జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలి
అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
చిత్తూరు(రూరల్): జిల్లాలో జల సంరక్షణ పనులను వేగవంతం చేసేలా నాయకులు కృషి చేయాలని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. చిత్తూ రు జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా సా ్థయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రేషన్‌షాపు డీల ర్ల భర్తీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక తరలింపులో అవ కతవకలు చోటు చేసుకోకుండా చూ డాలన్నారు. జీడీనెల్లూరు నేత కుతూహలమ్మపై వెదురుకుప్పం మండల నాయకులు ఫిర్యాదు చేసినట్టు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జెడ్పీ చైర్ పర్సన్ గీర్వాణీ, ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు.