్స్ తనిష్క్ దేశాయ్‌కి వాటర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. అందుకే మూడేళ్ల నుంచి సెయిలింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాం. వారి శిక్షణ కోసం ప్రతి శని, ఆదివారాలు హుస్సేన్సాగర్కి తీసుకొచ్చేవాళ్లం. అప్పుడు కోచ్ ‘మీరూ నేర్చుకోండి’ అన్నారు. ఆ క్లబ్లో జుహీ ఒక్కతే అమ్మాయి కావడంతో, తనకూ ధైర్యంగా ఉంటుంది, కష్టనష్టాలేంటో తెలిసినట్టుగా ఉంటుందని భావించి నేనూ సెయిలింగ్ ప్రాక్టీసు చేశా. ఈ సమయంలో ఆటలంటే అంతా వింతగా చూస్తారు. కానీ నా భర్త నితిన్ దేశాయ్ మాత్రం ఫుల్ సపోర్ట్ చేశారు. అలా 2012, 2013, ప్రస్తుతం మాన్సూన్ రెగెట్టాలో ఫ్యామిలీ ఈవెంట్లో పాల్గొన్నా. అయితే గత పోటీల్లో వయసు సరిపోక జుహీ పార్టిసిపేట్ చేయులేదు. ఈసారి తనతోపాటు నేనూ పోటీ పడ్డా. ఇదో అద్భుతమైన అనుభూతి నాకు. సెరుులర్గా వూరతానని ఎన్నడూ ఊహించలేదు. ఇక బాబు 15 ఏళ్ల తనిష్క్ కూడా సెరుులింగ్లో తన విన్యాసాలతో అబ్బురపరుస్తున్నాడు. పిల్లలిద్దరూ సికింద్రాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. భవిష్యత్‌లో వీరిని వరల్డ్ చాంపియన్లుగా చూడాలన్నది నా ఆశ’ అంటూ ఆనందంగా చెప్పారు జినా. జినాలాగే తన పిల్లలకోసం సెయిలర్‌గా మారిన మరో తల్లి... ముంబైకి చెందిన నిపాఅషర్. ‘మా పాప అనియా ముంబైలోని ఏవీఎన్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. తనకు సెయిలింగ్‌పై ఆసక్తి ఎక్కువ. అంత చిన్నవయసులో ఒంటరిగా పంపించడమా అని భయమేసింది. నా భర్త మహుల్అషర్ కూడా సెయిలర్. అయినా పాప కోసం నేనూ సెయిలింగ్ నేర్చుకున్నా. ప్రస్తుతం పదేళ్లు ఉన్న అనియా హుస్సేన్‌సాగర్‌లో జరిగిన మాన్సూన్ రెగెట్టాలో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. వుంచి సెరుులర్ అవుతుందనే నవ్ముకం ఉంది’ అని ధీవూ వ్యక్తం చేశారు అషర్. -
భాగ్ పాండే భాగ్
విధివంచితుణ్ని అనుకుంటూ బాధపడుతూ కూర్చోలేదు.. మనీష్ పాండే. అంతులేని ఆత్మవిశ్వాసంతో పరుగు పోటీల్లో రాణిస్తున్నాడు. విశేషాలు అతని మాటల్లోనే... నా సొంతూరు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్. అక్కడే పుట్టి పెరిగాను. చదువుకున్నదీ అక్కడే. వూ నాన్న జేఎస్ పాండే ఆదిత్య బిర్లా ఉద్యోగి. అవ్ము ఊర్మిళ పాండే గృహిణి. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేశా. కళాశాల స్థాయికి వచ్చేసరికి వివిధ టోర్నీల్లో పాల్గొని విజయాలు సాధించాను. చివరకు నేషనల్ లాంగ్ జంపర్‌గా ఎదిగా. అయితే 2011 ఏప్రిల్ 2న ఊహించని ప్రమాదం ఎదురైంది. తోపులాటలో కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయూను. కుడి కాలు చచ్చుబడింది. లక్ష్యం వూర్చుకున్నా.. కాస్త కోలుకున్న తర్వాత లక్ష్యాన్ని వూర్చుకున్నా. 2012లో బెంగళూరులో జరిగిన పారా ఒలింపిక్స్ ట్రయల్ రన్లో 100 మీటర్లు, 200 మీటర్లలో పరుగెత్తా. అక్కడ నా ప్రతిభను గుర్తించిన ఓ వ్యక్తి బ్లేడ్ ప్రొటెస్టిక్ వాడితే పారా ఒలింపిక్స్‌లో రాణించొచ్చన్నాడు. రూ. 4 లక్షల విలువచేసే ఆ బ్లేడ్ కొనుగోలు చేసే స్తోవుత లేక నిరాశకు గురయ్యాను. ఆదుకున్న హైదరాబాద్.. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని దక్షిణ రిహాబిలిటేషన్ సెంటర్ డెరైక్టర్ మోహన్ గాంధీ బ్లేడ్‌తో పాటు ఈవెంట్లో పాల్గొనేందుకు పూర్తి ఖర్చును భరిస్తానని హామీనిచ్చారు. అంతే.. ఇక ఆగలేదు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీసు చేయుడం మొదలెట్టా. సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటూ పూర్తిగా పారా ఒలింపిక్స్‌పైనే దృష్టి కేంద్రీకరించా. కోచ్ లేకున్నా యూ ట్యూబ్ ద్వారా ప్రముఖ అథ్లెట్లు హుస్సేన్ బోల్ట్, జానీ పికాక్ ప్రాక్టీస్ తీరును చూసేయుడం.. నా శైలిలో సాధన చేయుడడం అలవాటు చేసుకున్నా. గత నెలలో ట్యునీషియాలో జరిగిన ఐపీసీ అథ్లెటిక్ గ్రాండ్ పిక్స్‌లో ఏపీ తరఫున బ్లేడ్ రన్నర్‌గా పాల్గొన్నా. 100 మీటర్ల విభాగంలో 0.2 సెకన్ల తేడాతో బంగారు పతకం చేజారింది. కాంస్యంతో సరిపెట్టుకున్నా. 200 మీటర్ల విభాగంలో రజతం సాధించా. వీటితో పాటు ఆసియా పారా ఒలింపిక్స్‌కు కూడా అర్హత పొందాను. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా అదృష్టం. అయితే ప్రభుత్వం తరఫున సహాయం లభిస్తే మరింత రాణించేందుకు అవకాశముంటుంది. - వాంకె శ్రీనివాస్