నయీం కేసు : జైలు అధికారులపై చర్యలు | Memos to warangal jail officers in nayeem case Accused luxury facility in jail | Sakshi
Sakshi News home page

నయీం కేసు : జైలు అధికారులపై చర్యలు

Published Wed, Dec 21 2016 5:26 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

నయీం కేసు : జైలు అధికారులపై చర్యలు - Sakshi

నయీం కేసు : జైలు అధికారులపై చర్యలు

హైదరాబాద్:  గ్యాంగ్స్టర్ నయీం కేసును సీరియస్‌గా తీసుకున్నామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. నయీం కేసులో అరెస్టైన నిందితులకు రాజభోగాలు కల్పించిన అధికారులపై జైళ్ల శాఖ తాజాగా చర్యలకు రంగం సిద్ధం చేసింది.

ఇప్పటికే ఈ ఘటనలో వరంగల్ జైలు మాజీ జైలర్ గోపిరెడ్డిని సస్పెన్షన్ చేయగా మరో కొంతమంది అధికారులకు బుధవారం మెమాలు జారీ చేసింది. మెమోలు అందుకున్న వారిలో వరంగల్ రేంజ్ జైళ్ల శాఖ డీఐజీ కేశవనాయుడు, మాజీ సూపరింటెండెంట్ న్యూటన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డి.ఎం శ్రీనివాస్, డిప్యూటి జైలర్ సుభాష్ సహా మరో నలుగురు వార్డెన్లు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement