War exercise
-
వణుకు పుట్టిస్తున్న ఇరాన్ ప్రకటన.. ఇజ్రాయెల్, అమెరికా ప్లానేంటి?
టెల్ అవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ప్రపంచ దేశాలు మరో మారణహోమం చూడాల్సిందేనా? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు ఇరాన్ ఉరకలేస్తోంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడులు చేసే అవకాశముందని అమెరికా నిఘా వర్గాలు సైతం హెచ్చరించడం తీవ్ర కలకలం సృష్టించింది. యుద్ధ ప్రకటన కారణంగా ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్‌పై విరుచుకుపడేందుకు ఇరాన్ సిద్ధమైందన్నట్టు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా తాము ఇరాన్ చేయబోయే ఎలాంటి దాడినైనా ఎదుర్కొవడానికి రెడీ అయినట్టు ప్రకటించింది. మరోవైపు.. ఇరాన్ దాడులు చేస్తుందన్న కారణంగా ఇజ్రాయెల్‌కు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇరాన్‌ను ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం స్పందించారు. బైడెన్ మాట్లాడుతూ..‘మేము అనుకున్న సమయం కంటే ముందే ఇరాన్ దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మేము ఇజ్రాయెల్ రక్షణకు సిద్ధంగా ఉన్నాము. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తోంది. ఇజ్రాయెల్‌ను రక్షించడంలో మా వంతు పాత్ర పోషిస్తాము. ఈ యుద్ధంలో ఇరాన్ విజయం సాధించబోదు’ అని అన్నారు. మరోవైపు, టెల్ అవీవ్ చేరుకున్న అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ ఎరిక్ కొరిల్లా ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఆ దేశ రక్షణ మంత్రి యోయావ్ గాలాంట్‌తో కలిసి హెట్జోర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. "ఇజ్రాయెల్, అమెరికాలను ఓడించగలమని మా శత్రువులు భావిస్తున్నారు. కానీ జరిగేది అందుకు వ్యతిరేకం. వారు మమ్మల్ని మరింత దగ్గరకు చేరుస్తున్నారు. మా బంధాన్ని బలోపేతం చేస్తున్నారని" తెలిపారు. The City of ballistic missiles in #IRAN . 🔻 pic.twitter.com/pIMgDjOaV3 — 🇵🇸ليلى (@Lailafatimeh) April 13, 2024 చెతులెత్తేసిన అరబ్ దేశాలు.. ఇజ్రాయెల్‌కు అండగా ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే తాము సహకరించబోమని కొన్ని అరబ్ దేశాలు పేర్కొంటున్నాయి. ఖతార్, కువైట్ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇరాన్‌పై దాడికి తమ దేశ గగనతలాన్ని గానీ.. స్థావరాలను గానీ.. అమెరికా వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వబోమని స్పష్టంచేశాయి. సౌదీ అరేబియా సహా మిగతా అరబ్ దేశాలూ అదే బాట పట్టే అవకాశం ఉంది. దీంతో, ఇరాన్‌పై అమెరికా దాడులు ఎలా చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ ఒకటోతేదీన ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఏడుగురు అధికారుల మరణమే ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. యుద్ధవాతావరణం నెలకొనడంతో ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్‌కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు హెచ్చరికలు జారీచేశాయి. ఉద్రిక్తతను మరింత పెంచొద్దని ఇరాన్‌కు నచ్చజెప్పాలని టర్కీ, చైనా, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్లో కోరారు. #Iran is Ready. All #Iranian nation is ready. It's a matter of time now. When and where? Stay tuned. pic.twitter.com/IiMR9jqwIy — Nasir Gulzar (@nasirgulzar020) April 13, 2024 ఇజ్రాయెల్, ఇరాన్‌లకు వెళ్లకండి: భారత సర్కార్ ఆదేశం తాము చెప్పే వరకూ ఇజ్రాయెల్, ఇరాన్‌లకు ప్రయాణాల పెట్టుకోవద్దని పౌరులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం అడ్వైజరీని విడుదలచేసింది. ఇప్పటికే ఆ దేశాల్లో ఉంటే భారతీయ ఎంబసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. నిర్మాణరంగంలో కార్మికులుగా భారత్ నుంచి ఇకపై ఎవరినీ ఇజ్రాయెల్‌కు పంపబోమని భారత్ స్పష్టం చేసింది. -
అగ్రరాజ్యం ఆంక్షలకు చెక్‌పెట్టేలా... రష్యా యుద్ధ విన్యాసాలు
మాస్కో: ఉక్రెయిన్ పై దురాక్రమణ యుద్ధానికి దిగినందుకు అమెరికా రష్యాని ఒంటరి చేసేలా ఆర్థిక ఆంక్షలు విధించింది. దీంతో ఆగ్రహంతో ఉన్న రష్యా ఆ చర్యలన్ని తిప్పికొట్టే ఎత్తుగడను తెరపైకి తీసుకువచ్చి మరీ అమలు చేస్తోంది. అమెరికా ఎత్తు పారనీయకుండా రష్యా అట్టహాసంగా యుద్ధ విన్యాసాలకు సిద్ధమైంది. అందుకోసం భారత్, చైనాలను రష్యాకు తీసుకువచ్చింది. ఈ మేరకు తూర్పు తీర ప్రాంతాల తోపాటు జపాన్ సముద్ర జలాల్లో గురువారం వోస్టాక్-2022 యుద్ధవిన్యాసాలను ప్రారంభించనుంద. వారం రోజుల పాటు ఈ విన్యాసాలను నిర్వహించనున్నారు. ఈ సైనిక కసరత్తుల్లో సుమారు 50 వేలకు పైగా బలగాలు, దాదాపు 140కి పైగా యుద్ధ విమానాలు, 60 యుద్ధనౌకలతో సహా దాదాపు 5 వేల సైనిక సామాగ్రిని వినియోగించనున్నారు. ఈ సాధారణ సైనిక కసరత్తులు రష్యా నేతృత్వంలోని మాజీ సోవియట్ దేశాలకు చెందిన సభ్యదేశాల భాస్వాములను ఒక చోటకు చేరుస్తాయి. ఈ ఆర్మి డ్రిల్‌లో పాల్గొనేందుకు న్యూఢిల్లీ సుమారు 75 మందితో కూడిన చిన్న సైనిక బృందాన్ని పంపుతోంది. ఈ బృందంలో గుర్ఖా దళాలు, నౌకదళం, వైమానికి దళం నుంచి ప్రతినిధులు ఉన్నారు. అయినప్పటికీ భారత్ నావికా లేదా వైమానిక సామాగ్రిని రష్యాకు పంపడం లేదు. భారత్‌కి చైనా, పాకిస్తాన్లతో ఉన్క సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధాల కోసం రష్యా పై ఆధారపడటంతో గతంలో రష్యాలో ఈ సైనిక విన్యాసాలకు హాజరైంది. ఎప్పుడైతే ఉక్రెయిన్ యుద్ధ విషయంలో రష్యా అనుసరిస్తున్న తీరుతో కాస్త దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా భారత్ రష్యాతో సంయుక్తంగా ఉత్పత్తి చేసే హెలికాప్టర్ల ఎత్తుగడను సైతం విరమించుకుంది. అలాగే మరో 30 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికను సైతం నిలిపేసింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ విషయమై రష్యాను విమర్శించడానికి ముందుకు రాలేదు చైనా. సుదీర్ఘ యుద్ధ కారణంగా యూఎస్, పశ్చిమ దేశాలు రష్యాపై మరోసారి ఆంక్షల మోత మోగించే అవకాశం ఉన్నందున చైనా రష్యాకు మద్దతు ఇచ్చిన సాంకేతికత, సైనిక సామాగ్రిని అందజేసింది. ఐతే మాస్కో మాత్రం చైనా పాత్రను రష్యాకు మద్దతుగా పరిగణించలేమని రష్యా సైనికుడు వాసిలీ కాషిన్ అన్నారు. దీన్ని తాము మిలటరీ సంబంధాలుగానే కొనాసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ వోస్టాక్ 2022 యుద్ధ విన్యాసాల్లో మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశాలైన కజకిస్తాన్, కిర్గిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, తజకిస్తాన్, సిరియా, అల్జీరియా, మంగోలియా, లావోస్, నికార్గావ్ తోపాటు రష్యా మిత్రదేశమైన బెలారస్ కూడా పాల్గొంటుంది. (చదవండి: రష్యా సుమారు 50 వేల బలగాలతో సైనిక విన్యాసాలు... టెన్షన్లో యూఎస్) -
ఒక అర్ధరాత్రి పిలుపు
సైనికుడికి యుద్ధ సమయం కీలకం. కానీ సైన్యంలోని వైద్యుడికి శాంతిసమయం కూడా కీలకమే. యుద్ధం లేనప్పుడు సైనికులు వార్ ఎక్సర్సైజ్ చేస్తారు. అందులో గాయపడిన వారికి వైద్యం చేయాలి, ఎప్పుడు పిలుపు వచ్చినా హాజరు కావడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి పిలుపు ఒక పేదగ్రామీణుడి నుంచి వస్తే! దానికి స్పందించిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ డాక్టర్ అశోక్ అనుభవం ఈవారం... మొదట్లో నన్ను విసుక్కున్న సర్జన్ కూడా ‘ఇక నుంచి మీరిచ్చిన ధైర్యంతో సిజేరియన్ ఆపరేషన్లు కూడా చేస్తాను’ అన్నారు. మాది కృష్ణాజిల్లా రేమల్లె. నేను ఆర్మీలో చేరిన నాటికి కశ్మీర్ ప్రశాంతమైన ప్రదేశం. 1990 తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. నేను పూంచ్ సెక్టార్లో పని చేసిన రోజుల్లో ప్రతిరోజూ ఒక ఉగ్రదాడి జరిగేది. మేమున్న ప్రదేశం జమ్మూ నగరానికి దాదాపు 250 కిలోమీటర్లుంటుంది. సెలవు రోజుల్లో జమ్మూ నగరానికి వెళ్లాలంటే సరైన రోడ్డు ఉండేది కాదు. ఘాట్‌రోడ్డులో ఏ నిమిషమైనా, ఎక్కడైనా మందుపాతర పేలవచ్చు. వాటికి వెరవకుండా ఉద్యోగం చేయడమే ప్రధానం. సైనికులకు వైద్యం చేయడం నా విధి. స్థానికులకు వైద్యం చేయడం విధి కాదుగానీ ఆసక్తి ఉంటే చేయొచ్చు. నేను వృత్తిరీత్యా ఎనెస్థిటిస్టునే అయినా ఎంతోమంది బిడ్డల్ని డెలివర్ చేశాను, ప్రాణాపాయంలో ఉన్న వారికి అత్యవసర చికిత్స అందించాను. కార్గిల్ సమయంలో... నా ఆర్మీ జీవితంలో కార్గిల్ వార్ మరిచిపోలేనిది. పాకిస్తాన్ వాళ్లు మనదేశంలో బంకర్లు కట్టేసి దాడులు చేశారు. కాల్పులు బయటి నుంచి కాదు, మన ప్రదేశం నుంచే జరుగుతున్నాయి. బంకర్లలో ఉండే శత్రుసైనికులకు ఆహారం వెళ్లే దారులన్నీ మూసేయడంతో పదిహేడు రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే నాకు సంతోషాన్నిచ్చిన సంఘటన అక్కడి ఓ కుగ్రామంలో జరిగింది. అది 2000 డిసెంబర్. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో స్థానికులు ఒక మహిళను మంచం మీద తెచ్చారు. ఆమె ప్రసవ నొప్పులు పడుతోంది. బిడ్డ అడ్డం తిరిగింది. వెంటనే సిజేరియన్ చేస్తే తప్ప తల్లీబిడ్డా బతకరు. నేను తక్షణమే సర్జన్‌కు ఫోన్ చేశాను. ఆయన కేసు తీసుకోవడానికి సుముఖంగా లేరు. ఆర్మీ డాక్టర్ చేతిలో ప్రాణం పోతే విచారణ జరుగుతుంది. పైగా ఆమె ముస్లిం మహిళ. ఈ ఆపరేషన్ ఫెయిలయితే తీవ్రవాదులు ఆ డాక్టర్ని టార్గెట్ చేయొచ్చు. ఆ భయంతో ‘నేను గైనకాలజిస్టును కాదు’ అని తప్పించుకోజూశారు. కళ్లల్లో కృతజ్ఞతలు ఏం చేయాలి? నాపై అధికారికి ఫోన్ చేశాను. ‘అధికారిగా ఏమీ చెప్పలేను. మీ రిస్కు మీద చేస్తానంటే నాకే అభ్యంతరం లేదు’ అన్నారు. నేను మళ్లీ సర్జన్‌కు ఫోన్ చేసి ‘మీ పై అధికారిగా ఆదేశిస్తున్నాను, వెంటనే రావాలి’ అన్నాను. ‘నాకు సిజేరియన్ ప్రొసీజర్ తెలియదంటే అర్థం చేసుకోరేం’ అన్నారు. ‘ఎన్నో సిజేరియన్ కేసులు దగ్గరగా చూశాను. ప్రతి స్టెప్ నేను చెప్తాను, మీరు చేయండి’ అన్నాను. అలా ఆపరేషన్ మొదలెట్టి, బిడ్డను క్షేమంగా బయటికి తీశాం. గర్భిణి తల్లితోనే నర్సు పనులు చేయించాం. బిడ్డకు వేయడానికి వ్యాక్సిన్ కూడా లేదు. అర్ధరాత్రి కదా, ఉదయాన్నే 90 కిలోమీటర్ల దూరంనుంచి టీకా తెప్పించి వేశాం. ఆ గ్రామస్థుల్లో వ్యక్తమైన కృతజ్ఞత అంతా ఇంతా కాదు. ఆగ్రామ ముఖియా పళ్లెం నిండా ఆక్రోటులు, బాదంకాయలతో వచ్చి ‘మీ సహాయానికి కృతజ్ఞతలు. మీకెంతో ఇవ్వాలని ఉంది. కానీ మా దగ్గరున్నవి ఇవి మాత్రమే’ అన్నారు. అప్పటి నుంచి ఆ గ్రామస్థులు మమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టారు. వాళ్లెవరూ భారత సైన్యాన్ని సొంతవారిగా భావించేవారు కాదు. నేను డాక్టర్‌గా చేసింది తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడ్డమే. కానీ ఆర్మీ వ్యక్తిగా అది దేశమాత రక్షణను పటిష్టం చేయడం! రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి