warangal bi-elections
-
కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ నామినేషన్
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా బుధవారం కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ నామినేషన్ వేశారు. అంతకముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక అయినా సిరిసిల్ల రాజయ్య పోటీ నుంచి తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో సర్వేను అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అధిష్టానం ఆదేశాలతో సర్వే వరంగల్ ఉప ఎన్నిక బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నారు. అయితే రాజయ్యను ఎంపిక చేయకముందే ఆయన వరంగల్ స్థానాన్ని ఆశించారు. ఊహించని పరిణామాలతో చివరికి ఆయనకే టిక్కెట్ దక్కింది. నామినేషన్ వేసేందుకు సర్వే బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి హుటాహుటిన వరంగల్ కు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. -
రేపు నల్లా సూర్యప్రకాశ్ నామినేషన్
వరంగల్: వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా కాజీపేట నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, బిశ్వా రవీందర్, శ్యామ్‌సుందర్ రెడ్డి, గున్నా నాగిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు. -
రేపు నామినేషన్ వేయనున్న రాజయ్య
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్న కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీపాం ఇచ్చారు. దాంతో సోమవారం రాజయ్య నామినేషన్ వేయనున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీల అమల్లో విఫలమైందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ రంగం కుదేలైందని మండిపడ్డారు. వందలాంది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఉత్తమ్ చెప్పారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కాంగ్రెస్ మాట నిలుపుకుంటే.. ఎన్నికల హామీలు అమలు చేయకుండా టీఆర్ఎస్ మాట తప్పిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఒకే ధపాలో రుణమాఫీ జరిగితే.. తెలంగాణ ప్రభుత్వం వాయిదాల పర్వం కొనసాగిస్తోందని రాజయ్య విమర్శించారు. -
'వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం'
హైదరాబాద్/వరంగల్: వరంగల్ జిల్లాలో జరుగనున్న ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి కోతలు లేని కరెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. అధికార దాహంతోనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కడియం విమర్శించారు.