వరంగల్ కేవీలో క్లస్టర్ లెవల్ యోగా పోటీలు
కాజీపేట రూరల్ : హన్మకొండ మండలం కడిపికొండలోని వరంగల్ కేంద్రీయ విద్యాలయ నందు మంగళవారం క్లస్టర్ లñ వల్ యోగా పోటీలు ఘనంగా జరిగాయి.
ఈ పోటీల్లో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం కేవీ విద్యార్ధులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కేవీ ప్రిన్సిపాల్ హనుముల సిద్దరాములు పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను, విశిష్టతను వివరించారు. భారత ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు యోగాను ప్రవేశపెట్టి నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈ పోటీల్లో బాలికల విభాగంలో కేవీ వరంగల్ ప్రథమ, మహబూబాబాద్ ద్వితీయ, కేవీ ఖమ్మం తృతీయ, జూనియర్ బాలుర విభాగంలో ఖమ్మం ప్రథమ, వరంగల్ ద్వితీయ, కేవీ మహబూబాబాద్ తృతీయ, అదేవిధంగా సీనియర్ బాలిక విభాగంలో వరంగల్ ప్రథమ, ఖమ్మం ద్వితీయ స్థానాల్లో నిలిచారు, సీనియర్ బాలుర విభాగంలో వరంగల్ ప్రథమ, కేవీ ఖమ్మం ద్వితీయ స్థానాల్లో గెలుపొందారు. ప్రథమ స్థానాల్లో నిలిచిన విజేతలు రీజినల్ లెవల్ యోగా పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు.