Warangal Collectorate
-
Photo Story: ‘వరంగల్’.. జిగేల్
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయమిది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం దీనిని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విద్యుద్దీపాలతో శనివారం ఇలా సర్వాంగ సుందరంగా అలంకరించగా.. ఆ అందాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యమిది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ అర్బన్ కాడెద్దులకు సాగు శిక్షణ మహాముత్తారం: వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం దుక్కులు దున్నే ఎద్దులు కనుమరుగవుతున్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికీ భూములు దున్నేందుకు కాడెద్దులపైనే ఆధారపడుతున్నారు. అందుకోసం ఒక వయస్సుకు వచ్చిన ఎద్దులకు గిర్ర కట్టి శిక్షణ ఇస్తారు. తర్వాత బరువులను లాగడం, పొలాలు, చేన్లు దున్నే సమయంతో పాటు బండి కట్టినప్పుడు చెప్పినట్లుగా నడుచుకునేలా వాటికి మరికొన్ని రోజులు బండిపై తర్ఫీదు నిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగంపల్లి అటవీ ప్రాంతంలో ఓ రైతు కాడెద్దులకు గిర్ర కట్టి శిక్షణ ఇచ్చే దృశ్యాలు ‘సాక్షి’కెమెరాకు చిక్కాయి. నిండుకుండలా పార్వతీ బ్యారేజీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కన్నెపల్లి లక్ష్మి, అన్నారం సరస్వతీ పంప్‌హౌస్‌ల నుంచి నీటిని విడుదల చేయడంతో పెద్దపల్లి జిల్లా మంథని మండలం సుందిళ్లలోని పార్వతీ బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. పార్వతీ పంప్‌హౌస్ నుంచి ఐదు మోటార్ల ద్వారా శనివారం ఒక టీఎంసీ నీటిని పార్వతీ బ్యారేజీలోకి డెలివరీ సిస్టర్న్ ద్వారా ఎత్తిపోశారు. దీంతో ఈ బ్యారేజీ జలకళను సంతరించుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి చదవండి: 25న డిస్కవరీలో ‘కాళేశ్వరం’పై డాక్యుమెంటరీ -
రక్తదానం మరొకరికి ప్రాణదానం
వరంగల్ రూరల్: అన్ని దానాల్లో కంటే రక్తదానం గొప్పదని, మరొకరికి ప్రాణదానమని కలెక్టర్ ముండ్రాతి హరిత అన్నారు. సోమవారం రూరల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ వరంగల్ రెడ్ క్రాస్‌లో చికిత్స పొందుతున్న తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం కొరత తీవ్రంగా ఉందని, జిల్లాలోని ఉద్యోగులతో ఒక రోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తే బాగుంటుందని రెడ్ క్రాస్ వారి అభ్యర్థన మేరకు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. సోమవారం ఉదయం 8గంటల నుంచే ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్య లో హాజరై రక్తదానం ఇవ్వడం ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రావుల మహేందర్‌రెడ్డి, డీఆర్డీఓ సంపత్‌రావు, రెడ్‌క్రాస్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, వరంగల్ ఆర్డీఓ సీహెచ్.మహేందర్ జీ, పరకాల ఆర్డీఓ ఎల్.కిషన్, జిల్లా పంచాయతీ అ«ధికారి నారాయణరావు, జిల్లా ఉద్యాన వనశాఖ అధికారి శ్రీనివాసరావు, టీఎన్జీఓల సంఘం రూరల్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హరిప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ ముండ్రాతి హరిత స్వయంగా రక్తదానం చేసి ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఉపాధి హమీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలు, గ్రామీణ అభివృద్ధి శాఖ సిబ్బంది రక్తదానం చేశారు. డయేరియాపై విస్తృత ప్రచారం చేయాలి డయేరియా పట్ల విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ ముండ్రాతి హరిత తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని చాంబర్లో ఐసీడీఎఫ్ జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల వైద్య, ఆరోగ్య సిబ్బంది, సంబంధిత శాఖలు గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. డయేరియా తగలకుండా నియంత్రించడానికి జూన్ 10 నుంచి 22వ తేదీ వరకు విస్తృత ప్రచారం చేయాలని, దీని కోసం కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న వాటర్ ట్యాంకులను 15 రోజులకు ఒకసారి శుభ్రపరచాలని, క్లోరినేషన్ చేసిన తాగునీటిను ప్రజలకు అందించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ హరిత సూచించారు.అనంతరం రాష్ట్రీయ బాలస్వస్థ కార్యక్రమ అమలుతీరును అధికారులతో కలెక్టర్ హరిత సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ శ్యామ నీరజ, డాక్టర్ మహేంద్రన్, డీఈఈఎంఓ డాక్టర్ స్వరూపరాణి, అహల్య తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి వైపు అడుగులు..
సాక్షి, వరంగల్ రూరల్: అభివృద్ధి వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తాం.. దేశ సాగునీటి రంగానికే దిక్సూచిలా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి.. మొదటి దశలోనే జిల్లా సస్యశ్యామలం కాబోతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణం సందర్భంగా రూరల్ జిల్లా వేడుకలను ఆదివారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపి మూడు పంటలకు నీరందిస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, సకాలంలో విత్తనాలు, ఎరువుల పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాలతో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుందని తెలిపారు. సంపూర్ణ వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన వరంగల్ రూరల్‌లోని రైతాంగానికి ఖరీఫ్‌లో 10,428 క్వింటాళ్ల విత్తనాలను రబీలో 9,490 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను రాయితీపై సరఫరా చేశామని పేర్కొన్నారు. రైతు బంధు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 1లక్ష 49 వేల మంది రైతులకు రూ.240 కోట్లను గత సంవత్సరం అందించామని, ఈ సంవత్సరం నుంచి ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామని తెలిపారు. రైతులు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలు వీధిన పడకుండా వారిని ఆర్థికంగా అదుకునేందుకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా చేస్తుందని చెప్పారు. రైతు బీమా పథకంలో భాగంగా జిల్లాలో 241 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.12.05 కోట్లను చెల్లించామని వివరించారు. పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అన్నిరకాల పెన్షన్లను రూ.1000 నుంచి రూ.2016లకు, వికలాంగులకు ఇచ్చే రూ.1500లను రూ.3016లకు పెంచినట్లు చెప్పారు. ఈ నెల నుంచే పెంచిన పెన్షన్లు ఇస్తామన్నారు. తండాలు గ్రామ పంచాయతీలుగా.. గిరిజన ప్రజల కలలను సాకారం చేస్తూ మిగిలిన ప్రాంతాలతో ధీటుగా తండాలు, గూడెలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జిల్లాలో 132 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 401కి చేరిందని తెలిపారు. వీటికి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 30.45 కోట్లు కేటాయించి వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఇంటింటికీ తాగు నీరు.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలనే సంకల్పంలో భాగంగా జిల్లాలోని 16 మండలాల్లోని 776 అవాసాలకు తాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ తెలంగాణకు హరిహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి రాష్ట్రంలోని అటవీ సంపదను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లాలో 2018–19 హరితహారం కార్యక్రమం కింద 1 కోటి 12 లక్షల మొక్కలను నాటడం జరిగిందని, 16 కిలోమీటర్ల మేర రోడ్ల వెంబడి ప్లాంటేషన్ చేశామన్నారు. ఏ గ్రామానికి అవసరమైన మొక్కలను అదే గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి పెంచి ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 401 గ్రామ పంచాయతీల్లో 411 నర్సరీలను ఏర్పాటు చేసి 2 కోట్ల 54 లక్షల మొక్కలను పెంచుతున్నామని తెలిపారు. ఆడబిడ్డలకు అండగా.. ఆడబిడ్డలకు అండగా ఉండాలని, వారి పెళ్లి చేయడానికి ఏ ఒక్క నిరుపేద కుటుంబం కూడా అప్పులు చేయకుండా వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3707 మంది లబ్ధిదారులకు, షాదీముబారక్ ద్వారా 144 కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాన్ని అందించామని స్పష్టం చేశారు. మెరుగైన వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్, సిటీస్కాన్, ఎమ్మారై, డిజిటల్ రేడియాలజీ, టుడీ లాంటి అత్యాధునిక పరికరాలను ప్రభ్వుం మంజూరు చేసిందన్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా జిల్లాలో 1.10 లక్షల మంది బాలబాలికలకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వేగంగా టెక్స్టైల్ పార్కు పనులు దేశం గర్వించదగ్గ మెగా టెక్స్టైల్ పార్క్ రూరల్ జిల్లాలో ఉండడం గర్వకారణమని ఆయన అన్నారు. 1200 ఎకరాలలో రూ.11 వేల కోట్ల పెట్టుబడితో పార్కు పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. అన్ని రకాల వస్త్రాల తయారి, మార్కెటింగ్, ఎగుమతులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 224 పరిశ్రమలు ఇప్పటికే అనుమతి పొందాయని, టీ–ప్రైడ్ కింద 249 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు క్యాబ్, గూడ్స్ వాహనాలకు పెట్టుబడి రాయితీ కింద రూ.652 లక్షల మంజూరు చేయడం జరిగిందన్నారు. గొర్రెల పంపిణీ వ్యవసాయంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. దీనిలో భాగంగా యాదవ, గొల్ల, కురుమ కుటుంబాలకు 75 శాతం సబ్సిడీతో 12909 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. పాడి రైతుల ఆర్థిక ప్రగతి చెందాలని జిల్లాలో ఇప్పటి వరకు 217 ఎస్సీ, 240 ఎస్టీ, 640 ఇతర వర్గాల కుటుంబాలకు పాడి పశువులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గర్బిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలోని 908 అంగన్వాడీ కేంద్రాల్లో 7 నెలలు నుంచి 3 సంవత్సరాలు గల 15,349 మంది పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు, 3 నుంచి 6 సంవత్సరాలు గల 8,874 మంది పిల్లలకు ఒకపూట భోజనంతో పాటు ఉడికంచిన గుడ్లు, స్నాక్స్ ఇస్తున్నామని చెప్పారు. 7614 మంది గర్భిణులు, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒకపూట భోజనం, 200 మిల్లీ గ్రాములు పాలు, ఉడికించిన గుడ్లను ప్రతి రోజు ఇస్తున్నామన్నామని తెలిపారు. దివ్యాంగులను వివాహం చేసుకున్న 39 మందికి వివాహ ప్రోత్సాహం కింద రూ.50 వేల చొప్పున రూ.19.50 లక్షలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. 17 మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూ.24.60 లక్షల ప్రభుత్వ సబ్సిడీ అందించడం జరిగిందన్నారు. అనంతరం పలువురికి ప్రశంస పత్రాలు అందించారు. 7646 మందికి కేసీఆర్ కిట్లు.. మహిళలు, శిశువుల ఆరోగ్యం, వారి భద్రత కోసం ప్రారంభించిన కేసీఆర్ కిట్ గర్భిణులకు వరంగా మారిందని, దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. గర్భిణులుగా నమోదు చేసుకున్న నాటి నుంచి నాలుగు విడతల్లో ఆడశిశువు అయితే రూ13 వేలు, మగ శిశువు అయితే రూ12 వేలు నేరుగా ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో నవజాత శిశువులకు, బాలింతలకు అవసరమయ్యే 16 రకాల వస్తువులతో కూడిన 7646 కేసీఆర్ కిట్లను ఇప్పటి వరకు అందించామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి జబ్బులతో బాధపడకూడదని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. 52709 మందికి కళ్లద్దాలు, 25817 మంది ప్రిస్కిప్షన్ గ్లాసులు అందజేయడం జరిగిందన్నారు. 14 మందికి 10/10 మార్కులు 2019 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 14 మంది విద్యార్థులు 10 జీపీఏ, 60 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. 16 మండల్లాలోని 684 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 38274 మంది విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వివరించారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి కస్తూర్భా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. పట్టణ, వీధి బాలల కోసం నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పాఠశాలలో 65 మంది విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్.. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించేందుకు ఇప్పటి వరకు రూ.12.96 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకంలో భాగంగా 15897 సర్వీసులు విద్యుదీకరించబడ్డాయని, 101 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల విద్యుత్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. 32.04లక్షల ఉపాధి పని దినాలు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని 1, 29496 మంది కూలీలకు 32.04 లక్షల పని దినాలు కల్పించి రూ.46.33 కోట్లను వేతనంగా చెల్లించడం జరిగిందని చెప్పారు. గత సంవత్సరం ఉపాధి హామీ పథకం అమలులో అత్యుత్తమ ఫలితాలు సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా అవార్డు, రాష్ట్ర స్థాయిలో హరితమిత్ర అవార్డు, రాష్ట్ర ఎక్సలెన్సీ అవార్డు పాందడం జరిగిందని వివరించారు. 3.17లక్షల ఎకరాలకు పట్టాల పంపిణీ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం కోసం భూ రికార్డులను ప్రక్షాళన చేశామని, రికార్డుల నిర్వాహణ పారదర్శకంగా, సరళంగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలో 3 లక్షల 17 వేల 852 ఎకరాలను చేసి ఇప్పటి వరకు 1లక్ష 64 వేల 648 మంది రైతులకు పట్టా పాసుబుక్కులు ఇచ్చామన్నారు. -
రెండో విడతకు రెడీ
హన్మకొండ: జిల్లా, మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈమేరకు సిబ్బందికి పోలింగ్ సామగ్రిని గురువారం అందించనున్నారు. ధర్మసాగర్, వేలేరు మండలాల ఉద్యోగులకు ధర్మసాగర్‌లోని జూనియర్ కాలేజీలో, ఐనవోలు మండల ఉద్యోగులకు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లోని ఈవీఎం గోదాంలో సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 7.30 గంటల నుంచి పోలింగ్ సిబ్బంది రిపోర్టు, సామగ్రి పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. ఇక 10వ తేదీన శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. 3 జెడ్పీటీసీ స్థానాలు, 34 ఎంపీటీసీ స్థానాలు వరంగల్ అర్బన్ జిల్లాలోని మూడు జెడ్పీటీసీ స్థానాలు, 34 ఎంపీటీసీ స్థానాలకు రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు ఇప్పటికే పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ దఫాలో 86,465 మంది ఓటర్లకు గాను 184 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కాగా, మూడు జెడ్పీటీసీ స్థానాలకు 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ధర్మసాగర్ జెడ్పీటీసీ స్థానానికి ఆరుగురు, వేలేరు జెడ్పీటీసీ స్థానానికి నలుగురు, ఐనవోలు జెడ్పీటీసీ స్థానానికి ఐదుగురు పోటీ పడుతున్నారు. ఇక మూడు మండలాల్లోని 34 ఎంపీటీసీ స్థానాలకు గాను 98 మంది బరిలో ఉన్నారు. ఇందులో ఐనవోలు మండలం నుంచి ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవి కాకుండా ధర్మసాగర్ మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు 41 మంది, వేలేరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు 21 మంది, ఐనవోలు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు 36 మంది పోటీలో ఉన్నారు. సామగ్రి పంపిణీ.. పోలింగ్ పర్యవేక్షణ పోలింగ్ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా సాగేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మేరకు వీరు పోలింగ్ సామాగ్రి పంపిణీతో పాటు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు. ధర్మసాగర్ మండలానికి ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్ గణేశ్, ఐనవోలుకు డీఆర్డీఓ రాము, వేలేరుకు మెప్మా పీడీ కృష్ణవేణి ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు జెడ్పీ, మండల ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుండగా ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. డప్పుచప్పుళ్ల మద్య అభ్యర్థులు, పార్టీ అగ్రనాయకులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రచార రథాలు, మైకులతో గ్రామాల వీధులు హోరెత్తాయి. జెడ్పీ, మండల ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వ్యూహా, ప్రతివ్యూహాలతో ముందుకు సాగారు. పోలింగ్ సమీపించడంతో ప్రధానంగా ఎంపీటీసీ అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకుంనేందుకు మద్యం, డబ్బు, ఇతరత్రా తాయిలాలను ఎర వేస్తున్నారని సమాచారం అందుతోంది. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఐనవోలు: ఐనవోలు మండలంలో శుక్రవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎంపీడీఓ నాగపురి స్వరూప తెలిపారు. హన్మకొండలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీయగా ఆమె వివరించారు. శుక్రవారం జరగనున్న రెండో విడత ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా ఐనవోలు మండలంలోని 66 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించడానికి 180 మంది పీఓ, ఏపీఓలు 180తో పాటు ఇతర సిబ్బంది 300 మం దిని నియమించినట్లు ఎంపీడీఓ కలెక్టర్‌కు వివరించారు. అలాగే, ఒక్క ఏసీపీ, ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 18 మంది ఏఎస్సై, హెచ్‌సీలు, 32 మంది హోంగార్డులు, 8 మంది ఏఆర్‌లు, 34 మంది కానిస్టేబుళ్లతో పాటు 12 మంది మహిళా పోలీసులు విధుల్లో పాల్గొంటారని ఎస్సై నర్సింహరావు తెలిపారు. -
కలెక్టరేట్లో బతుకమ్మ సందడి
వరంగల్ రూరల్: కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబురాలను మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముండ్రాతి హరిత బతుకమ్మ తీసుకొచ్చి సంబురాలను ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. కలెక్టర్ హరిత ‘నిర్మల.. ఓ నిర్మల’ పాటకు కోలాటంలో పాల్గొన్నారు. డీఆర్డీఏ, సెర్ప్, ఎన్ఆర్ఈజీఎస్, జిల్లా సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ విభాగాల ఆధ్వర్యంలో బతుకమ్మలను ప్రదర్శించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణారెడ్డి మహిళా ఉద్యోగులను ఉత్సాహపరుస్తూ నృత్యాలు చేసి అలరించారు. జేసీ రావుల మహేందర్‌రెడ్డి, డీఆర్వో భూక్యా హరిసింగ్, పరకాల ఆర్డీఓ ఎల్.కిషన్, డీటీఓ శ్రీనివాసకుమార్, డీపీఆర్వో బండి పల్లవి, డీఈఓ కె.నారాయణ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ హరిప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు సయ్యద్ హసన్, మురళీధర్ రెడ్డి, టీజీఏ జిల్లా నాయకులు జగన్ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రథమ బహుమతిని డీఆర్డీఏ, ద్వితీయ బహుమతి ఐసీడీఎస్, తృతీయ బహుమతి కలెక్టరేట్ ఉద్యోగులు పేర్చిన బతుకమ్మ గెల్చుకున్నాయి. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉద్యోగినులకు కలెక్టర్ హరిత జ్ఞాపికలు అందజేశారు. -
మాక్ పోలింగ్
సాక్షి, వరంగల్ రూరల్: రాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యింది.. జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఓ వైపు కొందరు అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుండగా.. మరికొందరు అశావహులు టికెట్ల వేటలో ఉన్నారు. జిల్లా అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముండ్రాతి హరిత నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఓటరు ముసాయిదాను ప్రకటించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు ఇప్పటికే ఈవీఎంలు, వీవీ ప్యాట్లు చేరుకున్నాయి. ఏనుమామూల మార్కెట్లోని గోదాంలో వాటిని భద్రపరిచారు. వాటికి ఇప్పటికే టెస్టింగ్ సైతం చేపట్టారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తొలిసారిగా వీవీ ప్యాట్లు ఈసారి తొలిసారిగా వీవీ ప్యాట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈవీఎంలకు వీవీ ప్యాట్లను అనుసంధానం చేశారు. ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారో ఏడు సెకన్లపాటు వీటిపై కనిపిస్తుంది. వీవీ ప్యాట్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు కార్యచరణను రూపొందిస్తున్నారు. ఓటర్లకు, రాజకీయ నాయకులకు అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు మూడు దశల్లో మాక్ పోలింగ్‌ను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేతలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇంజనీరింగ్ నిపుణులతో కొత్త ఈవీఎంలు, వీవీ ప్యాట్ల మొదటి దశ తనిఖీని పూర్తి చేశారు. జిల్లాలో నర్సంపేట, పరకాల రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 810 బ్యాలెట్ యూనిట్లు, 630 కంట్రోల్ యూనిట్లు, 680 వీవీ ప్యాట్లు వచ్చాయి. జిల్లాలో 504 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మూడు దశల్లో.. పోలింగ్ కేంద్రాల పరిధిలో మాక్ పోలింగ్‌ను మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ రంగాల నిపుణులు, అధికారులు, మహిళా సంఘాలు, విద్యావేత్తలకు కొత్త ఈవీఎంల పనితీరుతోపాటు ఓటు హక్కు వినియోగంపై వివరించనున్నారు. రెండో దశలో మండల కేంద్రాల్లో మహిళ సంఘాలు, వివిధ విభాగాల అధికారులు, రాజకీయ నాయకులకు అవగాహన కల్పించనున్నారు. మూడో దశలో ప్రతి గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాలకు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఒకటో తేదీ నుంచి.. అక్టోబర్ 1 నుంచి నియోజకవర్గ స్థాయిలో, 3న మండల స్థాయిలో, నాలుగు నుంచి గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అన్ని గ్రామాలు పూర్తయ్యే వరకు 15 రోజులపాటు సదస్సులు నిర్వహిస్తాం. కార్యక్రమంలో ఓటర్లంతా పాల్గొని సహకరించాలి. – ముండ్రాతి హరిత, జిల్లా కలెక్టర్ -
కాటారంను రెవెన్యూ డివిజన్ చేయాలి
హన్మకొండ అర్బన్ : భూపాలపల్లి జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదించిన మహాదేవపూర్, మహాముత్తారం, మలా్హర్, కాటారం మండలాలను కలిపి కాటారం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు శనివారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో శోభకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, తాడిచర్ల జెన్కో భూసేకరణ పూర్తి చేయా ల్సి ఉన్నందున భవిష్యత్ అవసరాలు, అభివృద్ధి, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాటారం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపాలని కోరారు. గుండాల శ్రీనివాస్, అందె భాస్కరాచారి, అయితనేని నవీన్‌రావు, సోమ శాంతకుమార్ సమ్మయ్య, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఏఓగా కృష్ణమోహన్
హన్మకొండ అర్బన్: వరంగల్ కలెక్టరేట్ పరిపాలన అధికారిగా కృష్ణమోహన్ నియామకమయ్యారు. ఇప్పటివరకు ఏఓగా విధులు నిర్వర్తించిన మార్గం కుమారస్వామి ఇటీవల ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో కృష్ణమోహన్‌ను నియమిస్తూ కలెక్టర్ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కృష్ణమోహన్ గతంలో సుదీర్ఘకాలంపాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయం సూపరింటెండెంట్‌గా పనిచేశారు. 2009లో అప్పటి కలెక్టర్ జనార్దన్‌రెడ్డి బదిలీ తర్వాత ఆయన పర్వతగిరి తహసీల్దార్‌గా బదిలీపై వెళ్లారు. అనంతరం రఘునాథపల్లి, భూ పా లపల్లిలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై డ్వామాలో మహబూబాబాద్ ఏపీడీగా పనిచేస్తున్నారు. అనూహ్యంగా తెరపైకి ఏఓ కుమారస్వామి ఉద్యోగ విరమణ పొం దుతారనే విషయం తెలుసుకున్న ప్రోడీటీలు, ప్రోమోటీల్లో కొంతకాలం వరకు హైడ్రామా నెలకొంది. ప్రస్తుతం కలెక్టరేట్లో సీ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఓ అధికారి పేరును కొందరు ప్రతిపాదించారు. అదే సమ యంలో తహసీల్దార్ల సంఘం నాయకులు ప్రసుత్తం జనగామ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చెన్నయ్య పేరును కూడా ఏఓగా ప్రతి పాదించారు. ఈ రెండు పేర్లతోపాటు మరి కొందరి పేర్లు కూడా కలెక్టర్ పరిశీలనకు పంపగా.. అనూహ్యంగా కృష్ణమోహన్ పేరు ను ఉన్నతాధికారులు ఫైనల్ చేశారు. ఇదిలా ఉండగా, కలెక్టర్ క్యాంపు కార్యాలయం సూపరింటెండెంట్‌గా పనిచేసిన కాలంలో సుమారు 18 మంది ఐఏఎస్ అధికారుల వద్ద కృష్ణమోహన్ పనిశారు. భూపాలపల్లిలో పనిచేస్తున్న సమయంలో రాజకీయ ఇబ్బందులతో డిప్యూటేషన్‌పై డ్వామాకు వెళ్లారు. ప్రస్తుతం మాతృశాఖలో చేరి కలెక్టరేట్‌కు ఏఓగా వస్తున్నారు. -
వరంగల్ కలెక్టరేట్ జప్తునకు కోర్టు ఆదేశాలు
హన్మకొండ అర్బన్: బాధితులకు డబ్బులు చెల్లించే విషయంలో జిల్లా యం త్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం (మూవబుల్ ప్రాపర్టీ) జప్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు బాధ్యతను జిల్లా కోర్టుకు అప్పగించింది. 2006లో జిల్లా యంత్రాంగం ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో జిల్లాలోని సుమారు 500 మంది టీచర్లకు ఆంగ్ల బోధనపై శిక్షణ ఇప్పించింది. ఇందుకు సంబంధించి ఎల్టా అనే సంస్థకు రూ.1.50 లక్షలు చెల్లించే విష యంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఎల్టా ప్రతినిధులు జిల్లా కోర్టును ఆశ్రయించగా, కలెక్టరేట్ జప్తునకు ఆదేశాలు ఇచ్చింది.. దీనిపై అధికారులు స్టే తెచ్చుకుని అప్పీలుకు వెళ్లారు. చివరకు హైకోర్టు కూడా ఎల్టాకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాధితులకు డబ్బు చెల్లించని కారణంగా కలెక్టరేట్ జప్తునకు గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఎత్తివేస్తూ ఆవే ఉత్తర్వులు అమలు చేయాలని చెప్పింది. ఈ క్రమంలో బాధితులు జిల్లా కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకుని గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు. స్పందించిన కోర్టు ఖర్చులతో కలిపి బాధితులకు రూ.2.06 లక్షలు చెల్లించాలని ఆదే శించింది. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని జప్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు అమల్లో భాగంగా ఫీల్డ్ అధికారి సత్తార్, ఎల్టా తరపున జిల్లా కోర్టులో వాదించిన న్యాయవాది హరిహరరావు కలెక్టరేట్ అధికారులకు ఉత్తర్వుల కాపీలు అందజేశారు. దీంతో వారంలో డబ్బులు చెల్లించే విధంగా అధికారులకు- ఎల్టా ప్రతినిధులకు మధ్య ఒప్పందం కుదిరిందని ఎల్టా ప్రతినిధులు కొమురయ్య, శ్రీనివాస్ తెలిపారు. -
కలెక్టరేట్ ఇక ఈ-ఆఫీస్
నక్కలగుట్ట : వరంగల్ కలెక్టరేట్ ఇక ఈ-ఆఫీస్‌గా మారనుంది. జిలాల కలెక్టరేట్లోని ఫైళ్లనీ ఇకనుంచి ఆన్లైన్ లో కరస్పాండెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతి ఫైల్‌ను ఒక్క సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు వెళ్లాలన్నా ఆన్లైన్లోనే పంపనున్నారు. దీనికి గానూ కలెక్టరేట్ లోని ప్రతి సెక్షన్ అధికారికి ఈ-మెయిల్ క్రియేట్చేసి ఒక్క డిజిటల్ టోకెన్ కేటాయిస్తారు. జూలై ఒక్కటి నుంచి ఏడు వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన డిజిటల్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డిజిటల్ ఇండియా వారోత్సవాలుగా నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐ.టి.శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ-ఆఫీసుల నిర్వహణ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ర్టం లోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ-ఆఫీసులుగా మార్చాలని నిర్ణయం తీసుకుని సెప్టెంబర్‌లోగా ఈ ప్రతిపాదనను పూర్తి చేయూలని భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల అధికారులు ఎక్కడ ఉన్నా పనులు చకచకా అయ్యే అవకాశాలు ఉన్నారుు. కలెక్టరేట్‌తో పాటు వరంగల్ గ్రేటర్ నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయూల్లో సైతం ఈ- ఆఫీస్‌గా మార్చేందుకు అన్ని విభాగాల్లోనూ సన్నాహాలు కొనసాగుతున్నారుు. ఈ కార్యకర్యక్రమం విజయవంతం అరుుతే జనగామ మున్సిపాలిటీ, జిల్లాలోని నగర పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో కూడా ఇ- ఆఫీఆఫీసు అమలులోకి రానున్నాయి.