నయీం కేసు : జైలు అధికారులపై చర్యలు
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కేసును సీరియస్గా తీసుకున్నామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. నయీం కేసులో అరెస్టైన నిందితులకు రాజభోగాలు కల్పించిన అధికారులపై జైళ్ల శాఖ తాజాగా చర్యలకు రంగం సిద్ధం చేసింది.
ఇప్పటికే ఈ ఘటనలో వరంగల్ జైలు మాజీ జైలర్ గోపిరెడ్డిని సస్పెన్షన్ చేయగా మరో కొంతమంది అధికారులకు బుధవారం మెమాలు జారీ చేసింది. మెమోలు అందుకున్న వారిలో వరంగల్ రేంజ్ జైళ్ల శాఖ డీఐజీ కేశవనాయుడు, మాజీ సూపరింటెండెంట్ న్యూటన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డి.ఎం శ్రీనివాస్, డిప్యూటి జైలర్ సుభాష్ సహా మరో నలుగురు వార్డెన్లు ఉన్నారు.