water leval
-
జూరాలకు పొటెత్తుతున్న వరద
గద్వాల: గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 57,500 క్యూసెక్కులకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రెండు గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తి 65,650 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ కుడి కాలువకు 150 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
697 అడుగులకు ‘కడెం’ నీటిమట్టం
కడెం : కడెం ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పరివాహక కుప్టి, బోథ్, గుడిహత్నూర్, ఉట్నూర్, నేరడిగొండ, బజార్హత్నూర్ తదితర ప్రాంతాల్లో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో జలాశయానికి జలకళ సంతరించింది. రెండు రోజుల క్రితం నీటిమట్టం 695 అడుగులు. గురువారం సాయంత్రం వరకు 697 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 2,497 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుంది. కాగా ఎడమ కాలువ ద్వారా 755 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 42 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు జేఈ తడమల్ల శ్రీనాథ్ విలేకరులకు తెలిపారు. -
'శ్రీశైలంలో వాటర్‌లెవెల్ మెయింటేన్ చేయాలి'
కడప కార్పొరేషన్ : తెలంగాణ ప్రభుత్వం కరెంటు అవసరాల నిమిత్తం శ్రీశైలంలో నీటిని ఇబ్బడిముబ్బడిగా వాడేస్తున్నదని వైఎస్సార్సీపీ ఆరోపించింది. కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి, మేయర్ సురేష్‌బాబు విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం నీటి వాడకంపై వచ్చే సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి మహా ధర్నా చేయనున్నట్లు తెలిపారు.