water blockade
-
జల దిగ్బంధంలో గజగజ
కుత్బుల్లాపూర్/సుభాష్‌నగర్: ఆ కాలనీ వాసులు జల దిగ్బంధంలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ క్షణమొక యుగంగా గడుపుతున్నారు. చినుకు పడిందంటే ఈ కాలనీ ప్రజలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గాజుల రామారం డివిజన్లోని ఓక్షిత్ ఎన్‌క్లేవ్‌ను నాలుగు రోజులుగా జల వలయం వీడకపోవడంతో స్థానికులు నిద్రాహారాలు మాని కాలం వెళ్లదీస్తున్నారు. సమస్య ఉత్పన్నమైనప్పుడే అధికారులు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారే తప్ప ఆ తర్వాత ఇటువైపు చూసిన పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ఓక్షిత్ ఎన్క్లేవ్ కాలనీ వరద నీట మునిగింది. ఆదివారం వరకూ తేరుకోకపోవడంతో ఇక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకిలా..? సూరారం గ్రామాన్ని ఆనుకుని సర్వే నంబర్ 70, 71లలో 24.22 ఎకరాల్లో రామారం పెద్ద చెరువు విస్తరించి ఉంది. చెరువు ఎగువ ప్రాంతంలోని లింగా చెరువు, కొత్తచెరువు, ఎర్ర చెరువు, మానింగ్ ఒంపులలోని వర్షపు నీరు రామారం చెరువులో వచ్చి చేరుతోంది. భారీ వర్షం వచ్చినప్పుడు రామారం చెరువు ఉద్ధృతంగా ప్రవహించి పరిక చెరువులో కలుస్తోంది కట్టు కాల్వను ప్లాట్లుగా మార్చి.. వెంచర్ ప్రారంభంలో కాలనీలో ఉన్న మొత్తం ప్లాట్లు అమ్ముడుపోగా.. కొంతమంది కళ్లు కాలనీ నుంచి వెళ్తున్న 30 ఫీట్ల కట్టు కాల్వపై పడ్డాయి. దీనిని ప్లాట్లు చేసి రూ.కోట్లు గడించారు. ఏడేళ్ల క్రితం ప్లాటింగ్ చేస్తున్న సమయంలో మూడేళ్ల వరకు వర్షాలు అంతంత మాత్రమే పడడం, ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల అండదండలు ఉండడంతో కట్టు కాల్వపై నిర్మాణాలు వెలిశాయి. కబ్జా బాగోతం వెలుగులోకి.. 2022లో భారీ వర్షాలు పడడంతో వర్షపు నీరు దిగువ ప్రాంతానికి వెళ్లేందుకు మార్గం లేక కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో కాలనీవాసులు రెండు నెలలుగా పడరాని పాట్లు పడ్డారు. ఈ విషయమై ‘సాక్షి’ పలుమార్లు వెలుగులోకి తెచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పరిశీలన.. కట్టు కాలువ కబ్జా విషయమై గాజుల రామారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది మార్చి నెలలో గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ, పీసీబీ, ఫారెస్ట్, జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు పరిశీలించి వెళ్లారే తప్ప చర్యలు తీసుకోలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పరిశీలించిన అనంతరం 274 నిర్మాణాలు కట్టు కాల్వపై వెలిసినట్లు గుర్తించారు. వీటిలో 24 నిర్మాణాలను తక్షణమే తొలగించాలని మార్కింగ్ కూడా వేశారు. కానీ అంతటితోనే ఆపివేయడం గమనార్హం. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. ప్లాటు కొనుగోలు చేసేటప్పుడు కాలనీలో సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ చెప్పారు. అసలు కట్టు కాల్వపై ప్లాట్లు చేశారనే విషయమే మాకు తెలియదు. గత ఏడాది నుంచి భారీ వర్షాలు పడటంతో కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంటోంది. అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలి. – శంకరాచారి, ఓక్షిత్ ఎన్క్లేవ్ కాలనీ వాసి -
యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృత స్థిరంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా వజీరాబాద్, చంద్రావాల్, ఓక్లాలోని నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మూసివేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనగానే వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు వరద తీవ్రత దృష్ట్యా నగరంలో విద్యా సంస్థలు, అత్యవసర కార్యకలాపాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురువారం సెలవు ప్రకటించింది. ఆదివారం దాకా సెలవు అమల్లో ఉంటుందని పేర్కొంది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలు రాకూడదని స్పష్టం చేసింది. రోడ్లపై నీరు పొంగిపొర్లుతుండడంతో తూర్పు ఢిల్లీలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వరదల ప్రభావం మెట్రోరైలు వ్యవస్థపైనా పడింది. ముందు జాగ్రత్త చర్యగా యమునా నదిపై ఉన్న పట్టాలపై మెట్రోరైలు వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్లోకి ప్రయాణికులను అనుమతించడంలేదు. పంజాబ్, హరియాణాల్లోనూ... చండీగఢ్: పంజాబ్, హరియాణాలనూ వర్షాలు, వరద ఇంకా వదల్లేదు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకోలేదు. విద్యా సంస్థలకు సెలవులను పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 16 దాకా పొడిగించింది. ఢిల్లీలో యమునా నది వరదకు కారణమైన హరియాణాలోని హత్రికుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గించారు. వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 21 మంది మృతిచెందారు. హిమాచల్‌లో సురక్షిత ప్రాంతాలకు పర్యాటకులు సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, కొండ చరియలు విరిగిపడడం వల్ల ఉన్నచోటే చిక్కుకుపోయిన పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం చందర్తాల్ నుంచి 256 మందిని తరలించారు. గత నాలుగు రోజుల్లో 60 వేల మంది పర్యాటకులను తరలించినట్లు అధికారులు చెప్పారు. కాసోల్, ఖీర్గంగలో 10 వేల మంది చిక్కుకుపోయారు. వారు తమ కార్లను వదిలేసి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. హిమాచల్‌లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 91కు చేరుకుంది. 14 మంది గల్లంతయ్యారు. కేజ్రివాల్ ఇంటి వద్దకు వరద నీరు ఢిల్లీలోని కీలక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. సెక్రెటేరియట్ ఏరియాలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం జలమయంగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసం వద్దకు వరద నీరు చేరింది. కాశ్మీరీ గేట్ బస్ టెరి్మనల్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను నిలిపివేశారు. ప్రఖ్యాత ఎర్రకోట గోడల వరకూ యమునా నది నీరు చేరుకుంది. ఇక్కడ మోకాళ్ల లోతు నీటిలో జనం నడిచి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రాజ్‌ఘాట్, పురానా ఖిలా సైతం జలమయమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుశ్రుత ట్రామా కేర్ సెంటర్ మునిగిపోవడంతో 40 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. -
జలదిగ్బంధంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్
-
పునరావాసం మిగిలింది..
ఇది ఆదిలాబాద్ మండలం చించుఘాట్ నుంచి గుండంలొద్ది గ్రామానికి వెళ్లే దారి. భారీ వర్షాల కారణంగా లక్ష్మీపూర్ ప్రాజెక్టు(గుండంలొద్ది) పొంగి పొర్లడంతో వరద ధాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో గుండంలొద్దికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామంలో 30 ఇళ్లు ఉండగా, సుమారు 150 నుంచి 200 మంది నివసిస్తున్నారు. వారం రోజులుగా ఈ గుండంలొద్దిని చేరుకోలేని పరిస్థితి. కొంత వరద ప్రభావం తగ్గడంతో ఇప్పుడు ఆ గ్రామానికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసే పని మొదలైంది. ఆ గ్రామానికి వెళ్లే దారి లేకపోవడంతో ఆదివాసీ నవయువ సూర్యవంశీ యూత్ సభ్యులు ఇలా వాగులో ఒకవైపు నుంచి మరోవైపునకు వరుసగా నిలబడి ఒక చెయ్యి నుంచి మరో చెయ్యికి సామగ్రి అందజేస్తూ ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేర్చి గ్రామంలోని ప్రజలకు సహాయ పడుతున్నారు. ఇలా అధికార యంత్రాంగంతోపాటు యూత్, స్వచ్ఛంద సంస్థలు తలా ఒక చెయ్యి వేస్తే జిల్లాలో పునరావాసం వేగిరమయ్యే అవకాశం ఉంటుంది. సాక్షి, ఆదిలాబాద్: వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం విరామం ఇచ్చింది. ఇక వరద బాధితుల పునరావాసం మిగిలింది. ఇప్పటికీ అనేక గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలకు యంత్రాంగం చేరుకోవాల్సిన అవసరం ఉంది. వారిని అన్నివిధాలా ఆదుకొని పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ముందుంది. జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. వరద బాధితుల సహాయార్థం తలో చెయ్యి వేయాలన్న కలెక్టర్ పిలుపు మేరకు పలువురు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దుస్తులు, ఇతరత్ర సామగ్రిని అందజేశారు. ఇప్పుడు బాధి తులకు వాటిని చేరవేస్తున్నారు. మరోవైపు స్వచ్ఛంద సంఘాలు ముందుకు వచ్చి బాధితులకు ఆసరాగా నిలుస్తున్నాయి. పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లలోకి చేరుకుంటున్నారు. చెత్త, బురదమయం.. వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు ఇటు జిల్లాకేంద్రంలోని కాలనీలతోపాటు గ్రామాల్లో ఎటుచూసినా చెత్త, బురదమయంగా కనిపిస్తోంది. వరద నీరు కారణంగా బావులు కలుషితం అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి నీళ్లు తాగిన ప్రజలు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పారిశుధ్యం ప్రధాన సమస్యగా ఉంది. గ్రామాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. దీంతో అతిసార, డయేరియా వ్యాధుల ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో జనవరి 1 నుంచి ఇప్పటివరకు 10వేల డయేరియా కేసులు, మలేరియా రెండు కేసులు నమోదయ్యాయి. డెంగీ 35 కేసులు పాజిటీవ్ వచ్చాయి. అందులో మూడు కేసులు మాత్రమే ప్రభావం అధికంగా ఉందని నిర్ధారిం చారు. వారికి చికిత్స అందజేశారు. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ పరిస్థితి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో కృష్ణవేణి అనే నాలుగేళ్ల చిన్నారి డయేరియాతో మృతిచెందింది. యంత్రాంగాల సమన్వయం.. జిల్లాలో వరద ముప్పు క్రమంగా తగ్గుతుండడంతో జిల్లా యంత్రాంగం సమన్వయంగా గ్రామాల్లో రక్షిత చర్యలు చేపడుతోంది. ప్రధానంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల ద్వారా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో క్లోరిన్ బిళ్లలను సరఫరా చేస్తున్నారు. తాగే నీటి కుండలో ఒక క్లోరిన్ బిళ్ల వేసి ఆరు గంటల తర్వాత నీరు తాగాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఫార్మాసిస్ట్ ద్వారా ఆశ వర్కర్లకు ఈ బిళ్లలను సరఫరా చేశారు. వారు గ్రామాల్లో ప్రజలకు అందజేయాల్సి ఉంది. అన్ని మండలాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా డయేరియా, అతిసార ప్రభావం అధికంగా ఉంటే మూడు రోజుల నుంచి వారం రోజులపాటు శిబిరాలను కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రధానంగా రెండు రోజులపాటు జ్వరం తగ్గని పక్షంలో ఆస్పత్రిలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ట్యాంకుల్లో, బావుల్లో క్లోరినేషన్ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాను పెంచడం జరిగింది. సోమవారం లక్షా 20వేల లీటర్లు, మంగళవారం 50వేల లీటర్లు పట్టణంలో సరఫరా చేశారు. గ్రామాల్లోని రక్షిత మంచినీరు దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రామాలపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పారిశుధ్యం కోసం ప్రత్యేక డ్రైవ్.. గ్రామాల్లో ప్రస్తుతం పారిశుధ్యమే ఒక సవాల్‌గా మారింది. ప్రధానంగా ఇటీవల జిల్లాలోని 467 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులకు నియమించినప్పటికీ ఆ అధికారులు గ్రామాలపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖకు చెందిన అధికారులే ఇందులో 200లకు పైగా ఉన్నారు. ఆ అధికారులు ఇప్పుడు గ్రామాల్లో పంట నష్ట సర్వే చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారు ప్రత్యేక అధికారులుగా తక్షణం గ్రామాలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారించారు. ప్రధానంగా చెత్తాచెదారాన్ని తొలగించి బురదమయమైన చోట మొరం, మట్టితో మరమ్మతులు చేయించాల్సి ఉంది. బుధవారం నుంచి ఈ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గ్రామపంచాయతీల్లో కార్మికులు సమ్మెలో ఉండడంతో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. పారిశుధ్యం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఇదివరకే ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన మొదలైన తర్వాత ఆదేశించారు. ఇంతలోనే జిల్లాలో భారీ వర్షాలు కురువడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఈ డ్రైవ్‌కు సంబంధించి అధికారులు ప్రస్తుతం చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా కార్మికులను నియమించుకొని ఈ పని చేపట్టాలని యోచిస్తున్నారు. మరోపక్క 14వ ఆర్థిక సంఘంకు చెందిన నిధులను ఈ పనులకు ఉపయోగించుకునే దిశగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు స్పెషల్ సానిటేషన్ డ్రైవ్‌పై దృష్టి సారించారు. సానిటేషన్ డ్రైవ్‌కు సిద్ధం జిల్లాలో పారిశుధ్య పనులను వేగిరం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. కొంతమంది కార్మికులను నియమించుకొని ఈ పనులు చేపడతాం. ప్రత్యేక అధికారుల్లో 200 మందికి పైగా వ్యవసాయ పంట నష్టం సర్వేలో ఉండడంతో మిగిలిన ఈఓఆర్డీ, ఎంపీడీఓ, జెడ్పీ, కోఆపరేటీవ్, తదితర సిబ్బంది సహకారంతో ఈ డ్రైవ్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే బావుల్లో క్లోరినేషన్ చేశాం. మురుగు నీటి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది. మట్టి, మొరంతో బురద ప్రాంతాలను సరిచేస్తున్నాం. – జితేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ, ఆదిలాబాద్ -
జల దిగ్బంధంలో బీర్సెట్టిపల్లి గ్రామం
రంగారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి కురుస్తున్న వానకు పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. తాండూరు మండలం గోనూర్ పంచాయతీ బీర్సెట్టిపల్లి గ్రామం జల దిగ్బంధానికి గురయింది. గ్రామానికి రెండు వైపులా ఉన్న వాగులు పొంగిపొర్లడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బుధవారం మేకలను మేపేందుకు వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న నర్సప్ప, సుశీలమ్మ అనే కాపరులను గురువారం ఉదయం గ్రామస్తులు రక్షించారు. -
రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
సాక్షి, హైదరాబాద్, విజయవాడ: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో రైళ్లు, బస్సు రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పట్టాల మీదుగా వరదనీరు ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను దక్షిణ మధ్య ైరె ల్వే రద్దు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద వరద ఉద్ధృతి అతి ప్రమాదకరంగా ఉండటంతో ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేశారు. శ్రీకాకుళం జిల్లా జాదూపూడి-ఇచ్చాపురం మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై గురువారం ఉదయం వర్షపు నీరు 2 మీటర్లకు పైగా రావడంతో హౌరా వైపు నుంచి రావల్సిన పలు రైళ్లను నాగపూర్, బలార్ష, వరంగల్ మీదుగా విజయవాడకు నడిపారు. రద్దయిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలు: భువనేశ్వర్-విశాఖపట్టణం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లను గురువారం రద్దయ్యాయి. హౌరా-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, హౌరా- హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంతపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-జగదల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లను అంగుల్, విశాఖపట్నంల మీదుగా మళ్లించారు. త్రివేండ్రం-గువాహతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-న్యూ జల్పాయ్గురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్, ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా ఎక్స్‌ప్రెస్‌లను విజయనగరం, టిట్లాఘర్ జంక్షన్ల మీదుగా మళ్లించారు. సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, కొచువేలి-గువాహతి ప్రత్యేక రైలు, యశ్వంత్‌పూర్-షాలిమార్ ప్రత్యేక రైలు, పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంత్‌పూర్, హైరా-చెన్నై, షాలీమార్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్, భాగల్పూర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, గువాహతి-త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లను ఖరగ్‌పూర్, టాటానగర్, బల్లార్షా, వరంగల్ మీదుగా మళ్లించారు. షాలీమార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సత్యసాయి ప్రశాంతి నిలయం ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా ఎక్స్‌ప్రెస్‌లను వరంగల్ మీదుగా మళ్లించారు. వర్షపాత వివరాలు (సెంటీ మీటర్లలో) కళింగపట్నం : 32 ఒంగోలు : 31 అచ్చంపేట : 22 కాకినాడ, టెక్కలి : 20 దర్శి : 18 పత్తిపాడు : 15 అద్దంకి, మందస : 14 పిడుగురాళ్ల, పలాస, దేవరకొండ : 13 బాపట్ల, భీమిలి, ఇచ్చాపురం, మాచర్ల : 12 సోంపేట, విజయనగరం, అవనిగడ్డ : 11 విశాఖపట్నం, పాతపట్నం, సీతారాంపురం,కల్వకుర్తి, చేవెళ్ల : 10 అనకాపల్లి : 9 రణస్థలం, పాలకొండ, సత్తెనపల్లి, గజపతినగరం, ఆత్మకూరు(కర్నూలు జిల్లా), నాగర్‌కర్నూలు, సుల్తానాబాద్ : 8 తెర్లాం, చీపురుపల్లి, గుంటూరు, కోడేరు, మచిలీపట్నం, గుత్తి, కొల్లాపూర్, మెదక్ : 7 ఎస్‌కోట, తెనాలి, గుడివాడ, భీమవరం, ఎర్రగొండపాలెం, లక్కిరెడ్డిపాలెం,రామన్నపేట, సూర్యాపేట, ఇబ్రహీంపట్నం, పరకాల : 6 5 సెం.మీ. లోపు వర్షపాతం మంగళగిరి, రెంటచింతల, నర్సాపురం, కందుకూరు, విజయవాడ, కుంబం, వీరఘట్టం, ఉదయగిరి, అచ్చంపేట, పొదిలి, రేపల్లె, బొబ్బిలి, చోడవరం, పత్తికొండ, కదిరి, పోరుమామిళ్ళ, ఏటూరునాగారం, పార్వతీపురం, వింజమూరు, నర్సీపట్నం, సిరిసిల్ల, తుని, రాజమండ్రి, యలమంచిలి, అరకు, కొమరాడ, నూజివీడు, ఔకు, మడకశిర, బద్వేలు, ఎమ్మిగనూరు, తాండూరు, దుబ్బాక, బాన్సువాడ, రామగుండం, వెంకటాపురం, మహబూబ్‌నగర్. -
జలదిగ్బంధం.. వర్ష ఉధృతితో నిలిచిన రాకపోకలు
సాక్షి నెట్వర్క్: భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని యన్నాదేవి వద్ద బసమ్మ వాగు చప్టాపై నాలుగడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో మాచర్ల వైపు పత్తితో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. చిలకలూరిపేట-నరసరావుపేట మార్గంలోని కావూరు వద్ద వాగు పొంగిన కారణంగా ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రకాశం జిల్లాలో 28 చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. ఒంగోలులో 50 కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని వైరానది పొంగి ప్రవహిస్తుండటంతో కంచికచర్ల, వీరులపాడు, నందిగామ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మండవల్లి మండలం పెనుమాకలంక, మణుదుర్రు రహదారిలో కొల్లేరు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుడివాడ, మచిలీపట్నంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాకినాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ముంపునీరు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరింది. రాజమండ్రి, అమలాపురం వంటి ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో రాజవొమ్మంగి మండలంలో మడేరు, అడ్డతీగల మండలంలో పెద్దేరు వాగులు పొంగి పొర్లుతుండడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వశిష్ఠ ఎడమ గట్టు 150 మీటర్ల పొడవునా గోదావరిలోకి కుంగిపోయింది. భోగాపురం మండంలో బుధవారం కొట్టుకుపోయిన కాజ్‌వేను ఇంకా పునరుద్ధరించకపోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జామి, వేపాడ మండలాల్లో ఎనిమిది కాజ్‌వేలపై రాకపోకలు నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లాలోని 14 మండలాల్లో 120 గ్రామాలు నీటి ముంపులో ఉన్నాయి. పాలకొండలో గజాలఖానా, మందసలో దామోదరసాగరం, సోంపేటలో పైడిగాం కాలువ, పలాసలో వరహాల గెడ్డతోపాటు పలుచోట్ల అనేక కాలువలు, చెరువులు పొంగి పొర్లుతూ రోడ్లపైకి రావడంతో వందకుపైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలోలోని ఏజెన్సీలో జంపన్నవాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 881 అడుగులు దాటిన శ్రీశైలం నీటిమట్టం వరద నీరు అధికంగా వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయ నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి 881.80 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 197.9120 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలమయం భారీ వర్షాలతో శ్రీశైలం జలమయమైంది. గురువారం ప్రధానాలయ మాడ వీధులన్నీ నీటితో నిండిపోయాయి. శ్రీగిరికాలనీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఇళ్లు, గుడిసెలలోకి నీరు ప్రవేశించడంతో ఆస్తినష్టం సంభవించింది. గంగాభవాని స్నానఘట్టాల ప్రాంతంలో రక్షణ గోడలు విరిగి పడిపోగా, మెట్లు, రోడ్డు మార్గం కోతకు గురైంది. భవనాశి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కొత్తపల్లి-ఆత్మకూరు మండలాల్లోని 20 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కురుకుంద గ్రామం నుంచి ఆత్మకూరుకు వస్తున్న ట్రాక్టర్ ఈ వాగులో చిక్కుకుపోగా ఇందులోని 40 మంది రైతులను తాళ్లసాయంతో పోలీసులు రక్షించారు. వైఎస్సార్ జిల్లాలో కోలుకోలేని దెబ్బ వైఎస్సార్ కడప జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు పెన్నా, కుందూ, సగిలేరు నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ముద్దనూరు మండలం కాండ్లోపల్లెకు వెళ్లే రహదారికి గండి పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తోకలపల్లె కాలువ కట్ట వద్ద 200 మీటర్లకు పైగా రోడ్డు కోతకు గురైంది. వాగులో చిక్కుకుపోయిన బస్సు.. గుంటూరు జిల్లా నరసరావుపేట పక్కనే ఉన్న కత్వవాగు పొంగి గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై మూడడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు 30 మంది ప్రయాణికులతో రాజమండ్రి వెళుతున్న ఎమ్మిగనూరు డిపో బస్సు వాగులో చిక్కుకుంది. వాగు ఉధృతి పెరగడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది మూడు పొక్లెయిన్లు, క్రేన్ వాగులోకి దించి ప్రయాణికులను సురక్షితంగాబయటకు తరలించారు. పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళుతూ.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదెం గ్రామానికి చెందిన నందిగం కవితకు బుధవారం అర్ధరాత్రి పురిటినొప్పులు రావటంతో ఆస్పత్రికి బయలుదేరారు. ఆమెను లారీ ఎక్కించి రెంటపాళ్ళ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటించారు. నరసరావుపేట శివారులో లారీ వాగులో చిక్కుకుంది. దీంతో ఆమెను 108 వాహనంలోకి ఎక్కించారు. ఆమె ఆ వాహనంలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వాగులో కొట్టుకుపోయిన బస్సు.. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం ఎదురాళ్లపాడులో ముసి వాగులో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. ఆర్టీసీ సిబ్బందితో పాటు 8 మంది ప్రయాణికులు బస్సుతో సహా వాగులో చిక్కుకుపోవంతో తీవ్ర ఆందోళనవ్యక్తమైంది. ఆ ఎనిమిదిమంది బస్సుపైకి ఎక్కి సహాయం కోసం కేకలు వేశారు. స్థానికులు దాదాపు 3గంటలు కష్టపడి తాళ్ల సహాయంతో వారిని రక్షించారు. యర్రగొండపాలెం మండలం గంజివారిపల్లికి చెందిన 30మంది పశువుల మేత కోసం నల్లమల అడవిలోకి వెళ్లి చిక్కుకుపోయారు. మరో 24 గంటలు వర్షాలే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దారి మళ్లింది. అయినా 24 గంటల పాట్లు(గురువారం సాయంత్రం 5 గంటల నుంచి) వర్షాలు తప్పవని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాలకు గురువారం రాత్రి నాటికి అల్పపీడనం భూ పై భాగానికి పయనిస్తోంది. మరో రెండు రోజుల్లో వాయవ్యంగా పయనించే అవకాశం ఉంది. దీని కారణంగా రానున్న 24గంటల్లో కోస్తాంధ్ర,తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ 20 సెం.మీ పైగానే వర్షం పడే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే మరో 48 గంటల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఢిల్లీ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వరద నీటిలోనే అంతిమ యాత్ర వరుసగా తుపాను, అల్పపీడనంతో ప్రకృతి కన్నెర్ర చేసిన శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో ఇదో విషాద ఘట్టం. ఊరి చుట్టూ వరద నీరు. గ్రామంలో మృతి చెందిన వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశమే లేదు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ మృతదేహాన్ని బహుదా నది నీటి ప్రవాహంలో విడిచిపెట్టేశారు. ఈ విషాద సంఘటన ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ గ్రామంలో జరిగింది. వర్షాల కారణంగా అస్వస్థతకు గురైన భుక్తో బెహరా అనే వృద్ధుడు గురువారం ఉదయం కన్నుమూశాడు. అంతిమ సంస్కారాలకు అవకాశం లేకపోవటంతో అతడి మృతదేహాన్ని వరద నీటి ప్రవాహంలో విడిచిపెట్టేశారు. -
తీరంలో కన్నీరు
చుట్టూ ఎటుచూసినా నీరు.. ప్రజల కంట కన్నీరు.. ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధం. వాగులను తలపిస్తున్న పంటపొలాలు. ప్రచండ గాలులకు నేలకొరిగిన చెట్లు. దెబ్బతిన్న ఇళ్లు. నీటి ఉధృతికి ధ్వంసమైన పడవలు, వలలు. రోజుల తరబడి వీడని అంధకారం. ఇదీ ఉద్దానం పల్లెల్లో కనిపిస్తున్న విషాద దృశ్యం. ఇంత ఘోరకలిలోనూ అందని ఆపన్న హస్తం. మాట సాయానికైనా ముందుకు రాని సర్కారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పర్యటనలతో హడావుడి చేసినా బాధితులకు ఉపశమనం కలిగించే ఒక్క హామీ అయినా ఇవ్వలేకపోగా.. నాలుగు రోజులవుతున్నా అధికార యంత్రాంగం గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. తక్షణ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. అంధకారం అలుముకున్న బాధితుల జీవితాల్లో ఇప్పట్లో వెలుగులు ప్రసరించే అవకాశం లేదు. కన్నీరు తుడిచే దిక్కూ లేదు. కొబ్బరి రైతుకు కోలుకోని దెబ్బ కవిటి: పై-లీన్ సృష్టించిన బీభత్సానికి నేలకూలిన పంటను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలో సుమారు 7వేల హెక్టార్లలో ఉన్న కొబ్బరి, జీడిమామిడి, పనస తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లి రైతుల వెన్నువిరిగి పోయినా ఆదుకోవడంలో ప్రభుత్వ జాప్యాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక కొద్దిగా వాలిన చెట్ల వేర్లను మట్టితో పూడ్చడం, దెబ్బతిన్న మొవ్వులను కత్తిరించడం, రాలిన కాయలు, కమ్మలను పోగు చేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. కూలిన చెట్లను తొలగించేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని నెలవంక, కపాసుకుద్ది, డీజీపుట్టుగ, కవిటి, జాగలి, భైరిపురం, రాజపురం, బెజ్జిపుట్టుగ, బొరివంక, వ రక, బల్లిపుట్టుగ, ఉలగాం, లండారిపుట్టుగ, పుటియాదళ రెవెన్యూ గ్రామాల పరిధిలో కొబ్బరి, అరటి, జీడి, మామిడి, పనస పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. తుపాను బాధితులను ఆదుకోవాలి పలాస రూరల్, న్యూస్‌లైన్: తుపానుతో పంటలు నష్టపోరుున రైతులతో పాటు రోడ్లు, విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించి తీరప్రాంత గ్రామాల ప్రజలను ఆదుకోవాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురం నుంచి వజ్రపుకొత్తూరు వరకు ఉద్దాన ప్రాంతంలో పాడైన పంటలు, తోటలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకార గ్రామ ప్రజలకు నెల రోజులు పాటు ప్రభుత్వమే పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు, భోజనం, నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు, హుకుంపేట, మందస మండలం గంగువాడ తదితర ప్రాంతాల్లో రూ.2 లక్షలు విలువ గల 100 నాటు పడవలు, రూ.20 లక్షలు విలువ గల మరబోట్లు, రూ.4 లక్షలు విలువ గల చిన్నపడవలతో పాటు 20 టన్నుల చేపలు, ఎండుచేపలు నాశనమయ్యాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు చెందిన బాధితులకు ఉచిత విద్యుత్ అందించాలని, కూలిపోరుున ఇళ్లస్థానంలో నూతనంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వారిలో కుల నిర్మూలన పోరాట కమిటీ నాయకుడు మిస్క కృష్ణయ్య, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోత ధర్మారావు, పి.దుర్యోధన, పౌరహక్కుల సంఘ సహాయ కార్యదర్శి పత్తిరి దానేసు తదితరులు ఉన్నారు. ఉప్పు రైతులను ఆదుకోవాలి శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తుపాన్ ప్రభావంతో ఉప్పుమడుల్లో నీరుచేరి పాడయ్యూయని, రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు. ఈ మేరకు కళింగపట్నానికి చెందిన ఉప్పురైతులు కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ని మంగళవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అరటి రైతుల గోడు వినేవారే కరువు నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: తుపాను తీవ్రతకు మండలంలో సాగుచేస్తున్న అరటి పంటకు తీవ్ర నష్టం సంభవించినా రైతుల గోడు వినేవారే కరువయ్యారు. కనీసం విరిగిన చెట్లను పరిశీలించేందుకు కూడా అధికారులు రాకపోకవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన అరటి పంట చేతికందివచ్చే సమయంలో కళ్లముందే ధ్వంసం కావడంతో గగ్గోలు పెడుతున్నారు. మండలంలో 65 ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసం కాగా రూ.50 లక్షల వరకూ నష్టం జరిగినట్టు అంచనా. ఎకరా వీస్తీర్ణంలో 400 చెట్లకు 350కు పైగా చెట్లు గెలలుతో ఉన్నాయి. ఇవన్నీ తుపాను గాలికి నేలకొరిగాయి. ఎకరాకు రూ.80వేలు చొప్పున నష్టం జరిగిందని అంచనా. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని కోమర్తి, దేవాది, మాకివలస, గోపాలపెంట, కిళ్లాం గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం కవిటి, న్యూస్‌లైన్: తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. మండలంలోని రాజపురం, కపాసుకుద్ది, జగతి తదితర గ్రామాల్లో నాయకుల బృందం పర్యటించి రైతులు, మత్స్యకారులు, సామాన్య ప్రజలు పడిన ఇబ్బందులను తెలుసుకుంది. పంట నష్టం పరిశీలనకు వచ్చిన మంత్రులు రఘువీరారెడ్డి, కృపారాణి, కోండ్రు మురళీ, శత్రుచర్ల, గంటా శ్రీనివాస్‌లు కనీసం తమ మాటలు కూడా వినకుండా వెళ్లిపోయారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. ఈ పర్యటనలో వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, పిరియా సాయిరాజ్, కణితి విశ్వనాథం, తమ్మినేని సీతారాం, బి.హేమమాలినీరెడ్డి, బి.మాధురి, వజ్జ బాబూరావు, కోత మురళీధర్, కె.వెంకటేశ్వరరావు, రమేష్‌కుమార్, పి. కామేశ్‌లు పాల్గొన్నారు. తుపాను తీవ్రత, బాధిత రైతులు, మత్స్యకారుల సమస్యలను పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి వివరిస్తామని తెలిపారు. పక్క ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కోనారి మల్లేసు. వజ్రపుకొత్తూరు మండలం రెయ్యిపాడు గ్రామం. ఎనిమిది ఎకరాల జీడి, రెండు ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి తోటలు ఉన్నాయి. వీటిద్వారా ఏటా రూ. 3 లక్షల ఆదాయం సమకూరుతుంది. తుపాను ధాటికి 55 జీడి చెట్లు, 15 కొబ్బరి, 90 టేకు మొక్కలు, 25 అకేషియా చెట్లు ధ్వంసమయ్యాయి. సుమారు రూ1.50 లక్షల నష్టం సంభవించింది. రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు నష్టాన్ని అంచనావేసేందుకు రాలేదు. గ్రామంలో సుమారు 125 మంది రైతుల పరిస్థితీ ఇదే. కూరగాయల పంటతో ఏటా రూ.30 వేలు వరకు సంపాదించుకునేవాడినని, తుపానుతో పంటలు పూర్తిగా నాశనమయ్యాయని వజ్రపు కొత్తూరు మండలం పెద్దమురహరిపురానికి చెందిన యలమంచిలి జగ్గారావు ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. పువ్వు పిందెలతో ఉన్న బీర పంట పూర్తిగా పాడైందని వాపోతున్నాడు. సుమారు.40 వేలు నష్టం సంభవించిందని వాపోతున్నాడు. సుమారు 30 గ్రామాల్లో రూ.19 లక్షల నష్టం సంభవించి ఉంటుందని రైతులు చెబుతున్నారు. చిత్రంలో నేలకూలిన అరటి చెట్లను చూపిస్తున్న రైతు పేరు బత్సల ధర్మారావు. రెయ్యిపాడు గ్రామం. ఇతనికి 4 ఎకరాల జీడి, కొబ్బరి తోటలు ఉన్నాయి. తుపానుకు తోటలోని అరటి, జీడి, కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. సుమారు 1.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ప్రతి మొక్కనూ కొడుకులా పెంచుకున్నామని, ఫలసాయం అందివచ్చే సరికి తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తేరుకోవడానికి దశాబ్దాలే..! ఇచ్ఛాపురం, న్యూస్‌లైన్: తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకోకుంటే మరో దశాబ్దం గడిచినా తేరుకోవడం కష్టమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నా యి. మండలంలోని తీరప్రాంతంలో ఉన్న 6 గ్రామాల మత్య్సకారులు తుపా ను ధాటికి అల్లాడిపోతున్నారు. బోట్లు, వలలు అలల ఉద్ధృతికి ధ్వంసం కావడంతో ఏంచేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సుమారు 40 పెద్ద బోట్లు, 65 చిన్నబోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో కొన్ని సముద్రం లో కొట్టుకుపోగా మిగిలినవి మరమ్మతులకు గురయ్యాయని బూర్జపాడు సర్పంచ్ జానకిరావు చెప్పారు. కుళ్లిపోయిన పది టన్నుల చేపలు తుపాను రాకముందు నిల్వ ఉంచిన చేపలు మార్కెట్ చేయలేకపోవడంతో కుళ్లిపోయాయి. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. రొయ్యల చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పద్మనాభపురం గెడ్డ పొంగడంతో ఇన్నీసుపేట, ధర్మపురం, తులసీగాం, రత్తకన్న, మం డపల్లి, తేలుకుంచి, మశాఖపురం గ్రామాల పరిధిలోని వందలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. అంధకారంలో 219 గ్రామాలు సరఫరా పునరుద్ధరణకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఇప్పటికీ 219 గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. తొలిరోజున 719 గ్రామాలు అంధకారంలో ఉండగా, మంగళ వారం నాటికి ఈ సంఖ్యను 219కి తగ్గించారు. అన్ని సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా అవుతున్నా గ్రామాలకు వెళ్లే విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సరఫరాకు ఆటంకం కలుగుతోంది. లైన్లు బాగుచేసేందుకు మరో రెండుమూడు రోజులు పట్టే అవకాశం ఉంది. పునరుద్ధరణ పనులతో ఉదయం సరఫరా నిలిపివేస్తుండడంతో మిగిలిన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు తొలి నుంచి ఇచ్ఛాపురంలో మకాం వేసి ఉండగా, ఎంపీడీసీఎల్ సీఎం కార్తీకేయ మిశ్రా సోమవారం ఇచ్ఛాపురం చేరుకొని పునరుద్ధరణ పనులు పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు, ఇతర జిల్లాలకు చెందిన ఎస్ఈ, డిఈ స్థాయి ఉద్యోగులందరూ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. అన్నదాతకు ఆర్థిక కష్టాలు పలాస, న్యూస్‌లైన్: ఉద్దానం ప్రాంత రైతులకు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నారుు. నేలకూలిన జీడి, కొబ్బరి, మునగ, పనస చెట్లను తొలగించేందుకు నానా యాతనలు పడుతున్నారు. చేతిలో పెట్టుబడి లేక మనోవేదన చెందుతున్నారు. ఉద్దానంలో సుమారు 20వేల హెక్టార్ల జీడి సాగవుతోంది. తుపాను ప్రభావంతో ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్టం జరిగి ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా. దీని ప్రకారం మొత్తం జీడి పంటకు సుమారు రూ.100కోట్లు నష్టం కలిగింది. అలాగే కొబ్బరికి మరో రూ. 25 కోట్లు నష్టం కలిగింది. పనస, మునగ, మామిడి, టేకు, సరుగుడు వనాలు సర్వనాశనమయ్యాయి. ఇంత భారీ నష్టం జరిగినా అధికారులు కనీసం గ్రామాల్లో పర్యటించిన దాఖలా లేవు. గ్రామాల్లో నేలకూలిని పూరిగుడిసెలు, విద్యుత్ స్తంభాలు, చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలు వందల సంఖ్యలో ఉన్నాయి. తుపాను పెనుగాలులకు ప్రాణ నష్టం లేకపోయిన ప్రజల బతుకులు ఛిద్రమయ్యా యి. మత్స్యకారులు వారం రోజుల పాటు జీవనోపాధిని కోల్పోయా రు. వజ్రపుకొత్తూరు మండలంలో 81 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 4 చెరువులకు గండ్లు పడ్డాయి. 9 రోడ్లు పాడయ్యాయి. 2 పశువులు మృత్యువాతపడ్డాయి. 24 పూరిళ్లు పూర్తిగా పడిపోయా యి. 180 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 25,980 జీడిచెట్లు విరిగి పోయాయి. 3761 కొబ్బరి చెట్లు నేలకొరిగారుు. 2005 ఎకరాల్లో 50 శాతం వరి పంటకు నష్టం జరిగింది. మందస మండలంలో 45 వేలు జీడిచెట్లు, 12 వేల కొబ్బరిచెట్లు, 15 ఎకరాల్లో అరటి చెట్లు ధ్వంసమయ్యాయి. 178 ఇళ్లు పూర్తిగా, 215 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 3500 విద్యుత్ స్తంభాలు, 7 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. 8 గొర్రెలు, ఒక ఎద్దు, ఒక గేదె మృత్యువాతపడ్డాయి. పలాస మండలంలో 20 వేల జీడిచెట్లు నేలమట్టమయ్యాయి. 2 వేలు కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యాయి. పనస, మామిడి, టేకు చెట్లు నేలమట్టమయ్యాయి. ఒక మేక మృతి చెందింది. అలాగే 20 పూరిళ్లు పూర్తిగా, 73 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉద్దాన ప్రాంతంలో వేలాది ఎకరాల్లో రైతులకు అపారమైన నష్టం జరిగింది. భయంకరమైన పై-లీన్ ప్రభావం నుంచి ప్రాంత వాసులు ఇంకా బయటపడలేదు. అధికారులు వస్తే తమ బాధలు చెప్పుకోవడానికి ఆశగా ఎదురుచూస్తున్నారు. హెక్టారుకు రూ.50వేలు చెల్లించాలి సోంపేట, న్యూస్‌లైన్: తుపానుతో కొబ్బరి, జీడిమామిడి, వరి తదితర పంటలు నష్టపోయిన కవిటి, సోంపేట మండలాల రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సీపీఎం ప్రతినిధులతో కలిసి సోంపేట, కవిటి మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం పర్యటించారు. సామూహిక వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కొబ్బరి ఉపకేంద్రాన్ని కవిటి మండలంలో ఏర్పాటు చేసి శాస్త్రవేత్తల సూచనలతో రైతులను ఆదుకోవాలన్నారు. చిన్నసన్నకారు రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను మాఫీ చేయాలని కోరారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.నారాయణరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహన్‌రావు, ఎ.సత్యనారాయణ, డి.సత్యం తదితరులు ఉన్నారు. తీరని నష్టం సోంపేట, న్యూస్‌లైన్: పై-లీన్ ప్రభావం సోంపేట మండల రైతులను దెబ్బతీసింది. తీరని నష్టం మిగిల్చింది. మండలంలోని పాలవలస గ్రామంలో సాగుచేస్తున్న టేకు తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గ్రామంలోని జి.కె.నాయుడుకు చెందిన సుమారు 5 ఎకరాల్లోని 2000 టేకు చెట్లు నేలకొరిగాయి. 1999లో వచ్చిన తుపాను వల్ల 500 చెట్టు పడిపోయాయని, ఇప్పుడు వచ్చిన తుపానుతో ఉన్న చెట్లు నేలకూలాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశాడు. అలాగే, శాసనాం గ్రామంలోని వి.మాధవరావుకు చెందిన టేకు తోటలో 300 చెట్లు పడిపోయాయి. మండలంలో సాగులో ఉన్న వరి, క్యాబేజీ, బీర, దొండ, వంగ, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపాను వర్షాలకు కూరగాయల పంటలు యువకపట్టాయి. -
భారీవర్షంతో అతలాకుతలం
సాక్షి, నెట్వర్క్ : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రెండురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు, వాగు లు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాల్లో పంటపొలాలు, పట్టణాల్లో లోత ట్టు ప్రాంతాలతోపాటు రోడ్లు జలమయమయ్యాయి.వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఏడుగురు మృతిచెందారు. వాగుదాటుతూ ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం జల దిగ్బంధమైంది. వందల ఎకరాల్లో పత్తి, మిరప పంటలు నీట ముగియాయి. దాచేపల్లి, కారంపూడి, మాచర్ల, గురజాల తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దాచేపల్లి పరిధిలోని నాగులేరు పొంగి ప్రవహించింది. గురువారం ఉదయం ఓ వ్యక్తి వాగునీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలో నీటి ప్రవాహ ఉద్ధృతికి పట్టాల కింద ఉన్న కంకర, ట్రాక్ ప్లేట్లు కొట్టుకుపోయాయి. మరమ్మతుల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కారంపూడిలో నాగులేరు నిండుకుండను తలపించింది. ఎర్రవాగు, తుమ్మలవాగు, కబోదివాగు, రాళ్లబండివాగు ఉద్ధృతి కార ణంగా సమీప పొలాల్లో పంటలు నీట మునిగాయి. గురజాల మండలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామ సమీపంలోని పాలేరు వాగు దాటుతూ విద్యార్థి షణ్ముఖం (14) గల్లంతయ్యాడు. సూర్యాపేటలోని సిద్ధార్థ స్కూల్లోఅతను 9వ తరగతి చదువుతున్నాడు. వరంగల్ జిల్లా కొడకండ్లలోని బయ్యన్నవాగులోకి భారీగా వరదనీరు చేరింది. తొర్రూరు, చిట్యాల, వెలికట్ట, బొమ్మకల్ గ్రామాల్లో చెరువులు అలుగు పోస్తున్నాయి. పత్తి, పెసర పంటలు నీట మునిగాయి. నెల్లికుదురు మండలంలో కాచికల్-ఎర్రబెల్లిగూడెం గ్రామాల మధ్య కల్వర్టు పొంగి ప్రవహిస్తోంది. తొర్రూరు-కేసముద్రం, నెల్లికుదురు-మహబూబాబాద్ మార్గాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. నర్సింహులపేటలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. డోర్నకల్‌లో మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కేసముద్రం మండలం ఇనుగుర్తిలో భారీ వర్షంతో పంటలు కొట్టుకుపోయాయి. కురవి, కేసముద్రం ఎస్సీకాలనీ, డోర్నకల్తోపాటు వరంగల్ నగరంలోని కరీమాబాద్ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయం (ఎల్ఎండీ) పూర్తిస్థాయిలో నిండడంతో గురువారం ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా విడుదల చేసిన 6 వేల క్యూసెక్కుల నీరు గురువారం మధ్యాహ్నం ఎల్ఎండీకి చేరడంతో పదోనంబర్ గేటు ఎత్తి రెండువేల క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి వదిలారు. దిగువ కాకతీయ కాలువకు నీటి విడుదలను నిలిపివేయడంతో శుక్రవారం మరో గేటు ఎత్తే అవకాశముంది. ఖమ్మం జిల్లా వైరా, కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల మండలాల పరిధిలో 6 సెంటీమీటర్లు, కొత్తగూడెం, ఖమ్మంలో 5సెంటీమీటర్ల వర్షపాతం పడింది. జలాశాయల్లో భారీగా నీరు చేరుతోంది. పిడుగుపాటుకు ఏడుగురి మృతి ఖమ్మం/శ్రీకాకుళం, న్యూస్‌లైన్: పిడుగుపాటుతో గురువారం ఖమ్మం జిల్లాలో వేర్వేరు ప్రాంతాలలో ఆరుగురు మృతిచెందగా, శ్రీకాకుళం జిల్లాలో మరొకరు మరణించారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాంతండాకు చెందిన భార్యాభర్తలు భూక్యా దీప్లా(38), భూక్యా పద్మ(35) పత్తి చేనుకు మందు వేసేందుకు వెళ్లారు. వర్షం వస్తుండడంతో ఓ చెట్టుకిందకు వెళ్లారు. ఆ సమయంలోనే పిడుగు పడి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కొత్తగూడెం మండలం రేగళ్ల శివారు పెద్దతండాకు చెందిన దారవత్ లింగి (35) నాట్లు వేసేందుకు వెళ్లాడు. భారీవర్షంతో ఇంటికి వెళుతుండగా, పిడుగు పడి మృతి చెందాడు. బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన బానోతు నాగమణి(28) పత్తిచేలో కలుపు తీస్తుండగా వర్షం మొదలైంది. చెట్టుకిందకు వెళ్లగా, పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. టేకులపల్లి మండలం మంగలితండాలో కౌలురైతు మోకాళ్ల భద్రయ్య (38) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి చెందిన పశువుల కాపరి సుపావత్ జామ్లా (60) పశువులను మేపుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో పిడుగు పడి, అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం కిరప గ్రామానికి చెందిన పాలక ప్రభాకర్ (18) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు.