'వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం'
హైదరాబాద్/వరంగల్: వరంగల్ జిల్లాలో జరుగనున్న ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వ్యవసాయానికి కోతలు లేని కరెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. అధికార దాహంతోనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కడియం విమర్శించారు.